Skip to main content

కరోనా కొమ్ములు విరిచే కిల్లర్- వీడియో


భారతీయ ఆయుర్వేదం అనే అమ్ములపొదిలో గాండీవాల్లాంటి అనేక చిట్కాలున్నాయి. అందులో ఒకటే పసుపుకొమ్ముల ఆవిరి. పసుపుకొమ్ముల ఆవిరి ఎలా చేయాలంటే.. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో తగినన్ని పసుపుకొమ్ములు వేసి బాగా మరిగించాలి. ఆ ఆవిరిని బాగా పట్టాలి. కరోనా రాకుండా నిరోధించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 


ఆవిరి పట్టడం ఇలా..


ఆవిరి పట్టడంలోనే మనకు మంచి రిలీఫ్ వస్తుంది. ముక్కునుండి పీల్చుకొని నోటిద్వారా 3 సార్లు, నోటి నుంచి పీల్చుకొని ముక్కుద్వారా 3 సార్లు.. ఇలా మార్చి మార్చి ఒక పదిసార్లు పడితే యాంటీ బ్యాక్టీరియాతో కూడిన వేడిఆవిరి ఊపిరితిత్తుల్లోకి, ముక్కు నాళాలు, శ్వాసకోశ నాళాల గుండా వెళ్తుంది. ఆవిరి వేడికి కరోనా వైరస్ చనిపోతుంది. వాస్తవానికి కరోనా అనేది వైరస్ కూడా కాదని, అది కేవలం ప్రొటీన్ మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది సింగిల్ గా ఉన్నప్పుడు నిర్జీవం.. ఏమీ చేయదు. ఆ వైరస్ కాస్తా మన చేతుల నుంచి ముక్కు, నోరు, కళ్లు.. ఇలాంటి అవయవాల ద్వారా లోపలికి వెళ్తే అది శ్వాసకోశ నాళాలు లేదా ఆహారవాహిక ద్వారా గోడలకు అంటుకుంటుంది. దానికుండే కొమ్ముల కారణంగా అది ఆ గోడలకు పట్టుకుని ఉంటుంది. కొన్ని గంటల తరువాత అక్కడున్న కణజాలాన్ని ఉపయోగించుకుని కరోనా ప్రొటీన్ వృద్ధి చెందుతుంది. అప్పుడు బలం పుంజుకొని శ్వాసకోశ వ్యవస్థ మీద తీవ్రమైన దాడి చేస్తుంది. 


అలా జరగకుండా ఉండాలంటే కరోనా ఒకవేళ మన లోపలికి వెళ్లినా అది అభివృద్ధి చెందే లోపే ఆవిరిని బాగా పట్టించినట్టయితే అది కాస్త నిర్జీవమవుతుందని నిపుణులు అంటున్నారు. Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  అలాంటి మహా పండితుడికి తగిన గుర్తింపు రాకపోవడం కాస్త చింతించాల్సిన విషయమేనని, అందుకు ఎవర