Skip to main content

ముంబైలో మొదలైంది.. హైదరాబాద్ వైపు కదిలింది


దేశంలో అగ్రగామి వాణిజ్యవేత్తగా, ప్రపంచంలోని వంద ప్రభావశీలుర జాబితాలో ఒకడిగా వెలుగొందుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యాపారంలో వైరి వర్గాలను ఊచకోత కోస్తున్నారు. ముఖేశ్ మొదలుపెట్టిన ఊచకోత మరింత తీవ్రరూపం దాలుస్తోంది. భారతీయ మార్కెట్లో ఓ నూతన శకాన్ని కూడా ఆరంభించడం ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.టెలికాం రంగంలో ఓ మోస్తరు కంపెనీలను సైతం జియో బిస్తరు సర్దుకునేలా  చేసిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీ డాటా ఆఫర్ తో ఇండియా ప్రజానీకాన్ని అంతర్జాల ప్రియులుగా మార్చేసిన జియో… అది ఇస్తున్న పోటీకి భారతీ ఎయిర్ టెల్, ఐడియా-వొడాఫోన్ వంటి పెద్ద కంపెనీలను బేజారెత్తిస్తోంది. బకాయిలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఉన్న ఆ రెండు కంపెనీలు కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. దీంతో ఈ రంగంలో జియో అప్రతిహతంగా దూసుకెళ్లడానికి ఆటంకాలేవీ లేవనే చెప్పాలి. 


టెలికాం రంగంలో బీభత్సం సృష్టిస్తున్న రిలయన్స్.. ఈ-కామర్స్ లోనూ అడుగు పెట్టేందుకు కొన్నేళ్ల క్రితమే పెద్దఎత్తున కసరత్తు చేసింది. ఆ విషయం మార్కెట్ కు ఇంకా బయటకు పొక్కకముందే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి టాప్ ఈ-కామర్స్ సంస్థలు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టి మధ్యతరగతి వినియోగదారులకు చేరవయ్యాయి. ఆన్ లైన్ మార్కెట్ ను శాసిస్తూ తమ వాటాను పటిష్టం చేసుకున్నాయి. అయితే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మార్కెట్  వ్యూహాలు తనకే విధంగానూ పోటీ కాదని అంబానీ ధీమాగా ఉన్నారో ఏమో కానీ.. విస్తృతంగా వ్యాపించి ఆ కంపెనీల వాటా గురింంచి పెద్దగా బాధపడలేదు. తనదగ్గరున్న సీక్రెట్ అలాంటిదేమో మరి. 
గతేడాది చివరినాటికే అంబానీ అమ్ములపొదిలో ఉన్న మార్కెట్ సీక్రెట్ కాస్తా బట్టబయలైంది. ఈ-కామర్స్, ఆన్ లైన్ మార్కెట్ లోకి టిఫనీ అనే సంస్థతో కలిసి అడుగు పెట్టింది రిలయన్స్. ఇప్పటికే ముంబై శివార్లలో మాల్స్ నెలకొల్పవడం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ లో అమెజాన్, ఫ్లిప్  కార్ట్ లకు దీటుగా.. మరిన్ని కొత్త ఐడియాలతో భారత గృహాల్లోకి దూసుకెళ్తోంది. యాప్ బేస్డ్ బిజినెస్ ద్వారా డోర్ డెలివరీ చేస్తుండడం రిటైల్ మార్కెట్లో అంబానీ కొత్తసూత్రంగా తెలుస్తోంది. గృహస్తులకు అవసరమైన అన్ని వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డరిస్తే.. జస్ట్ టిఫిన్, లంచ్ ఇంటికి వచ్చినట్టుగా.. కావాల్సిన వస్తువులన్నీ ఇంటికే వచ్చేస్తాయన్నమాట. ముంబైలో ప్రయోగాత్మకంగా మొదలైన జియో మార్ట్ ఆపరేషన్.. అతి త్వరలోనే హైదరాబాద్ కు వస్తోంది. ఇప్పటికే ముఖేశ్ ప్రతినిధుల బృందం పలుచోట్ల స్థలాల కోసం సర్వే కూడా జరిపినట్లు సమాచారం.  


పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, సూపర్  మార్కెట్ ల ఆవిర్భావం సగటు కిరాణాదారుడి వ్యాపారం గణనీయంగా దెబ్బతింది. ఇప్పుడు ఆన్ లైన్ మార్కెట్ అండ్ డోర్ డెలివరీతో వీధి చివర్న ఉండే సామాన్య  వ్యాపారవేత్తల పరిస్థితి ఏమవుతుందో చూడాలి. 


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల