Skip to main content

భైంసా ఘటన నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి?


Photo Credit: vskbharat.com


భైంసాలో సంక్రాంతికి ముందు జరిగిన అమానవీయమైన, అతి జుగుప్సాకరమైన కృత్యాన్ని ఓ సాధారణ ఘటనగా చూడాలా? లేక పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ఓ వర్గపు పైశాచిక చర్యగా భావించాలా? అంతేకాదు.. ఈ చర్య  నుంచి ప్రభుత్వాలు గానీ, ఫోర్త్ ఎస్టేట్ లో కీలకమైన స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా గానీ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది  ఏమైనా ఉందా?


ముందుగా ప్రభుత్వ స్పందనను స్థూలంగా విశ్లేషిద్దాం. భైంసా ఘటనను బయటికి రాకుండా చూడడానికి తెలంగాణ సర్కారు విఫలయత్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యాన ఆలస్యంగా అయినా అక్కడేం జరిగిందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఏ అంశం ప్రపంచానికి తెలియరాదని ప్రభుత్వం కోరుకుందో.. అదే అంశాన్ని ప్రపంచం మొత్తానికి చేరవేసిన సిద్ధు అనే జర్నలిస్టు ఇప్పుడో సాహసిగా ప్రజల ముందు నిలబడ్డాడు. నిజానిజాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన ప్రభుత్వపెద్దల పక్షపాత నైజం గంపగుత్తగా బయటపడింది. అంతా తెలిసిపోయాక, దాచడానికి ఏమీ మిగలని సందర్భంలో, నిందితులను, దుండగులను ఇప్పటికైనా గుర్తించిన దాఖలాలు లేని క్రమంలో ప్రభుత్వానిది, పోలీసులది నూటికి నూరు శాతం వైఫల్యంగానే ప్రజల ముందు తేలిపోయింది. ఈ వైఫల్యం నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుంది? బాధితులకు ఎలాంటి ఊరటనిస్తుంది? బాధితులతో సహానుభూతి చెందుతున్న లక్షలాది మంది ప్రజలకు ఏమని జవాబు చెబుతుంది? భైంసా ఘటనలో ఇదొక పార్శ్వం అయితే.. నిజమే చెబుతామని, నిజం కోసమే జీవిస్తున్నామని చెప్పుకునే మీడియా వర్గాలది అసలైన మరో పార్శ్వం. 


జనరల్ మీడియా కళ్లు మూసుకుంది - సోషల్ మీడియా కళ్లు తెరిపించింది:


భైంసా ఎపిసోడ్ లో మొత్తంగా యాక్టివ్ పాత్ర వహించింది సోషల్ మీడియానే. సోషల్ మీడియా వల్లనే ప్రపంచమంతటికీ అక్కడేం జరిగిందో తెలిసింది. భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ కొత్త కాదు. కానీ ఈసారి జరిగింది మాత్రం చాలా కొత్త తరహాలో జరిగింది. స్థానికంగా ఉండేవాళ్లు కాక బయటి నుంచి వచ్చిన దుండగులు ముసుగులు వేసుకొని భయానక వాతావరణం సృష్టించారు. బతికి బట్ట కట్టాలంటే తక్షణమే అక్కణ్నుంచి వెళ్లిపోవాలని హుంకరించారు. సంక్రాంతి కోసం చేసుకున్న పిండివంటల మీద ప్రతాపం చూపించారు. వాతావరణం సద్దుమణిగిన తరువాత కూడా కనీసం పండుగ సైతం జరుపుకోలేని రీతిలో క్రూరంగా వ్యవహరించారు. సంక్రాంతికి 2, 3 రోజుల ముందే సకినాలు, అరిసెలు, కారప్పూస వంటి పిండివంటలు చేసుకోవడం తెలంగాణలో ఆనవాయితీ. అలా అప్పుడే చేసుకున్న పిండివంటల్లో ఉమ్మేసి వాటినెవరూ ముట్టకుండా చేశారు ఆ దుండగులు. అంతేకాదు.. ఆ పిండివంటల్లో కొందరు దుండగులు ఉచ్చలు కూడా పోశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాలు కాల్చేశారు. వంటసామాగ్రి బయటపడేశారు. ఇళ్లను తగులబెట్టారు. పుస్తకాలు, సర్టిఫికెట్లు కాలిపోయాయి. పలువురు విద్యార్థుల భవితవ్యం మసకబారింది. చాలామంది పారిపోయారు. బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటికీ భైంసాలో సొంత ఇళ్లకు రావడానికి వణికిపోతున్నారు. బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారింది. తమ సంస్కృతిని ఆచరిస్తూ అక్కడ బతగ్గలమా అన్న అనుమానాలు ముసురుకున్నాయి. వెనక్కి వచ్చేందుకు ధైర్యం చాలటం లేదు. ఇదంతా ఎక్కడో జమ్మూ-కాశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దురాగతం కాదు. రేపో మాపో బంగారుగా మారుతుందన్న ఆశలు కల్పించిన మన తెలంగాణలోనే కావడం విశేషం. మనమంతా గంగా-జమునా తెహజీబ్ అని మాటిమాటికీ తెగ మురిసిపోయే తెలంగాణలోనే జరిగింది. హిందూ-ముస్లిం భాయీ భాయీ అని ఊరికే చంకలు గుద్దుకునే అల్ప సంతోషులైన జర్నలిస్టులు,  ఇతర మేధావులున్న తెలంగాణలోనే జరిగింది. తెలంగాణలో రజాకార్ల దురాగతాల గురించి కథలుకథలుగా ఇప్పటికీ వింటూ ఉంటాం. రజాకార్లు ప్రజల మాన, ప్రాణలతో చెలగాటమాడిన విషయం ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. అయితే అంతకన్నా దారుణమైనవాళ్లు, అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించే మరో జాతి ఉండేదన్న విషయం ఈ కాలం ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ పాతతరం వృద్ధుల్ని అడిగినప్పుడు వారి చర్యలు ఎంత అసహ్యకరంగా ఉండేదో చెబుతారు. గుంపులు గుంపులుగా ఊళ్ల మీద పడి కనిపించినవారి మీద దాడి చేయడం, అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే ఇళ్లల్లో చొరబడి బీభత్సం సృష్టించడం ఆ మూకలు చేసే పని. అనేక మంది ఇళ్లలో మానవ విసర్జితాలైన మల, మూత్రాలను కూడా ఇళ్లలో ఎగజిమ్మేవారని పాతతరం ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మానవ మలాన్ని నీళ్లలో కలిపి కళ్లాపి లాగా చల్లిన సందర్భాలను ఇప్పటికీ నెమరు  వేసుకునే కొందరు ముసలివాళ్లున్నారు. వారిని పిండారీలు అంటారని, వాళ్లు ఊళ్లల్లోకి అడుగుపెడుతుంటే ఊరపిచ్చుకలు సైతం భయంతో నిశ్శబ్దంగా గూళ్లలో చేరి బిక్కుబిక్కుమనేవని చెబుతారు.  అంత అనాగరికమైన సంస్కృతికి అధిపతులైనవారు పాలకుల తాబేదార్లుగా వ్యవహరించిన దారుణమైన సందర్భాలను కూడా తెలంగాణ చూసింది. మళ్లీ ఇప్పుడు అలాంటి రోజుల్ని గుర్తు చేసే క్రూరమైన ఘటనలు భైంసాలో చోటు చేసుకోవడం విషాదం. 


అయితే ఇది కాకతాళీయమా? ఓ సమావేశం కోసం వచ్చిన గుంపంతా ఒక్కటై, తమ సంస్కృతికి చెందని అవతలివర్గం వారిపై ఇంత జుగుప్సను ప్రదర్శించడం ఏంటి? ఎవరో ఉపన్యాసం ఇస్తే విని ఆ క్షణికావేశంలో ఏదో చేసేయాలన్న కసితో చేసిన పనా ఇది? కానేకాదు. ఇది కేవలం కోపంతోనో, కసితోనో చేసిన పని కాదు. ఇదంతా పగతో చేసిన పని. భైంసాలో తమను చాలెంజ్ చేస్తున్న అవతలివర్గం వారిని ఎలాగైనా అక్కడి నుంచి తరిమేయాలన్న దూరదృష్టి. అలా తరిమేస్తే ఇంక ఎక్కడా కూడా తమ దురాగతాలను ప్రశ్నించే సాహసం చేసేవారు ఉండరన్న పక్కా స్కెచ్. పండుగ కోసం చేసుకున్న పండివంటల మీద ఉచ్చలు పోయడమేంటి? దాన్నెవరూ ముట్టకుండా ఉమ్మేయడమేంటి? పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే రెండు శత్రువర్గాలు కూడా తినే తిండి మీద ఇంత జుగుప్సాకరంగా  వ్యవహరించవు కదా. ఇదేం సంస్కృతి? అవతలివర్గం సంస్కృతిని అవమానించడం, పండుగ సంబురాలకు ఆ ప్రజల్ని దూరం చేయడం, అసలు ఆ వర్గాన్నే ద్వేషించే ఓ విష సంస్కృతిగానే దీన్ని చూడాలి. 


మరి మీడియా ఏం చేసింది?
భైంసా విషయంలో మీడియా ఏంచేసింది అనే కన్నా.. అసలేమీ చేయలేదని చెప్పడం కరెక్ట్. రాజకీయ కక్ష సాధింపుల కోసం, పార్టీల మధ్య పంతాల కోసం ఉన్నదాన్ని లేనట్టు... లేనిది ఉన్నట్టూ ఊదరగొట్టే మెయిన్ మీడియా అంతా కూడా ఈ విషయంలో దోషులే. ప్రధాన స్రవంతి మీడియాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు సైతం సోషల్ మీడియా ద్వారానే తమ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించుకోగలిగారు తప్ప ప్రధాన మీడియాలో కాసింత స్పేస్ కూడా సంపాదించుకోలేకపోయారు. మొత్తానికి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అసలు విషయాలను, రానున్న రోజుల్లో ఏర్పడబోయే భయానక వాతావరణ హెచ్చరికలు చేయగలిగారు. ప్రజలకు  కాస్తో, కూస్తే అసలు విషయాన్ని విడమరచి  చెప్పగలిగారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వక మౌనాన్ని, అందులోని మర్మాన్ని ఎండగట్టగలిగారు. అంటే మీడియా సంస్థలు చేయలేని పనిని వ్యక్తులుగా కొందరు జర్నలిస్టులు చేశారు. కానీ ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలంటే అది సరిపోదు. నిందితులు  ఫలానా వర్గానికి చెందినవారు  కాబట్టి, వారిని పల్లెత్తు మాటంటే ఎక్కడ అసద్ కు, అక్బర్ కు కోపం వస్తుందోనని భయపడే పక్షపాతం వహించి ఉండవచ్చు. కానీ జనసామాన్యం దృష్టిలో తెలంగాణ ప్రభుత్వ ఒంటెత్తు పోకడ ఎలాంటిదో బాగా రిజిస్టరైపోయింది. దాని ప్రభావం ఏదో సమయంలో తప్పకుండా పడుతుంది. మరి నిందితుల్ని నిందితులుగా కాక ఓ వర్గం ప్రజలుగా ప్రభుత్వం ఎందుకు చూస్తుందన్నదే అర్థం కాని ప్రశ్న. నిందితులు ఎవరైనా, ఏ వర్గం వారైనా కోర్టు ముందుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేస్తే ఆ మంచిపేరు ప్రభుత్వానికే వస్తుంది కదా. దానివల్ల గుంపు మనస్తత్వం కలిగిన ఇతరుల్లో ఓ భయం అనేది ఉంటుంది కదా. ఇకపై అలాంటి దురాగతాలకు పాల్పడితే శిక్ష అనుభవించాల్సి వస్తుందన్న సంకేతం వెళ్తుంది కదా. కనీసం ఆ పనైనా ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు. 40, 50 మందిని అరెస్టు చేశారన్న వార్తలొస్తున్నాయి గానీ... కేసు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చింది, అసలు నిందితులు ఎవరు అన్న ప్రాథమిక సమాచారమేదీ బయటకు రాలేదు. అలాంటివాళ్ల పేర్లు రాకుండా ఉంటే రేపు మళ్లీ ఇలాంటి ఘటనలే పునరావృతం కావన్న గ్యారెంటీ ఏంటి? అవతలివర్గం కూడా దానికి రివెంజ్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తే దాన్ని ఆపేవారు ఎవరు? పాలకుల ఇలాంటి నిష్క్రియాపరత్వమే కదా.. గోద్రా లాంటి ప్రతీకార ఘటనలకు దారితీస్తుంది. ఈ చిన్న లాజిక్ మిస్సయితే ఎలాంటి పెద్ద ప్రమాదం భవిష్యత్తులో ఎదురవుతుందో గుర్తించాల్సింది పాలకులే కదా. మరి అలాంటి గుర్తింపు మన పాలకులకు ఎప్పుడొస్తుందో. 


- BNPost, Adilabad


 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?