పాకిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చినవాళ్లు, బంగ్లాదేశ్ నుంచి కంచె దాటి హైదరాబాద్ కు వచ్చి కూలీపనులు చేసుకుంటున్నవాళ్లు, ఏ కూలీ దొరక్కపోతే ఆవారా పనుల్లో అయినా బిజీగా ఉన్నవారు, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు రేప్పొద్దున ఏ కష్టం వచ్చినా ఆరికపూడి గాంధీని కలవాలని నా సూచన. అలా కలిస్తే ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుంటారు. తినడానికి తిండే కాదు.. ఉండడానికి వసతి, కాపురం చేసుకోవడానికి పెళ్లి సంబంధాలు, ముసలివాళ్లయ్యాక వృద్ధాశ్రమాల్లో చేర్పించడం, అదీ వీలు కాకపోతే వృద్ధాప్య పింఛన్లయినా సమకూర్చే దొడ్డమనసు ఆయనది. రేపో మాపో జనభా లెక్కల కోసమో, శాశ్వత పౌరసత్వ ధ్రురువీకరణ కోసమో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఇల్లిల్లూ తిరిగినప్పుడు.. అక్రమ వలసదారుల ఆచూకీ బయటపడకుండా పోదు కదా. అప్పుడు అలాంటివాళ్లంతా వరుస కట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని ఆశ్రయించాలని.. భవిష్యత్తులో నిరాశ్రయులు కాబోయేవారందరికీ సవినయంగా నేను మనవి చేస్తున్నా.
ఎందుకంటే ఈ గాంధీ మనకాలపు గాంధీ. గతకాలపు గాంధీ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. ఆయన నిరాడంబరతను, బాపూ అనదగ్గ పర్సనాలిటీని చరిత్ర సాక్షిగా ఆవాహన చేసుకొని ఆదర్శమూర్తిగా కొనియాడుతున్నాం. కానీ ఆయన ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ను నేటి తరం మిస్సయ్యింది కదా. అందుకని ఆయన లేని లోటును ఈ గాంధీలో చూసుకొని మురిసిపోవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ గాంధీకి లేని త్యాగనిరతిని కూడా మనం ఈ గాంధీలో చూడొచ్చు. ఆ గాంధీ దేశవిభజన మత ప్రాతిపదికనే జరిగినా భారత్ వీడుతున్న ముస్లింల కోసం తెగ బాధపడ్డాడు. అలాంటి పరిస్థితులు వచ్చినందుకు బాగా నొచ్చుకున్నాడు. ఈ దేశంలోని ముస్లింలు ఎక్కడికీ వెళ్లవద్దని, తన మాట మీద నమ్మకం లేక ఎవరైనా వెళితే అన్నం ముట్టనని హఠం వేసుక్కూర్చున్నాడు. అదీ ఆనాటి గాంధీ అద్భుతమైన ఆదర్శం. మరి ఈనాటి గాంధీ కనీసం అందులో సగమైనా ఉండాలి కదా. సగమేం ఖర్మ. తాను అంతకుమించి అని చాటుకున్నాడు. ఇందులో గాంధీది ఏం పోయింది. ఆయన ప్రకటించుకున్న 62 కోట్ల పైచిలుకు ఆస్తుల్లోంచి పదో, పరకో ఏమైనాా పోతుందా.. పోదు కదా. మహా అయితే ఈ దేశ ప్రజల ఉమ్మడి భూభాగం తలా కొంత పోతుంది. అంతే కదా. గానుగలోంచి గంటెడు పోతే గాంధీకి ఏం నష్టం. పదో తరగతి చదువుకున్న గాంధీకి ఆ మాత్రం తెలియదా. ఆంధ్రాకు చెందిన ఆరికపూడి గాంధీ... తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత టీఆర్ఎస్ లో చేరి అధికార పార్టీ దర్పాన్ని అనుభవిస్తున్న గాంధీ.. బంగారు తెలంగాణలో భాగస్వాముడైన గాంధీ.. కొందరు పాక్ పౌరులకు ఆశ్రయం కల్పిస్తే తప్పేముంది.
విశాలమైన భారతం కన్నా విశాలమైంది నేటి ఆరికపూడి గాంధీ హృదయం. ఛప్పన్ ఇంచ్ కీ ఛాతీ అనే కితాబున్న మోడీ సైతం అసూపడేంత విశాలహృదయుడు గాంధీ. అందుకే ఈ దేశంలోకి అక్రమంగా వలసవచ్చిన పరాయిదేశీయులకు అండగా ఉంటానని మీడియా సాక్షిగా హామీ ఇచ్చాడు. వేరే దేశాలవారే కాదు.. అసలు పాకిస్తాన్ పౌరులు కూడా ఇక్కడ అక్రమంగా ఉంటున్నా సరే… వారి కోసం తానే ముందుండి పోరాడతానని శక్తివంచన లేని వాగ్దానం చేశాడు. పాపం ఆయన మాటలు వింటున్న అమాయక ముస్లింలు చేతనైనన్ని చప్పట్లు కొట్టేశారు. ఆయన పక్కనే ఉండే వందిమాగధుల్లాంటి గల్లీలీడర్లు.. వారు కూడా ఆహా-ఓహో.. ఎంత ఉదారత్వం అని తెగ పొగిడేశారు. వీరి పొగడ్తలకు, వారి చప్పట్ల తాళాలకు పొగడ్తల్లో పొటమరించిన కృతజ్ఞతాభావ గాఢతకు మురిసిపోయాడు.
అయితే అంత పెద్ద హామీ ఇచ్చే ముందు కనీసం పార్టీ బాసు అనుమతి అయినా తీసుకున్నాడా లేదా అని నాకు డౌటు. ఎందుకంటే సీఏఏ కు వ్యతిరేకంగా కేబినెట్ తీర్మానమైతే అయిపోయింది కానీ.. కేంద్రం చేసిన జాతీయ చట్టాల ముందు రాష్ట్రం చేసిన వ్యతిరేక తీర్మానాలు నాలుక గీసుకోవటానికైనా పనికొస్తాయా లేదా అనేది అందరికీ తెలిసిందే. అలాంటి తీర్మానం చేసిన పెద్ద సారే.. ఇలాంటి హామీలు ఇవ్వలేదు. పాకిస్తాన్ నుంచి వచ్చినవారికి అలాంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్న మాటను చెప్పలేకపోయారు. కంటికి కనిపించనిదే కనికట్టు కదా. ఇలాంటి కనికట్లతోనే రాజకీయ నాయకులు స్టార్స్ ని మించిన సూపర్ స్టార్స్ గా వెలిగిపోతున్నారు. మరి ఆరికపూడి గాంధీకి ఈ లాజిక్కు తెలియదా.. ఎందుకు తెలియదు.. తెలిసే ఉంటుంది. కాకపోతే అదేదో సినిమాలో బ్రహ్మానందం ఫేస్ చేసిన పరిస్థితిని మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది. ధర్మం చేయండి బాబూ.. అని ఓ బిచ్చగాడు అడుక్కోవడానికొస్తే అర్ధరూపాయి వేసి తెగ పోజు కొట్టిన బ్రహ్మీ అమాయకత్వానికి శాస్తిగా.. అలీ ఆధ్వర్యంలో బిచ్చగాళ్ల సంఘమంతా ఎడతెరిపి లేకుండా బిచ్చమడిగి మరీ జ్ఞానోదయం కలిగించిన సీన్ ఉంది కదా. ఆరికపూడివారికి అలాంటి పరిస్థితి రాకుండు గాక.
నోట్ - పాకిస్తాన్ అక్రమ వలసదారులను కూడా ఇక్కడే కంటికి రెప్పలా చూసుకుంటానన్న నేటి గాంధీ ఔదార్యాన్ని శక్తికి మించి ప్రశంసించాల్సిందిగా పాఠకులకు నా విజ్ఞప్తి. ఆయన కాంటాక్ట్ నెంబర్ - 9849998995, 9848042499, 9177664333. పాఠకుల్లో ఎవరైనా అక్షరయోధులుంటే ఆ విధంగా కూడా ఆయన్ని అభినందించాల్సిందిగా మనవి. మెయిల్ ఐడీ - agandhimla@gmail.com
Comments
Post a Comment
Your Comments Please: