Skip to main content

Posts

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  Also Read:  విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా? అలాంటి మహా పండితుడికి తగిన గుర్తి

కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

కమలనాథుల వ్యూహం తెలంగాణ బీజేపీ కేడర్లోనే గాక, ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఈటల చేతనే.. అదే కేసీఆర్ కు చుక్కలు చూపించాలని అమిత్ షా వ్యూహం పన్నారు. షా వ్యూహం పాసవుతుందా.. ఫెయిలవుతుందా అన్నది కాస్త పక్కనపెడితే.. ఈటల ప్రకటనల వెనుక భారీ పరమార్థమే దాగున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ అమిత్ షా-ఈటల ఏం మాట్లాడుకున్నారు? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? వారి వ్యూహంతో కేసీఆర్ నిజంగానే ఉలిక్కిపడతారా.. అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.  తెలంగాణ బీజేపీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తారని పేరున్న గులాబీ బాసుకు కూడా వణుకు పుట్టించే విధంగా పథకరచన చేస్తోంది కమలం క్యాంపు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ లో సంచలన విజయం నమోదు చేసి దేశవ్యాప్త రాజకీయ నేతల దృష్టిని తనవైపు మరల్చిన మాజీ మంత్రి ఈటల.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసిఆర్ ను ఢీకొట్టడానికే సిద్ధమవుతున్నారు. కేసిఆర్ పై గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించడం అందుకే సంచలనంగా మారింది. అంతేకాదు.. అసలు తా

భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

బీజేపీ నేతలు చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా ఇంట్రస్టింగ్ అంశంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచే హైదరాబాద్ ఓటర్లకు, బీజేపీ మద్దతుదార్లకు, హిందూ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కూడా యోగి అమ్మవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈసారి ప్రధాని మోడీ కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శించుకుంటారని భావించినా.. సమయాభావం వల్ల అది కుదరలేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అంతకుముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా వినాయక నవరాత్రుల సమయంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. మరి.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. భాగ్యలక్ష్మి అమ్మవారినే ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.  బీజేపీ నేతల హిడెన్ ఎజెండాలో హైదరాబాద్ పేరు మార్చే ప్రక్రియ ఉందన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతల సందర్శన కూడా అదే విషయాన్ని రుజువు చేస్తోంది. హైదరాబాద్ ను భాగ్యనగరంగ

కవిసార్వభౌముడు కలలో కనిపించి...

సహధర్మచారిణి గంగాదేవితో నాగేశ్వరరావుగారు చరిత్ర అనేది మంచి-చెడుల సమ్మిశ్రమం. మంచి చేసినవారిని అనుసరించాలని పాజిటివ్ థింకర్స్ చెప్తే... చెడు చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని, వాళ్లు ఈ భూమ్మీద ఉండటానికి అర్హులు కారని అందుకు విరుద్ధమైన వర్గమంతా చెప్తుంది. ప్రపంచమంతా ఈ రెండు మార్గాల్లోనే ప్రయణిస్తోంది. అయితే ఆ రెండు మార్గాలు  సర్వకాలాల్లోనూ పరిపూర్ణమైనవి  కాకపోవచ్చు. ఎందుకంటే వాటిలో ఎవరి ఆచరణ మార్గం వారిదే. ఒకరితో ఒకరికి పని ఉండదు. ఎవరి ఫాలోయర్లను వారు తయారు చేసుకుంటారు.  ఎవరి శిబిరాన్ని వారు పోటాపోటీగా భర్తీ చేసుకుంటారు. దీనివల్ల సమాజం "వర్గ విభజన"కు గురవుతుందే తప్ప.. సామాజిక సమరసతకు అవకాశం ఉండదు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలు మంచి, చెడుల గురించి మాట్లాడుకునే అవకాశం ఉండదు. మరి అది ఎలా సాధ్యం? అది జరగాలంటే ఏం చేయాలి? దానికి ఒకటే పరిష్కారం. అదేంటంటే.. అందరికీ అన్నీ తెలియజేయడమే.  Also Read:  భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా? ఎవరు ఏ మంచి చేశారో ప్రజలకు తెలియాలి? ఎవరి ద్వారా చెడు జరిగిందో కూడా ప్రజలకు తెలియాలి. నిజానికి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. తమ పూర్వీకుల

బలపరీక్ష జరిగితే అంతా తారుమారే

దాదాపు వారం రోజులుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న  మహా రాజకీయంలో ఇవాళ చాలా కీలకమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. గౌహతిలో క్యాంపు నిర్వహిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనుకున్న శివసేనకు సుప్రీంకోర్టు నుంచి భంగపాటు ఎదురైంది. రెబల్ ఎమ్మెల్యేలంతా ఇవాళ సాయంత్రం ముంబైకి రావాలని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటూ.. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ నోటీసులు పంపారు. మరోవైపు శాసనసభా పక్ష నేతగా ఉన్న రెబల్ ఎమ్మెల్యే ఏక్‎నాథ్ షిండే స్థానంలో అజయ్ చౌదరిని నియమిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ షిండే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టులో పిటిషన్ ఎదుర్కొంటున్న డిప్యూటీ స్పీకర్‎కు అనర్హత వేటు వేసే అధికారం లేదంటూ.. దానిపై వివరణ ఇవ్వడానికి జులై 11 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. దీంతో రెబల్ ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు పడకుండా ఊరట లభించినట్లయింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వానికి, శివసేన శాసనసభాపక్ష నేతకు, చీఫ్‌ విప్‌కు, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారందరూ తన నోటీసులకు 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు రెబల్ ఎ

ఢిల్లీలో చైనీయుడి భారీ కుట్ర

ఢిల్లీలో రెండేళ్లుగా అక్రమంగా ఉంటున్న ఓ చైనీయుడి ఉదంతం వెలుగుచూసింది. జు-ఫీ అనే చైనా దేశీయుడు రెండేళ్లుగా గ్రేటర్ నోయిడాలో అత్యంత విలాసవంతమైన ఓ క్లబ్ నిర్వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్‎కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారుల కళ్లు కప్పి నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఓ ఐపీఎస్ అధికారి అనుమానంతో దాని మీద అధికారులు రైడ్ చేయడంతో విషయం వెలుగుచూసింది. జు-ఫీతో పాటు నాగాలాండ్ కు చెందిన పెటిఖ్రినో అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో ముగ్గురు ఇండియన్స్, ఒక చైనీయుడు తప్పించుకొని పారిపోయారు. క్లబ్బులో 70 రూములు, అత్యాధునిక సీసీటీవీలు అమర్చారు. ఫేక్ వీసా డాక్యుమెంట్లతో జు-ఫీ ఇక్కడే తిష్టవేసి ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సైన్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి దేశ రహస్యాలు సేకరించే పనిలో జు-ఫీ ఉన్నాడన్న అనుమానాలతో విచారిస్తున్నారు. అయితే మూడు రోజులుగా విచారణ సాగుతున్నా జు-ఫీ నోరు విప్పడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. దీన్నిబట్టి ఇప్పటికే విలువైన సమాచారం చేరవేసి ఉంటాడని భావిస్తున్నారు. చైనా నుంచి ఇండియాకు, ఇండియా నుంచి చైనాకు రావాలంటే

ఉద్ధవ్ ను రాజీనామా చేయొద్దన్న పవార్... అయినా..

మహా రాజకీయం మహా సంక్షోభాన్ని తలపిస్తోంది. ఏక్‎నాథ్ షిండే క్యాంపులో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుండగా.. ఉద్ధవ్ శిబిరం వెలవెలపోతోంది. ఉద్ధవ్ థాక్రే నిన్ననే అధికార నివాసాన్ని ఖాళీ చేయడంతో ఆయన రాజీనామా చేయడం ఇక లాంఛనమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారికంగా శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారానికి మేజిక్ ఫిగర్ 144 సంఖ్య సరిపోతుండగా.. ఇండిపెండెంట్లు, స్థానిక పార్టీలు కలుపుకొని.. 169 సంఖ్యతో మహా వికాస్ అఘాడీ పేరుతో కూటమి సభ్యులు అధికారాన్ని ఎంజాయ్ చేశారు. అయితే అసంతృప్త నేత ఏక్‎నాథ్ షిండే తిరుగుబావుటా ఎగరేయడంతో.. సంక్షోభానికి తెర లేచింది. 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అసోంలోని గౌహతిలో ఆతిథ్యం పొందుతూ.. క్షణక్షణం అధికార శివసేనలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యే షిండే చాలా కీలకంగా మారిపోయారు. తన దగ్గరున్న సంఖ్యతో బీజేపీతో పాటు శివసేన రెబల్ అభ్యర్థులతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సులభమైపోయింది. ఈ సంక్షోభాన్ని ఆలస్యంగా గుర్తించిన శివసేన, ఎన్సీపీ నేతలు.. నష్టనివారణ చర్యలకు పూనుకున్నా ఆ ప్రక్రియలేవీ సుసాధ్యంగా కనిపించడం