Skip to main content

స్వరాష్ట్రమే శ్వాసగా బతికిన జయశంకర్ సార్


పుట్టుక నీది, చావు నీది...బ్రతుకంతా దేశానిది. కాళోజీ చెప్పిన ఈ మాటలు అచ్చుగుద్దినట్లు ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు సరిపోతాయి. ఆయన జీవితం తెలంగాణకే అంకితం అన్నట్లు సాగింది. తెలంగాణ కోసమే సార్ పుట్టారా? అన్నట్లు జీవించారాయన. నీళ్లు, నిధుల, నియామకాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించారు. స్వయంపాలనతోనే తెలంగాణ అభివృద్ది చెందుతుందని, భావజాల వ్యాప్తితోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని నమ్మరాయన. చివరి వరకు అందుకోసమే పోరాడారు. అలాంటి తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సమున్నత గౌరవం లభించలేదని వాదనలున్నాయి. అధికారికంగా ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నప్పటికీ...సార్‌కు దక్కాల్సిన గౌరవం ఇది కాదంటున్నారు.

ఆచార్య కొత్త పల్లి జయంశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంత కర్త. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటి....జాతి మొత్తాన్ని చైతన్య పరిచిన వ్యక్తి. భావజాల వ్యాప్తితోనే తెలంగాణ సాధించుకోవచ్చని గట్టిగా నమ్మి...అందుకోసం జీవితమంతా ధారపోసిన మహోన్నతుడు. స్వరాష్ట్రం కోసం ప్రజలను పోరుబాట దిశగా జాగృతం చేసిన సిద్ధాంతకర్త. కొట్లాటలోనే కాదు, రాజకీయ ప్రక్రియలోనూ అన్నీ తానై వ్యవహరించారు. ఉద్యమపార్టీగా టీఆర్ఎస్‌కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు సలహాలు, సూచనలతో దిశానిర్దేశం చేసిన మార్గదర్శి.ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావమే ఆశగా, శ్వాసగా జీవించి తెలంగాణ పితగా ప్రజల గుండెల్లో కొలువయ్యారు ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌. ఆయన ఒకప్పటి వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారు. విద్యార్ధి దశ నుంచే సార్‌కు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరంపై స్పష్టమైన అవగాహన ఉండేది. అందుకే తొలిదశలోనే ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ఈ సందర్భంగా నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. 1952లో గైర్‌ముల్కీ ఉద్యమం మొదలు 1969లో జరిగిన ఉద్యమం వరకూ జయశంకర్‌ పాల్గొన్నారు.తొలిదశ ఉద్యమంలో భాగంగా ఇడ్లీ-సాంబార్‌ గోబ్యాక్‌ ఉద్యమం, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ది నాయకుడిగా 1954లో ఫజల్‌ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు జయశంకర్ సార్. తెలంగాణ ఆవశ్యకతపై ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. దేశవిదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి తెలంగాణ ఆవశ్యకతను ప్రపంచానికి చాటిచెప్పారు. అధ్యాపకుడిగా కొనసాగుతూనే అలుపెరగకుండా ప్రత్యేక రాష్ట్రంకోసం శ్రమించారాయన. ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నిత్యం చెప్పేవారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గణాంకాలతో, సాధికారిక ప్రసంగాలతో ఉద్యమశ్రేణులను ఏకతాటిపైకి తెచ్చారు.

తెలంగాణ ఆవశ్యకతపై ఎంత సేపైనా అలుపనేదే లేకుండా...తెలుగు, ఉర్ధూ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడేవారు ఫ్రాఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసం ఆయన చేసిన పరిశోధన అలాంటిది. ఎంత సేపు మాట్లాడినా కూడా రెచ్చగొట్టేలా ఒక్క మాట కూడా ఆయన నోటి నుంచి వచ్చేది కాదు. హైదరాబాద్‌లో సీఫెల్‌ రిజిష్టార్‌గా, వరంగల్‌లో సీకేఎం కాలేజీ ప్రిన్సిపల్‌గా, కాకతీయ యూనివర్సిటీ రిజిష్టార్‌గా, వైస్‌చాన్స్‌లర్‌గా గణనీయమైన సేవలందించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి సంప్రదాయాలపై ఆయనకు ఎంతో అభిమానం ఉండేది. తెలంగాణ వనరుల దోపిడీ, విధ్వంసం పట్ల ఆయన శాస్త్రీయ పద్ధతిలో, గణాంకాలు సహా ప్రసంగాలు చేసేవారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివక్షను తరచూ ఎత్తిచూపే వారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఏ విధంగా అభివృద్ధి సాధించవచ్చుననేది కూడా శాస్త్రీయంగా వివరించే వారు.

ఉద్యమ శ్రేణులను జాగృతం చేస్తూ వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశారు ఫ్రొఫెసర్ జయశంకర్ సార్. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. అలా జీవితంమంతా తెలంగాణ సాధనకోసమే అర్పించిన సార్....2011 జూన్ 21న మనందరినీ విడిచి వెళ్లిపోయారు. తన జీవితాశమైన స్వరాష్ట్ర సాకారాన్ని చూడకుండానే లోకాన్ని వీడారు.

తెలంగాణ సాధనే జీవితంగా బ్రతికిన  ఫ్రొఫెసర్ జయశంకర్ సార్‌కు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సరైన గౌరవం లభించలేదని ఉద్యమకారులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పత్తాకు లేని లీడర్లంతా ఇప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారు. కానీ జీవితమంతా రాష్ట్ర సాధనకే అంకితం చేసిన సార్‌కు మాత్రం...సమున్నత గౌరవం లభించలేదు. కనీసం ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై కూడా పెట్టలేదు. హెల్త్ యూనివర్సిటీకి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టారు. కానీ సార్ జయంతి, వర్ధంతి వేడుకలను ఒక్కసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించింది లేదు. స్వరాష్ట్రం ఎలా ఉండాలని ఆయన కన్న ఆశయాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తే అదే ఆయనకిచ్చే గౌరవం.


 


- T.Rameshbabu


- Mail: rameshbabut@hotmail.com


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల