Skip to main content

కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

కమలనాథుల వ్యూహం తెలంగాణ బీజేపీ కేడర్లోనే గాక, ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఈటల చేతనే.. అదే కేసీఆర్ కు చుక్కలు చూపించాలని అమిత్ షా వ్యూహం పన్నారు. షా వ్యూహం పాసవుతుందా.. ఫెయిలవుతుందా అన్నది కాస్త పక్కనపెడితే.. ఈటల ప్రకటనల వెనుక భారీ పరమార్థమే దాగున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ అమిత్ షా-ఈటల ఏం మాట్లాడుకున్నారు? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? వారి వ్యూహంతో కేసీఆర్ నిజంగానే ఉలిక్కిపడతారా.. అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. 

తెలంగాణ బీజేపీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తారని పేరున్న గులాబీ బాసుకు కూడా వణుకు పుట్టించే విధంగా పథకరచన చేస్తోంది కమలం క్యాంపు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ లో సంచలన విజయం నమోదు చేసి దేశవ్యాప్త రాజకీయ నేతల దృష్టిని తనవైపు మరల్చిన మాజీ మంత్రి ఈటల.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసిఆర్ ను ఢీకొట్టడానికే సిద్ధమవుతున్నారు. కేసిఆర్ పై గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించడం అందుకే సంచలనంగా మారింది. అంతేకాదు.. అసలు తాను... BJP లో చేరిందే గజ్వేల్లో పోటీ చేయడానికంటూ మరో అడుగు ముందుకేసి సమరనాదం చేశారు ఈటల. కేసీఆరే టార్గెట్‎గానే గజ్వేల్లో పని మొదలు పెట్టినట్లు సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నారట ఈటల. ఈ విషయంలో బెంగాల్‎లో సువేందు అధికారి తరహాలో.. ఇక్కడ కేసీఆర్ ను ఓడించి తీరుతామని ఈటల ధీమాగా ఉన్నారట. 

Also Read: భాగ్యలక్ష్మి ఆలయానికి ఇంపార్టెన్స్ అందుకేనా?

ఇక ఈటల ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అందుకే.. ఈటలకు పూర్తి వ్యూహం చెప్పి, ఒప్పించి ఈటలను రంగంలో దించినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. నిన్న మొన్నటివరకు మౌనంగా ఉన్న ఈటల... ఒక్కసారిగా వాయిస్ పెంచడం, కేసిఆర్ టార్గెట్ అనే విధంగా ప్రకటనలు చేస్తుండడంతో ఆయన వెనుక షా వ్యూహం కచ్చితంగా ఉంటుందన్న చర్చ రాజకీయ పార్టీల్లో సాగుతోంది. ఇటీవల ఈటల అమిత్ షాతో దాదాపు గంటసేపు ప్రత్యేకంగా భేటీ అయి.. పూర్తి అంశాలు చర్చించినట్లుగా చెప్పుకుంటన్నారు. అందుకే.. ఈటల తాను సీయం నియోజకవర్గం గజ్వేల్ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారని చెప్పుకుంటున్నారు. పశ్చిమబెంగాల్ లో టీఎంసీ వర్సెస్ బీజేపీ ఎన్నికలు ఏ లెవల్లో ఉత్కంఠగా జరిగాయో.. రేపు తెలంగాణలోనూ అదేవిధంగా జరుగుతాయని ఈటల ధీమాగా ఉన్నారట. ఈటల-షా భేటీలో.. బీజేపీ హైకమాండ్ వ్యూహం పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ను ఓడగొట్టే విధంగా షా... వ్యూహం రచించారని, ఆ ఆత్మవిశ్వాసం మేరకే ఈటల రాజేందర్... హుజూరాబాద్ కంటే కూడా గజ్వేల్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. కేసీఆర్ ను చికాకుపరచేలా భవిష్యత్తులో గజ్వేల్ నుంచే చేరికలు ఉంటాయని కూడా ఈటల చెప్పడం చూస్తే.. ప్లాన్ అంతా రెడీ అయిందని, ఇక అమలు చేయడమే తరువాయిగా మిగిలిందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. 

మరి ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో.. గజ్వేల్ నే ఎంచుకుంటే.. కేసీఆర్ ఏం చేస్తారన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కేసీఆర్ గజ్వేల్ నుంచి మరో చోటికి మారేలా.. టీఆర్ఎస్ కేడర్ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ తీసేలా బీజేపీ నేతలు వ్యూహం పన్నారా? లేక సీఎం నియోజకవర్గంవర్గంలో ప్రాజెక్టులపై వ్యతిరేకత రావడం వల్లే కేసీఆర్ పై గెలవడం ఈజీ అవుతుందని ఈటల భావిస్తున్నారా? అదీకాకపోతే కేవలం బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా వ్యూహ రచనలో భాగంగానే ఈటల ఈ ప్రకటన చేశారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి షా టార్గెట్ ఏవిధంగా ఉంటుందీ.. ఈటల ఏ విధంగా అమలు చేస్తారన్నది వేచి చూడాల్సిందే. 

Comments

  1. కెసిఆర్, కేటీఆర్ గారి తలపోగరు మాటలకు ప్రజలు బుద్ధి చెప్పే

    ReplyDelete
  2. రోజు దగ్గరలోనే ఉంది.. భాహుషా అమిత్ షా గారి ప్యుహం ఫలించ వచ్చు..

    ReplyDelete

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

నాడీ ఆస్ట్రాలజీ ఆన్ లైన్ మేగజైన్ ప్రారంభం

ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు.  ఈ  క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర

హెచ్ఎంటీవీలో రక్షాబంధన్.. హాజరైన బలగం ఫేం

హెచ్ఎంటీవీ చానల్లో రక్షాబంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. చానల్ సీఈఓ లక్ష్మి ఈ వేడుకలను సోదర భావం ఉట్టిపడేలా, ఎంతో స్ఫూర్తిమంతంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యక అతిథిగా బలగం సినిమా ఫేం రూపలక్ష్మి, విశిష్ట అతిథిగా బ్రహ్మకుమారీ సంస్థ నుంచి లావణ్య అండ్ టీమ్ హాజరయ్యారు. హెచ్ఎంటీవీ సిబ్బందికి లావణ్య, సంస్థ సీఈవో లక్ష్మి రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. సంస్థలో, వ్యక్తిగత జీవితంలో చేసే ప్రతిపనిలోనూ విజయం సొంతం కావాలని వారు సిబ్బందిని దీవించారు. అలాగే హెచ్ఎంటీవీ సంస్థ పురోభివృద్ధి కోసం కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని సీఈఓ లక్ష్మి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రాజేశ్వరి వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా ఇంచార్జ్ చిదంబరం, ఇన్‎పుట్ ఎడిటర్ సత్యనారాయణ, ఔట్‎పుట్ ఎడిటర్ సంతోష్, సిబ్బంది అమర్, మధుసూదన్ రెడ్డి, రిపోర్టర్లు, యాంకర్లు, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్స్ టీమ్, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆనందం పంచుకున్నారు.  కార్యక్రమంలోని మరికొన్ని ఫొటోలు:                                         

సెప్టెంబర్ 17.. మోడీ జన్మదినం.. విశ్వకర్మ యోజన ప్రారంభం

సెప్టెంబర్ 17కు ఓ పాపులారిటీ ఉంది. తెలంగాణ ప్రజలకు గతం నుంచీ వస్తున్న విమోచన దినం ఒకటైతే.. మరోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం కూడా అదే కావడం. దీంతో మొదట్నుంచీ విమోచనానికే ఓటేస్తున్న బీజేపీ నేతలు.. మోడీ జన్మదినం కూడా కావడంతో ఆ రోజును చాలా ప్రత్యేకంగా జరుపుకునే ఆనవాయితీ ఏర్పడింది. ఇది రాన్రానూ మరింత పకడ్బందీగా జరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కేంద్ర సర్కారు బలమైన పునాదులు కూడా వేస్తోంది.  సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రకంగా విమోచనా దినమైతే.. భారత ప్రజలకు ప్రస్తుత ప్రధాని మోడీ జన్మదినం కావడం విశేషం. దీంతో సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు చేసే జరిగే కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. బడుగు, బలహీన వర్గాల తరగతికి చెందిన మోడీ.. అసలు సిసలు ఉత్పాదక వర్గాలైన ఆ ప్రజల స్వావలంబన కోసం కొద్దికాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న పంద్రాగస్టు రోజున పీఎం విశ్వకర్మా కౌశల్ సమ్మాన్ యోజన కింద చేతి వృత్తులు చేసుకునేవారి ఆత్మగౌరవం పెంచేలా ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తామని ప్రకటించారు. అందుకోసం కేటాయించే బడ్జెట్ 13 నుంచి 15 వేల కోట్ల మధ్య ఉంటుందని కూడా చెప్పారు. దీంతో