Skip to main content

కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం"

టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏది అనుకున్నారో అదే చేశారా? ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో.. ఆయన మైండ్ లో ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకొని ఉన్నారా? తన సొంత నిర్ణయం మేరకే రెండో జాబితాలో టికెట్లు వచ్చాయని.. అంతకు మించి సమన్యాయం గానీ, సామాజిక న్యాయానికి గానీ అందులో చోటే లేదంటున్నారు.. టికెట్ దక్కని నిరాశావహులు. టికెట్ దక్కనివారు ఆ అక్కసుతో మాట్లాడతారని అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పూర్తిగా రేవంత్ మార్కే కనిపిస్తోందని.. ఆయన రెడ్డి సామాజికవర్గం నేతల విషయంలో పక్షపాతం చూపారన్న అసంతృప్తి బలపడుతోంది. 

టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను అనుకున్నదే చేస్తారు తప్ప.. ఇతరులు చెప్పింది చేయరని ఇప్పుడు నిరూపించుకున్నారు. టీ-కాంగ్రెస్ రెండో లిస్టును యథాలాపంగా పరికించినా ఆ విషయం అర్థమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈనెల 15న టీ-కాంగ్రెస్ మొదటిజాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేశారు. రెండో జాబితాలో 45 స్థానాలను క్లియర్‌ చేశారు. దీంతో టీ-కాంగ్రెస్ ఇప్పటివరకు వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. రెండో జాబితాలోని 45 స్థానాల్లో అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారు. బీసీలకు 8 సీట్లు.. ఎస్సీ, ఎస్టీలకు 8, మైనార్టీలకు ఒక్క సీటు కేటాయించారు. ఓవరాల్ గా 100 సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేవలం 20 శాతం సీట్లు కేటాయించారని.. 53 శాతం సీట్లు ఓసీ వర్గాలకు కేటాయించారంటూ రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీసీలకు కేటాయించిన 20 సీట్లలో యాదవులకు 4, గౌడకు 3, మున్నూరుకాపుకు 3, ముదిరాజ్ కు 3 చొప్పున సీట్లు కేటాయించారు. ఇక పద్మశాలి, ఆరె మరాఠి, వాల్మీకి, మేరు, వంజర, రజక, బొందిలి కులాలకు ఒక్కొక్క సీటు దక్కాయి. ఇక అగ్రవర్ణాల్లోనూ రెడ్లకే పెద్దపీట వేశారంటున్నారు పరిశీలకులు. తాజా రెండో జాబితాను పరిశీలిస్తే అదే విషయం బోధపడుతుందంటున్నారు. 

Read this:  నిరంజన్ రెడ్డి గెలుపు కోసం కేసీఆర్ భారీ స్కెచ్

టీ-కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించిన వంద సీట్లలో రెడ్లకు 38 సీట్లు, వెలమలకు 9, కమ్మ సామాజికవర్గానికి 3 సీట్లు, బ్రాహ్మణులకు 3, మైనారిటీలకు 4 సీట్లు కేటాయించి.. మిగిలినవి ఎస్సీ-ఎస్టీ రిజర్వుడ్ స్థానాలకు కేటాయించినట్లు స్పష్టమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఓవరాల్ గా రెడ్డి సామాజికవర్గానికే పక్షపాతంగా వ్యవహరించారంటున్నారు పరిశీలకులు. ఇదే ఇప్పుడు టీ-కాంగ్రెస్ జాబితాపై దుమారం రేపుతోంది. 

తెలంగాణలో సామాజికవర్గాలవారీగా రాజకీయ వాటా దక్కాలన్న పోరాటం చాలా కాలంగా నడుస్తోంది. అతి తక్కువ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలే రాజ్యాధికారం చెలాయిస్తూ అత్యధిక సంఖ్యలో ఉండే బడుగు వర్గాల ప్రయోజనాలు కాల రాస్తున్నారన్న అసంతృప్తి చాలాకాలంగా చెలరేగుతోంది. అటు బీసీ కులాల నుంచి బీసీలంతా ఒక్కటై.. తమ వాటా ప్రకారం సీట్లు కావాలంటూ నినదిస్తున్నారు. పైగా అలాంటి సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించడం విశేషం. తీరా సీట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి రేవంత్ తన పక్షపాత బుద్ధి చూపించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుక్కారణాలేంటని కూడా సామాజిక నిపుణులు ఆరా తీస్తున్నారు. ఆసక్తికరమైన ఆ నేపథ్యాన్ని కూడా ఇప్పుడు వారు గుర్తు చేస్తున్నారు. 

తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని.. పార్టీలకు అతీతంగా రెడ్డి సామాజికవర్గం నేతలందరినీ ఒక్కతాటి పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున రెడ్డి నాయకులందరినీ పిలిపించారు. తెలంగాణ ఉద్యమంలో, ఉమ్మడి ఆంధ్రా రాజకీయ అధికారంలో రెడ్ల పాత్రను గుర్తు చేస్తూ.. యావత్ సమాజానికి రెడ్లు చేస్తున్న సేవల ఫలితంగా.. నూతన తెలంగాణలో కూడా రెడ్లే అధికారంలో కొనసాగాలని చాలా మంది నేతలను రేవంత్ మోటివేట్ చేసి.. అందరినీ ఆ సమావేశానికి రప్పించారంటారు. ఆ రెడ్ల సభకు పార్టీలకు అతీతంగా రెడ్డి నాయకులందరూ హాజరయ్యారు. తమ రాజకీయ గత వైభవాన్ని, బాధ్యతాయుతమైన సామాజిక నేపథ్యాన్ని గుర్తు చేసుకొని పొంగిపోయారు. ఆ ఊపుతో ఆధునిక తెలంగాణలోనూ మళ్లీ రెడ్ల హవా కొనసాగాలని ఆనాడే నేతలంతా ప్రసంగాలు దట్టించారు. ఆనాటి రెడ్డ నాయకుల మహాసభను చూసి మిగతా సామాజికవర్గాల్లో తీవ్రమైన చర్చే జరిగింది. ఆనాడు రేవంత్ తలపెట్టిన సభ.. సకల జన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి భిన్నంగా ఉందన్న విమర్శలు ఆనాడే వినిపంచాయి. కోదండరాం వంటి ఉద్యమ నేతలు.. ఆ సభకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడం మినహా.. మిగతా చాలా మంది రెడ్డి నాయకులందరూ ఓ రకంగా పూనకం వచ్చిన లెవల్లో ఊగిపోయే ప్రసంగాలు చేశారు. ఆ విషయాన్ని అక్కడ కట్ చేస్తే.. ఇప్పుడు అదే రెడ్ల పట్ల పక్షపాతాన్ని రేవంత్ ప్రకటించుకున్నారన్న విమర్శలు మిగతా బీసీ సమాజం నుంచి వినిపిస్తున్నాయి.

ఇక రేవంత్ రెడ్డి చేసిన నెగెటివ్ ప్రాపగాండాను కేసీఆర్ ఆనాడే గుర్తించారంటారు విశ్లేషకులు. ఆ మేరకే కేసీఆర్ కేబినెట్లకే సామాజికవర్గాలవారీగా న్యాయం పాటించారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఓ విలేకర్ల కేసీఆర్ ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. ప్రతిసారీ కులం గురించి, సామాజికవర్గం గురించి సంకుచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాణ్ని తాను కాదని.. ఆ విధంగా ఆలోచించినా.. అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుందని ఇండైరెక్టుగా రేవంత్ కు చరకలంటించారు. వెలమ సామాజికవర్గం జనాభా ఎంతుంటుందో కూడా కేసీఆర్ ఆ ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక్క శాతం కంటే తక్కువ ఉండే తమ సామాజికవర్గం పరిపాలిస్తున్నప్పుడు.. మిగతా అందరినీ సమతూకం చేసుకొని ముందుకెళ్తుందని.. కొన్ని నిర్ణయాలు అవసరాలకు తగినట్టుగా ఉంటాయే తప్ప.. అందలో పక్షపాతం ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. ఇప్పుడా విషయాలను కూడా విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. 

తెలంగాణలో పూర్తి బలహీనపడిన కాంగ్రెస్ ను తన మార్కు ప్రసంగాలు, తన మార్కు దూకుడుతో గ్రాఫ్ పెంచేలా చేసి.. తాను తీసుకోబోయే ఎలాంటి నిర్ణయాలకైనా హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితులు సృష్టించుకున్నారని.. దాన్ని ఆసరా చేసుకొనే దాదాపు ఆరు శాతం ఉన్న రెడ్డి సామాజికవర్గానికి అత్యధిక సీట్లు కట్టబెట్టారంటున్నారు. ఇదంతా గతంలో జరిపిన రెడ్డి సభలోని ఎజెండా ప్రభావమేనని.. ఆయన ప్రకటించిన సీట్ల ద్వారా ఎలాంటి సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పలువురు ఆశావహులు వాపోతున్నారు. మరోవైపు.. సూర్యాపేట బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా.. బీజేపీ తరఫున తాము బీసీలకే ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రకటనను ఇప్పటికే పలు బీసీ సంఘాల నేతలు స్వాగతించడం విశేషం. 

ఇక టీ-పీసీసీ విడుదల చేసిన ఈ జాబితాలో మిగతా అగ్రవర్ణాల కన్నా, అధిక సంఖ్యలో ఉన్న బీసీల కన్నా ఒక్క రెడ్లకే పెద్దపీట ఎలా వేస్తారన్న విమర్శలు ఒకవైపు వినిపిస్తుంటే.. అటు సొంత పార్టీ నుంచి కూడా టికెట్ దక్కని వారు తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. మరి.. ఈ అసమతుల్యతను రేవంత్ రెడ్డి ఎలా సర్దుతారు? మిగతా 19 సీట్ల కేటాయింపుల్లోనైనా అది ప్రతిఫలిస్తుందా? ఒక్క వర్గానికే పెద్దపీట వేస్తున్నారన్న అపవాదును ఎలా తొలగించుకుంటారు? వేచి చూడాల్సిందే. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత