Skip to main content

Posts

కాంగ్రెస్ ను తలెత్తుకునేలా చేసిన టఫ్ మ్యాన్

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. బీఆర్ఎస్ కార్డు సైడ్ అయిపొయ్యి.. కాంగ్రెస్ కార్డు ముందుకొచ్చింది. దీనికంతటికీ కారణం ఒకే ఒక్కడు. ఆయనే టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగిల్ హ్యాండెడ్ గా పార్టీని, సీనియర్లను, శ్రేణులను, కేడర్ ను నడిపించి ఉన్నతాసనాన్ని ఖరారు చేసుకున్నారు రేవంత్. మరి.. ఈ ఉన్నతమైన స్థానం ఆయనకు ఊరికే లభించిందా? ఆయన కృషి ఎలాంటిది?  తెలంగాణ ప్రభుత్వ మార్పిడిలో కీలకమైన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారూ ఉంటే అది రేవంత్ రెడ్డి. టీ-పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం వెనుక.. కాంగ్రెస్ కు కాకతాళీయమైన అవసరమేం లేదంటారు నిపుణులు. రేవంత్ ను టీ-పీసీసీ చీఫ్ గా తీసుకోవడం వెనుక ఉభయుల ప్రయోజనాలూ ఉన్నాయట. అందుకే కాంగ్రెస్ ను తనకు అప్పగిస్తే.. కొన్ని కీలకమైన నిర్ణయాలు తనకు కట్టబెడితే.. పార్టీని నడిపిస్తానని.. హైకమాండ్ నిశ్చింతగా ఉండొచ్చని.. కచ్చితంగా రిజల్ట్ రాబడతానని ఎంతో నమ్మకంగా చెప్పారట రేవంత్. ఆయన మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చూసే.. సోనియా, రాహుల్ టీ-పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించేందుకు ముందుకొచ్చారు. దానిపై టీ-కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు, ఎన్ని అసంతృప్తులు వచ్చినా డోంట్ కేర్

వనపర్తి గెలుపు బాటలో నిరంజన్ రెడ్డి

తెలంగాణలో సుదీర్ఘమైన, చెప్పుకోదగిన చరిత్ర గల పాతకాలపు సంస్థానమే వనపర్తి. ఆత్మాభిమానానికి, పౌరుష పరాక్రమాలకు, కవి గాయక వైతాళికులకు పెట్టింది పేరు.. ఈ వనపర్తి. కాలక్రమంలో అదే ఇప్పుడు నియోజకవర్గంగా మారింది. అలాంటి వనపర్తిలో ఎన్నికల పోరాటం రసవత్తరంగా మారుతోంది. అందుక్కారణం సిట్టింగ్ మినిస్టర్ గా, నీళ్ల నిరంజనుడిగా పేరున్న కేసీఆర్ అనుచరుడు ఒకరైతే.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తెలంగాణ ఆవిర్భవించిన సమయంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి మరొకరు. అయితే ఆయనకు టికెట్ ఇస్తానని ఊరించిన కాంగ్రెస్ అధిష్టానం.. మేఘారెడ్డిని అభ్యర్థిగా మార్చేసింది. ఇలాంటి సమయంలో వనపర్తిలో గెలుపు జెండా ఎగరేసేది ఎవరు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే తెలంగాణకు ముందు.. తెలంగాణకు తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలమూరు రూపురేఖలు మారిపోయాయి. అందులో భాగమైన వనపర్తి జిల్లా పేరుతో ఏర్పడిన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు తీసింది. ఇప్పుడీ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మేఘా

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం) అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం.  దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి. 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం.  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరా

కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలు ఫలించేనా?

తెలంగాణలో ఈ మధ్య వినిపిస్తున్న శబ్దం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ హ్యాట్రిక్ మాత్రమే. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి పవర్ పగ్గాలు చేపడతారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే గాక.. యావత్ దక్షిణ భారతదేశంలోనే ఓ సరికొత్త రికార్డు సృష్టిస్తారన్న అంచనాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అటు బీఆర్ఎస్ కేడర్ నుంచైతే.. ఫిర్ ఏక్ బార్ - కేసీఆర్ సర్కార్.. అంటూ ఉత్సాహపూరిత నినాదాలు వినిపిస్తున్నాయి. అటు కేసీఆర్ బహిరంగ సభల్లోనూ కేసీఆర్ ప్రసంగాలకు, ఆయన వివరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వ్యక్తమవుతోంది.  కేసీఆర్ లో మూడు రకాల షేడ్స్ కనిపిస్తాయంటారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ స్థాపించే కంటే ముందు సాధారణ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఓ ఉద్యమానికి నేతృత్వం వహించిన నేతగా ఆయనలో అతి గాఢమైన రెండో ఛాయ కనిపిస్తుంది. పార్టీ స్థాపించిన 14 ఏళ్లకు.. తాను స్వప్నించిన స్వరాష్ట్రాన్ని సాకారం చేసుకొని దేశంలో ఏ నాయకుడికీ లేనంత గాఢమైన ప్రొఫైల్ ను సొంతం చేసుకున్నారు. తెలంగాణ సాకారంతో దేశమంతటా ఆయన పేరు మార్మోగిపోయిందంటే అతిశయోక్తి కాదు. అప్పటికి బీజేపీ ఆధ్వర

చంద్రబాబు ప్రయత్నాలు ఢిల్లీలో ఫలించలేదా?

చంద్రబాబుకు అక్కడ ఢిల్లీలో ద్వారాలు మూసుకుపోయాయా? ఆయన ఎంత ప్రయత్నించినా అమిత్ షా మనసు కరగలేదా? తన కష్టాలు తీరాలన్నా, పార్టీ మీద నీలినీడలు తేలిపోవాలన్నా బలమైన జాతీయ పార్టీ అండ కావాలని కోరుకున్న బాబుకు.. కమలనాథుల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదట. ఆ విషయం కన్ఫామ్ అయ్యాకనే ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ వైపు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టడం ఖాయంగా మారిందట. మరి ఆ విశేషాలేంటి? మొక్క ఎదగాలంటే పందిరి కావాలి. పందిరి లేకపోతే ఎంత మంచి మొక్క అయినా కూడా ఎదగడం ఆగిపోతుంది. అయితే ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు అచ్చం మొక్కలాగే మారిపోయిందట. మరి మొక్కలాంటి పార్టీకి ఎవరో ఒకరు నీరు పోయాల్సిందే. ఎవరో ఒకరి చెయ్యి అందించాల్సిందే. బాబు అందుకోసమే కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ప్రాంతీయ పార్టీగా తెలంగాణలోనే కాదు.. అటు ఆంధ్రాలోనూ ఇప్పుడు టీడీపీ తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయింది. తెలంగాణలో అయితే దాదాపుగా అదృశ్యమయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణ టీడీపీలో అసలు కీలక నేతలెవరూ లేకుండా పోయారంటే అతిశయోక్తి కాదు. పట్టణాల్లో, గ్రామాల్లో అక్కడక్కడా సానుభూత

కాసాని జ్ఞానేశ్వర్ పయనం వెనకాల

మా దుకాణం మా ఇష్టం. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తెరుస్తాం.. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మూస్తాం. మీకేమైనా అభ్యంతరమా? అన్నట్టుగా ఉందట టీడీపీ హైకమాండ్ వైఖరి. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసి ఉనికి చాటుకుంటేనే కదా.. పార్టీకి భవిష్యత్తు ఉండేది? మరి పార్టీ భవితవ్యాన్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టారా? పోటీ చేస్తామన్న కాసాని జ్ఞానేశ్వర్ ను.. సైలెంట్ చేయించి టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించడంలో ఆంతర్యమేంటి? జ్ఞానేశ్వర్ రాజీనామా నుంచి ఓటర్లకు ఏం సంకేతం వెళ్తోంది? టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడం.. టీ-రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి ఉండే ఫాలోయింగ్ గురించి మాట్లాడుకోవాల్సింది పెద్దగా ఏమీ లేదు. కానీ.. దాని వెనకాల చంద్రబాబు నడుపుతున్న మంత్రాంగం ఎంత లోతైందనే విషయమే సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొంతమంది జ్ఞానేశ్వర్ రాజీనామాను హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. రాజీనామా వెనకాల బీఆర్ఎస్ కు ఆయన రాజీపడిపోయారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ జ్ఞానేశ్వర్ చెబుతున్న వాదనలు వింటే చంద్రబాబు తెరంగేట్రం ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చంటున్నార

కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం"

టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏది అనుకున్నారో అదే చేశారా? ఎవరికి టికెట్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో.. ఆయన మైండ్ లో ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకొని ఉన్నారా? తన సొంత నిర్ణయం మేరకే రెండో జాబితాలో టికెట్లు వచ్చాయని.. అంతకు మించి సమన్యాయం గానీ, సామాజిక న్యాయానికి గానీ అందులో చోటే లేదంటున్నారు.. టికెట్ దక్కని నిరాశావహులు. టికెట్ దక్కనివారు ఆ అక్కసుతో మాట్లాడతారని అర్థం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో పూర్తిగా రేవంత్ మార్కే కనిపిస్తోందని.. ఆయన రెడ్డి సామాజికవర్గం నేతల విషయంలో పక్షపాతం చూపారన్న అసంతృప్తి బలపడుతోంది.  టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తాను అనుకున్నదే చేస్తారు తప్ప.. ఇతరులు చెప్పింది చేయరని ఇప్పుడు నిరూపించుకున్నారు. టీ-కాంగ్రెస్ రెండో లిస్టును యథాలాపంగా పరికించినా ఆ విషయం అర్థమవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈనెల 15న టీ-కాంగ్రెస్ మొదటిజాబితాలో 55 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేశారు. రెండో జాబితాలో 45 స్థానాలను క్లియర్‌ చేశారు. దీంతో టీ-కాంగ్రెస్ ఇప్పటివరకు వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. రెండో జాబితాలోని 45 స్థానాల్లో అగ్రవర్ణాలకు పెద్దపీట వేశారు.