Skip to main content

కాసాని జ్ఞానేశ్వర్ పయనం వెనకాల

మా దుకాణం మా ఇష్టం. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెరుస్తాం.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మూస్తాం. మీకేమైనా అభ్యంతరమా? అన్నట్టుగా ఉందట టీడీపీ హైకమాండ్ వైఖరి. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసి ఉనికి చాటుకుంటేనే కదా.. పార్టీకి భవిష్యత్తు ఉండేది? మరి పార్టీ భవితవ్యాన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టారా? పోటీ చేస్తామన్న కాసాని జ్ఞానేశ్వర్ ను.. సైలెంట్ చేయించి టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించడంలో ఆంతర్యమేంటి? జ్ఞానేశ్వర్ రాజీనామా నుంచి ఓటర్లకు ఏం సంకేతం వెళ్తోంది?

టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడం.. టీ-రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి ఉండే ఫాలోయింగ్ గురించి మాట్లాడుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదు. కానీ.. దాని వెనకాల చంద్రబాబు నడుపుతున్న మంత్రాంగం ఎంత లోతైందనే విషయమే సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొంతమంది జ్ఞానేశ్వర్ రాజీనామాను హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. రాజీనామా వెనకాల బీఆర్ఎస్ కు ఆయన రాజీపడిపోయారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ జ్ఞానేశ్వర్ చెబుతున్న వాదనలు వింటే చంద్రబాబు తెరంగేట్రం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. జ్ఞానేశ్వర్ మీద విమర్శలను, అనుమానాలను కాసేపు పక్కనపెడితే.. అసలు తెలంగాణలో టీడీపీ పోటీలో ఎందుకు ఉండడం లేదన్నది చాలా కీలకంగా మారుతోంది. చంద్రబాబుకు జ్ఞానేశ్వర్ నచ్చకపోతే ఫరవాలేదు. ఆయన్ని పక్కనపెట్టి.. ఇంకొకరికి ఎవరికైనా పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. కానీ అదేదీ చేయకుండా పోటీ చేయడం లేదని ప్రకటించడంలో ఆంతర్యమే చాలా అనుమానాస్పదం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

చంద్రబాబు అనూహ్య నిర్ణయం వెనుక కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి కుట్ర దాగున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే.. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా అందరూ చెబుతారు. ఇప్పటివరకు ఒక్కసారైనా ఆయన చంద్రబాబును విమర్శించకపోవడం ఒకటైతే.. బాబు పట్ల తన అపరిమితమైన ఆరాధానా భావాన్ని కూడా బహిరంగంగానే చాటుకున్నారు రేవంత్. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరే ముందు కూడా ఆయన స్వయంగా బాబును కలిసి చాలాసేపు ముచ్చటించి రావడాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అంతకుముందు తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మీద కుట్ర చేసి ఓటుకు నోటు కేసులో రేవంత్ పట్టుబడిన అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబు తన శిష్యుడిగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తదుపరి సీఎం రేవంతే అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ గనక పోటీలో ఉంటే.. ఆ ఓట్లు చీలిపోయి బీఆర్ఎస్ కు మేలు చేస్తాయని.. అలాంటిది జరగకుండా ఉండేందుకే.. టీడీపీని పోటీలో లేకుండా బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఆ ఓట్లన్నీ రేవంత్ కు బదిలీ అయ్యేలా చేసే ఎత్తుగడనే చంద్రబాబు అమలు చేస్తున్నారంటున్నారు పరిశీలకులు. 

అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తెలంగాణలో అన్ని సీట్లకూ పోటీ చేస్తామని జ్ఞానేశ్వర్ ప్రకటించిన కాసేపటికే లోకేశ్ తొందరపాటు ప్రదర్శించి తాము పోటీ చేయడం లేదని ప్రకటించి తన మాటకు విలువ లేకుండా చేశారని జ్ఞానేశ్వర్ చివుక్కుమన్నారు. దీంతో తాడోపేడో తేల్చుకునేందుకు నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి కలిస్తే.. అక్కడ చంద్రబాబు కూడా అదే మాట వినిపించడంతో జ్ఞానేశ్వర్ తీవ్రంగా హర్ట్ అయ్యారట. పోటీలో లేకపోవడానికి బాబు వేస్తున్న కుట్రకోణం లోతెంతో తెలిసిందంటున్నారు జ్ఞానేశ్వర్. 

తెలంగాణలో కనుమరుగవుతున్న టీడీపీ కోసం తన భవిష్యత్తును కూడా పక్కనపెట్టి పని చేశానని... సొంత ఖర్చులతో పార్టీకోసం పాటు పడ్డానని ఆవేదన చెందుతున్నారు. పోటీలో ఉండరాదు అనుకుంటే ఖమ్మం జిల్లాలో ఎంతో భారీ ఎత్తున సభను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో చెప్పాలని జ్ఞానేశ్వర్ ఇప్పుడు నిలదీస్తుండడం విశేషం. సొంత పార్టీ భవిష్యత్తు కోసం కాక.. అవతలిపార్టీకి మేలు జరిగేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారని.. అలాంటప్పుడు తాను పార్టీలో ఎందుకు ఉంటానని ఆయన ప్రశ్నిస్తుండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తెలంగాణలో ఒకప్పుడు వెలుగు వెలిగిన పార్టీని బతికించుకునేందుకు కాకుండా.. తన దురుద్దేశపూరిత కుట్ర కోణాలు ఆవిష్కరించేందుకు ప్రయత్నించడంతో కలత చెందానని జ్ఞానేశ్వర్ అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో పోటీ చేసేందుకు నాయకులంతా సొంత ఖర్చులతో ముందుకొచ్చారని.. అయినా బాబుకు ఏంటి నష్టమో తెలియడం లేదని.. ఇదంతా చంద్రబాబు చీకటి కుట్రలో భాగమేనని కన్ఫామ్ అయిందంటున్నారు జ్ఞానేశ్వర్. 

చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఎన్నికల ఇన్‌చార్జిగా బాలకృష్ణను నియమించారు. ఆయన తెలంగాణ నేతలతో సమావేశం నిర్వహించి, తమ సత్తా ఏంటో చూపుదామని తొడ గొట్టడం మరో విశేషం. తెలంగాణలో జరిగే ప్రచారంలో పాల్గొంటానని బాలయ్య హామీ కూడా ఇచ్చారు. ఇక అభ్యర్థులను ప్రకటించడమే తరువాయి అనుకున్న దశలో.. రేవంత్‌రెడ్డి చక్రం తిప్పి.. బాబు ప్రభావితం చేశారన్న వాదనలకు.. బాబు తాజా వైఖరితో రూఢి అయిందంటున్నారు పరిశీలకులు. మరి ఈ తరుణంలో... పార్టీ కోసం ఖర్చు చేసి పార్టీ పట్ల సిన్సియర్ గా పనిచేసిన జ్ఞానేశ్వర్ లాంటి నాయకులు మళ్లీ దొరుకుతారా.. అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీడీపీలో తనకు జరిగిన ట్రీట్ మెంట్ తో రేపో మాపో జ్ఞానేశ్వర్ కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. బహుశా అది బీఆర్ఎస్సే కావచ్చు. 

Comments

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత