Skip to main content

వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక ప్రపంచ నాయకుడు


అనుసరించేవాడు ఫాలోయర్. నడిపించేవాడు లీడర్. ప్రపంచాన్నంతా అమెరికా శాసిస్తుంటే.. అమెరికాను ఇండియా శాసించకపోయినా ఫాలో అయ్యేలా మాత్రం చూసుకుంటోంది. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకొని, ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అమెరికా... పూర్తిగా ఇండియా మీద ఆధారపడిందనేందుకు ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఇటీవల కరోనా విజృంభించి మానవాళికి ముప్పుగా పరిణమించిన క్రమంలో ధనిక దేశాలు చాలావరకు ఇండియా వైపే చూశాయి. ఇండియా మీదనే ఆశలు పెట్టుకున్నాయి. అమెరికా కూడా ఆ జాబితాలోనే ఉండడం అందరం చూసిందే. అమెరికా ఏ స్థాయిలో ఇండియా మీద పూర్తి భరోసాగా ఉందనేందుకు ఇంతకన్నా చెప్పుకోదగ్గ నిదర్శనం అవసరం లేదు.అమెరికా పాలసీకి, పరిపాలనకు అద్దం పట్టే వైట్ హౌస్.. ఇండియాను ప్రముఖంగా ఫాలో అవుతోంది. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 


Also Read: చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్


అధికారిక ట్విట్టర్ అకౌంట్.. ద వైట్ హౌస్ కు 2 కోట్ల 16 లక్షల పైచిలుకు ఫాలోయర్స్ ఉండగా.. అది మాత్రం కేవలం 19 మందిని మాత్రమే ఫాలో అవుతోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఐదున్నర కోట్లకు పైగా ఫాలోయర్స్ ఉండగా.. 2,300 కు పైగా అకౌంట్ హోల్డర్స్ ను ఆయన ఫాలో అవుతున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే... వైట్ హౌస్ నరేంద్ర మోడీని మినహా ఏ ఒక్క ప్రపంచ లీడర్ ను కూడా ఫాలో అవడం లేదు. రెండో అగ్రరాజ్యమైన చైనాధీశుడు జిన్ పింగ్ గానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ గానీ, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్... ఇలా ఏ ఒక్క అగ్రరాజ్యానికి చెందిన అధినేతను సైతం వైట్ హౌస్ ఫాలో అవడం లేదు. ఆ 19 మంది ఫాలోయర్స్ లో కూడా 5 అకౌంట్లు ఇండియాకు చెందినవే కావడం విశేషం. 1) నరేంద్రమోడీ పర్సనల్ అకౌంట్, 2) పీఎంఓ ఇండియా, 3) ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 4) యూఎస్ ఎంబసీ ఇండియా, 5) ఇండియా ఇన్ యు.ఎస్.ఏ.   ఇక మిగిలిన అకౌంట్లు అన్నీ కూడా అమెరికాకు చెందినవే కావడం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశం. ఇప్పుడు ఆలోచించండి... ప్రపంచం ఎవరిని గుర్తిస్తుందీ.. ఎవరినీ ఫాలో అవుతుందో.


Ref: PM Narendra Modi only world leader White House follows on Twitter


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన