Skip to main content

చైనా పెట్టుబడులకు ఇండియా చెక్


Photo: cnn.com

కరోనా పుణ్యమా అని భారత్ ఆలస్యంగానైనా కళ్లు తెరిచింది. మన సరిహద్దుల్ని ఆనుకునే ఉన్న డ్రాగన్ కంట్రీ కుట్రపూరితమైన ఆర్థిక సామ్రాజ్యవాదానికి తొలి చెక్ పెట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్న ఆపరేషన్లో భాగంగానే హుటాహుటిన ఎఫ్.డి.ఐ పాలసీని సవరించింది. దీని ప్రకారం మన దేశ సరిహద్దులు ఆనుకొని ఉన్న దేశాలు ఇకపై నేరుగా భారత్ లోని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం గానీ, పెట్టుబడులు పెట్టడం గానీ చేయడానికి వీల్లేదు. అలాగే భారత్ లోని కంపెనీలు కూడా యాజమాన్య హక్కుల బదలాయింపులు గానీ, కంపెనీల విస్తరణ గానీ, నూతన భాగస్వాములు, పెట్టుబడుల సేకరణ విషయంలో మన సరిహద్దుల్ని ఆనుకొని ఉన్న దేశాలతో కుదుర్చుకోవాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. తాజా ఎఫ్.డి.ఐ నిబంధనల సవరణ ప్రధానంగా చైనాను, అది విసిరే ఆర్థికపరమైన పెను సవాళ్లను ఎదుర్కోవడానికేనని భావిస్తున్నారు. 

 

చైనాను పూర్తిగా నమ్మి పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి ఇటలీలోని దేశీయ ఇండస్ట్రీని చేజేతులా నాశనం చేసుకున్న ఆ దేశం.. చాలా ఆలస్యంగా ఆ విషయాన్ని గుర్తించింది. కరోనా విజృంభించి శవాల దిబ్బగా మారిన తరుణంలోనే ఇటలీ పునరాలోచనలో పడింది. ఇటలీతో పాటు అదే స్థాయిలో దెబ్బతిన్న స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా చైనాతో వ్యాపార సంబంధాలపై కొత్తగా ఆంక్షలు విధించాయి. ఇప్పుడిదే అదునుగా భారత్ కూడా చైనా పెట్టుబడులకు చెక్ పెట్టింది. దీంతో చైనాలోని ఏ కంపెనీ, ఇండియాలోని ఏ కంపెనీతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటుంది? ఎంత పెట్టుబడి పెడుతుంది? దాని ఉత్పత్తులు ఏంటి? అనే కీలకమైన సమాచారం తెలుసుకునే వీలుంది. ఇప్పటివరకు ఇది ఉండేది కాదు. 

 

ఇప్పుడున్న ఎఫ్.డి.ఐ. నిబంధనలు అనుమతిస్తున్న ప్రకారం భారత్ లో ప్రతి 30 చిన్నతరహా కంపెనీల్లో 18 కంపెనీలకు చైనా పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని, ఇకపై అలాంటి అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. 2000 నుంచి 2019 వరకు 2.34 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (దాదాపు 15 కోట్లు) ప్రవహిస్తే, అదే బంగ్లాదేశ్ నుంచి 48 లక్షలు, నేపాల్ నుంచి 18 కోట్లు, మయన్మార్ నుంచి 35 కోట్లు, అఫ్ఘనిస్తాన్ నుంచి 16 కోట్లు వచ్చాయి. ఇక పాకిస్తాన్, భూటాన్ నుంచి ఎలాంటి పెట్టుబడులూ రాలేదు. ఇటీవల భారత్ లోని ప్రధాన ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్.డి.ఎఫ్.సి లోకి 1 శాతం పెట్టుబడులు పెంచడాన్ని భారత్ అనుమానిస్తోంది. చైనా ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలతో లబ్ధి పొందేది, పెట్టుబడులు పెట్టేది ఆ దేశంలోని కమ్యూనిస్టు పార్టీ నేతలేనని భారత్ ఎప్పుడో గుర్తించింది. ఇలాంటి పెట్టుబడులు భారత్ కు తెలిసి, అధికారికంగా, అనుమతుల ద్వారా వచ్చినవి కావు. మన దేశంలోని చిన్న కంపెనీలతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టిన పెట్టుబడులు. దక్షిణాసియా మీద కన్నేసినా చైనా ఇప్పటికే హిందూ మహాసముద్రాన్ని ఆనుకున్న దేశాలను గుప్పిట్లో పెట్టుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దు నిబంధనలు ఉపయోగించుకొని భారత్ లోకి దొడ్డిదారిన పెట్టుబడులు గుమ్మరించే యోచనలో ఉందని ఇటీవలి అనుభవాల్ని బట్టి భారత్ బలంగా అనుమానిస్తోంది. 

 

చైనా కదలికల మీద ఓ కన్నేసి ఉంచిన భారత్ కరోనా ప్రభావం కారణంగా నూతన పాలసీలు తీసుకురావడం మొదలు పెట్టిందని ఈ నిర్ణయంతో చెప్పకనే చెబుతోంది. ఆ నిర్ణయం కూడా చైనాతోనే మొదలుపెట్టడం.. ప్రపంచ దేశాలకు తానొక ప్రపంచ ఆర్థిక శక్తి అన్న సంకేతాలు పంపేందుకే అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అటు సెబీ కూడా భారత్ లోని అన్ని కంపెనీలకు పెట్టుబడుల ప్రవాహంపై వివరాలు కోరడం గమనించాల్సిన అంశం.  ఈ పరిణామంతో చైనా వస్తువులు ఇకపై ఇండియా మార్కెట్ లోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చే వీలుండదు. చైనా పెట్టుబడుల కోసం అర్రులు చాచే భారత్ లోని కొందరు పెట్టుబడిదారులకు చెక్ పకడుతుంది. స్వలాభాల కోసం సులువైన భారత మార్కెట్ మీద చైనా పెత్తనానికి బ్రేక్ పడుతుంది. అయితే ఎఫ్.డి.ఐ నిబంధనల సవరణ అనేది తొలి అడుగేనని, లాక్ డౌన్ నుంచి బయట పడ్డాక మరిన్ని పటిష్టమైన నిర్ణయాలు వెలువడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత