తొంభయ్యవ దశకంలో వచ్చిన ద్రోహి సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. రక్షక దళాలకు పెనుసవాలుగా మారడమే గాక దేశ ఆంతరంగిక భద్రతకూ ప్రమాదకరంగా మారిన తీవ్రవాదుల్ని తుదముట్టించే ఇతివృత్తంతో 1990ల్లో వచ్చిన ద్రోహి సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. నక్సలైట్ల ఆనుపానులు, రక్షణపరమైన రహస్యాలు, భారీ దాడుల కోసం చేసే వ్యూహాలు తెలుసుకొనేందుకు.. పోలీసు అధికారులే రహస్యంగా నక్సలైట్ గ్రూపులోకి సిబ్బందిని పంపించి.. వారిని మట్టుపెట్టడం అందులోని ట్విస్ట్. అచ్చంగా అలాంటి అండర్ కవర్ ఆపరేషన్నే రియల్ లైఫ్ లో ఇప్పటికీ నిర్వహిస్తున్న ఇండియన్ జేమ్స్ బాండ్ గా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మోడీ ప్రధాని అయిన నాటి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ పరమైన నిర్ణయాల్లో దోవల్ పాత్రే కీలకం. సర్జికల్ స్ట్రైక్స్ నుంచి డోక్లాం సమస్యలో చర్చలు, నిన్న మొన్నటి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో భద్రత వరకు ఆయనే అన్నీ తానై నడిపారు. అంతేకాదు కశ్మీర్లో పౌరులకు ఎలాంటి ఢోకా లేదని చెప్పేందుకు సాధారణ పౌరుడిగా కశ్మీర్ వీధుల్లో తిరుగుతున్నారు. అజిత్ దోవల్ తీరు ముందు నుంచి భిన్నమే. ఆయన కుటుంబ నేపథ్య
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.