Skip to main content

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ మాజీ భార్య కామెంట్లు

ఏపీ రాజకీయాల్లో "కీ రోల్" పోషించాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ కు.. టైగర్ నాగేశ్వరరావు ఇబ్బందికరంగా మారాడట. అదేంటి? టైగర్ నాగేశ్వరరావుతో పవన కళ్యాణ్ కు వచ్చిన ఇబ్బందేంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. పవన్ రెండో భార్య రేణూ దేశాయ్.. అందులో "కీ రోల్" పోషించడం.. ఆ సినిమా ఫంక్షన్ లో రేణూ మాట్లాడిన మాటలు పవన్ ను పరోక్షంగా టచ్ చేయడం వంటి కారణాలతో ఆయన ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయట. ఇంతకీ రేణూ ఏమంది? ఆమె మాటలు పవన్ కెరీర్ కు ఎలా ఎఫెక్ట్ అవుతాయి? 

Read this also: హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరై.. తన వ్యక్తిగత విషయాలతో పాటు తన గత విషయాల గురించి కూడా చెప్పుకున్నారు రేణూ దేశాయ్. అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించాలని.. అదృష్టం కలిసొస్తే సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలో తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఫంక్షన్లో రేణూదేశాయి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పవన్ కు సంబంధించి ఎదురైన ప్రశ్నలకు పెద్దగా రెస్పాండ్ కాని రేణూ.. అతను సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా..? అనే ప్రశ్నకు సైతం ఒకింత కటువుగానే స్పందించారంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్. ఒక పొలిటీషియన్‌గా అతను ఈ సొసైటీకి అవసరమని మాత్రమే గతంలో ఓ వీడియో ద్వారా చెప్పానని.. అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. ఇక సీఎం అవుతారా లేదా అనేది మాత్రం తాను కోరుకోనని చెప్పడం.. పవన్ ఫ్యాన్స్ లోనే గాక.. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఆసక్తి రేపుతోంది. అక్కడితో ఆగకుండా.. దేవుడు ఉన్నాడని.. ఏ విషయమైనా ఆయనే డిసైడ్‌ చేస్తాడని.. కనీసం ఒక కామన్‌ వ్యక్తిగా కూడా ఆయన వైపు స్టాండ్‌ తీసుకోనని రేణూ తేల్చి చెప్పడం దుమారం రేపుతోంది. 

పవన్ కళ్యాణ్  తన పిల్లలికి తండ్రిగా ఉంటారు... అంతే తప్ప ఆయన రాజకీయ జీవితం గురించి తాను మాట్లాడబోనని ఖండితంగా చెప్పారు రేణు. ఫలానా వ్యక్తిని సపోర్ట్‌ చేయండి అంటూ తనకు ఎన్నికల ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. పవన్‌ గురించి తాను ప్రతిసారీ నిజాలే చెప్పానని.. విడాకుల సమయంలో చెప్పినవి కూడా అన్నీ నిజాలేనని.. కొద్దిరోజుల క్రితం పవన్‌ గురించి చెప్పిన మాటల్లో కూడా నిజమే ఉందని... కావాలంటే లై డిటెక్టర్‌ పెట్టి చెక్‌ చేసుకోవచ్చునని రేణు చెప్పడం పవన్ ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది. 

ఒక మంచి పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ సొసైటీకి ఎంతో అవసరం అని తాను గత వీడియోలలో తెలియజేశానని... అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనన్నారు రేణూ. ఆయన సీఎం అవ్వాలని తాను కోరుకోవడం లేదని.. తనలో గూడు కట్టుకున్న గాఢమైన అభిప్రాయాన్ని అంతే గాఢంగా రేణూ చెప్పారంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక కామన్ మ్యాన్ గా కూడా తాను పవన్ కళ్యాణ్ పట్ల స్టాండ్ తీసుకోను అంటూ.. రేణు పవన్ పొలిటికల్ జర్నీ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని.. టీడీపీ పొత్తును ఆసరా చేసుకొని వీలైనన్ని ఎక్కువ సీట్లు సొంతం చేసుకోవాలని జనసేన అధినేత చురుగ్గా పావులు కదుపుతున్నారు. అవకాశం వస్తే తప్పకుండా సీఎం పదవి అధిరోహిస్తానని పదేపదే చెప్తున్నారు. ఈ క్రమంలో పవన్ మాజీ సతీమణి రేణు చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ పై ప్రభావం చూపిస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. పవన్ కు లోకల్ భార్య ఒకరు.. నేషనల్ భార్య ఒకరు.. ఇంటర్నేషనల్ భార్య ఒకరు అంటూ జగన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ వైవాహిక జీవితాన్ని రాజకీయంగా వాడుకోజూస్తున్న వైసీపీకి.. ఇప్పుడు రేణూ చేసిన వ్యాఖ్యలు ఉపయుక్తంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి.. దీనికి పవన్ మళ్లీ ఎలా రెస్పాండ్ అవుతారోనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత