Skip to main content

2022 వరకు సామాజిక దూరం పాటిస్తేనే మనుగడ - హార్వర్డ్ యూనివర్సిటీ


Photo Credit: Shiksha.com


సామాజిక దూరాన్ని పూర్తి నిక్కచ్చిగా అమలు చేస్తేనే కరోనా వైరస్ ను శాశ్వతంగా నిర్వీర్యం చేయగలమని, పరిమిత దినాల పాటు లాక్ డౌన్ పాటించి ఆ తరువాత పాత పద్ధతుల్లోనే ఉంటామంటే కుదరదని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నిర్వహించిన తాజా అధ్యయనం చెబుతోంది. హార్వర్డ్ యూనివర్సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అండ్ ఇన్పెక్షియస్ డిసీసెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు ఎం.కిస్లర్, యోనాతన్ హెచ్. గ్రాడ్ అనే ఇద్దరు ప్రొఫెసర్లు కరోనా విజృంభణ, వ్యాప్తి, దాని జీవితకాలంపై అధ్యయనం చేశారు. వైరస్ సోకిన వ్యక్తి కేవలం 14 రోజులో, లేక 21 రోజులో క్వారంటైన్ లో ఉన్నంతమాత్రాన వైరస్ పూర్తిగా పోవడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు మందు గానీ, టీకా గానీ రానందువల్ల అది రావడానికి నెలల నుంచి ఏళ్లు  కూడా పట్టే అవకాశం ఉన్నందువల్ల వైరస్ వ్యాప్తి జరగకుండా చూడడమే మార్గం తప్ప.. పాజిటివ్ బారిన పడి కోలుకున్న వ్యక్తిలో వైరస్ లేనట్టు భావించరాదని హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19 పై పనిచేసే మందుకోసం ఇప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి కాబట్టి.. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. దాదాపు ఏడాది నుంచి 2 ఏళ్లయినా కావచ్చని పలువురు వైద్య నిపుణులు ఇప్పటికే చెప్పడాన్ని గమనించాలి. 
అయితే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నదాని ప్రకారం వైరస్ సోకిన వ్యక్తి రోగ నిరోధక శక్తి కారణంగా అది ఉన్నట్టు కనిపించకపోవచ్చు. కానీ బతికే ఉంటుందని వారు అప్రమత్తం చేస్తున్నారు. అది సోకిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వెంటనే బయటపడుతుంది. అంతేకాదు.. సంపూర్ణ ఆరోగ్యవంతుడికి సోకినా అతని రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని వారంటున్నారు. అలాగే ఒకసారి వైరస్ బారినపడిన వ్యక్తి కోలుకున్నట్టు కనిపించినా కూడా అతను వైరస్ వాహకంగానే కొనసాగుతాడని వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి వైరస్ ను సమూలంగా నిర్మూలించాలంటే టీకా మందు గానీ, ట్రీట్ మెంట్ గానీ వచ్చేదాకా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనని వారంటున్నారు. వారి అంచనా ప్రకారం ఎక్కువలో ఎక్కువ 2024 వరకు సామాజిక దూరాన్ని అవలంబించి తీరాలి. వైరస్ చనిపోయినట్టు లేదా నిర్వీర్యమైపోయినట్టు కనిపించినా మనిషి రోగ నిరోధక శక్తిని బట్టి, మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి అది పునరుత్తేజమవుతుందని, ఆ వైరస్ మోస్తున్న వ్యక్తి రోగ నిరోధక శక్తిపై, ఆరోగ్య వ్యవస్థపై దాడి చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే... ఇటీవల కొందరికి నెగటివ్ వచ్చిన వ్యక్తికి సైతం పాజిటివ్ తేలడం, అలాగే పాజిటివ్ గా తేలి క్వారంటైన్ లో కోలుకొని నెగిటివ్ వచ్చినవారికి సైతం మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ గా రావడాన్ని గమనించాలి. 


2022 వరకు సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే


హార్వర్డ్ శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం ప్రపంచమంతా 2022 వరకు సామాజికదూరాన్ని కచ్చితంగా పాటించాలి. అంటే వైరస్ ను చంపే ట్రీట్ మెంట్ గానీ, టీకా గానీ వచ్చేదాకా అన్నమాట. ఈ లోపు ప్రపంచమంతా ఒక కొత్త పంథాలోకి వెళ్లిపోవడం ఖాయం. ముుఖ్యంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అనేది గతకాలపు అలవాటుగా మారిపోతుంది. భారతీయ సంప్రదాయ నమస్కారం లేదా తల వంచి విష్ చేయడం లాంటివే అలవాటుగా మారతాయి. ఆఫీసులు, పని ప్రదేశాల్లో కొత్త కల్చర్ ఊపిరి పోసుకుంటుంది. పక్కపక్కనే పనిచేసే డెస్కుల మధ్య దూరం పెరుగుతుంది. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థుల్ని కుక్కేసి బోధించే పద్ధతులకు కాలం చెల్లుతుంది. మరోవైపు సాధారణ అకాడమిక్ ఎడ్యుకేషన్ కూడా ఆన్ లైన్ లో అడుగుపెట్టి విద్యార్థులకు, లెక్చరర్లకు అదే అలవాటుగా మారుతుంది. మన దగ్గర ఇప్పటికే నారాయణ, శ్రీచైతన్య వంటి పెద్ద కాలేజీలు ఆన్ లైన్ ఏర్పాట్లు చేస్తుండటాన్ని గమనించాలి. శుచి-శుభ్రతకు అమిత ప్రాధాన్యం పెరుగుతుంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తే లోపలేసే కొత్త చట్టం రావడాన్ని గమనించాలి. విదేశీ ప్రయాణాలు, రాకపోకల్లో తరచుదనం తగ్గుతుంది. విమానాల్లోనే కాదు.. బస్సులు, రైళ్లలో కూడా సీటింగ్ అరేంజ్ మెంట్స్ మార్చుకోవాల్సి వస్తుంది. కొనుగోళ్లు, అమ్మకాలను పెంచుకునే బిజినెస్ టూర్లకు బ్రేక్ పడుతుంది. మనుషులు కిక్కిరిసి ఉండే మురికివాడలు, ఒకే రూఫ్ కింద 3 తరాలు కాపురాలుంటున్న ఓల్డ్ సిటీ లాంటి ప్రదేశాలపై కొత్త నిబంధనలు తీసుకురావాల్సి ఉంటుంది. 
ఇలా 2022 వరకు సోషల్ డిస్టెన్స్ ను స్ట్రిక్టుగా పాటిస్తేనే కరోనా వైరస్ నిర్వీర్యమవుతుంది. లేకపోతే ఏదొక స్థాయిలో నిద్రాణంగా ఉన్న వైరస్ కాస్తా... 2024 వరకు మళ్లీ పంజా విసిరే అవకాశం ఉందనేది హార్వర్డ్ శాస్త్రవేత్తల అంచనా. వారి హెచ్చరికను వెంటనే అమలు చేస్తే ఆహార అలవాట్ల దగ్గర నుంచి వ్యాపార వ్యవహారాల దాకా మానవ జీవన శైలి మొత్తం మారిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు. 


Also Read: తెరమీదికొస్తున్న పాత సంప్రదాయాలు ఇవే


                  నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా?


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  అలాంటి మహా పండితుడికి తగిన గుర్తింపు రాకపోవడం కాస్త చింతించాల్సిన విషయమేనని, అందుకు ఎవర