Skip to main content

Posts

రాష్ట్రపతి విలాసాలు.. రాష్ట్రపతి భవన్ విశేషాలు

ఒక్క భారతదేశంలోనే కాదు.. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అత్యంత దిగువ స్థాయి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తొలి గిరిజన మహిళగా.. ఆమె దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహిస్తున్నారు. అంతేనా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రథమ పౌరురాలిగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ముకు లభించబోయే అధికారాలేంటి? ప్రభుత్వం నుంచి అందుకునే జీతభత్యాల వివరాలేంటి? ఇతర ప్రత్యేకమైన సదుపాయాలేంటో ఓసారి చూద్దాం. దేశంలో అత్యంత వెనుకబడ్డ గిరిజన తెగ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దేశం అనుసరిస్తున్న అత్యున్నతమైన ప్రజాస్వామ్య విధానానికి ఆమె ఎన్నికే ఓ గీటురాయిగా నిలుస్తోందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్నో అవరోధాలు అధిగమించి ఈ స్థాయికి ఎన్నికవడంతో యావత్ గిరిజన జాతి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆమె రాష్ట్రపతిగా వేతనం ఎంత అందుకుంటారనేది ఓ ఆసక్తికరమైన అంశంగా మారింది. భారత రాష్ట్రపతి నెలకు 5 లక్షల వేతనం అందుకుంటారు. నెల వ

భక్తుల డిమాండ్‎కు తలొగ్గిన శ్రావణభార్గవి

ఒకసారి పాపులారిటీ వస్తే.. దానికి బోనస్ గా నిర్లక్ష్యం కూడా వస్తుందా? అయితే ప్రజల నుంచి నిరసన ఎదురైతే.. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పాపులారిటీ కూడా పేకమేడల్లా కూలిపోక తప్పదు. గాయని శ్రావణభార్గవి విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు.. శ్రీవారి భక్తులు. ఇటీవల ఆమె పాడి నటించిన అన్నమయ్య కీర్తన వివాదానికి కేంద్ర బిందువైంది. ఆమె పాటపై అన్నమయ్య వంశీకులు తీవ్ర్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియోను డిలీట్ చేయాలని కోరారు. అయినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. తన పాటలో అసభ్యత ఏముందని ఎదురు ప్రశ్నించింది కూడా. ఆ వివాదం చినికిచినికి గాలివానగా మారి... అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికీ సిద్ధమయ్యారు. అటు వెంకన్న భక్తులు కూడా శ్రావణభార్గవికి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు. ఇలా అన్ని వైపుల నుంచీ విమర్శలు రావడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఆలస్యంగానైనా తన యూట్యూబ్ చానల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆమె మంచి గాయని కావడంతో వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అది కాస్తా వివాదాస్పదం అయ్యాక మరింత వ్యూస్ వచ్చే అవకాశం పెరిగింది. కానీ తప్పనిసరి పరిస్థి

పదవి కోసం రాములమ్మ పలవరింత

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజకీయ నాయకురాలు రాములమ్మ అలియాస్ విజయశాంతి. అయితే రాములమ్మ ఈ మధ్య కాస్త వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆమె తెలంగాణ కాంగ్రెస్ ను వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరినా.. నిరాశే మిగులుతుందన్న చర్చ సాగుతోంది. హస్తం పార్టీలో ప్రచారకమిటీ చైర్ పర్సన్ పదవిని వదులుకున్న విజయశాంతి.. కమల దళంలో తనకంతా పాతమిత్రులే కదా.. తగిన ప్రాధాన్యమిస్తారని కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె పార్టీలో చేరి దాదాపు రెండేళ్లవుతున్నా.. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత గల పదవులూ రాకపోవడంతో ఆమె అనుచరులు, అభిమానులు రాములమ్మ నిరాశలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారట. ఆమె పార్టీలో చేరిన ఆరునెలల్లో.. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పదవి కేటాయించి ఢిల్లీ పెద్దలంతా ఇక సైలెంటయ్యారన్న చర్చ పార్టీలో సాగుతోంది.  Also Read: కాంగ్రెస్‎లో పసలేని దావత్‎లు Also Read: కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ Also Read: విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న టీ-సర్కారు వాజ్‎పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయశాంతి యాక్టివ్ గా పనిచేశారు. ఆ తరువాత అనేక కారణలతో ఆమె పార్టీ మారారు

కాంగ్రెస్‎లో పసలేని దావత్‎లు

కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా.. ఒక్కటయ్యేది మాత్రం దావత్ దగ్గరే. అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో దావత్ లకు టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడూ అసమ్మతులతో, అసంతృప్తులతో రగిలిపోయే టీ-కాంగ్రెస్ నేతల్ని ఒక్కటి చేయాలంటే ఈ దావత్ ల స్ట్రాటజీ అయితేనే బాగుంటుందని ఆ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ భావించినట్టున్నారు. అందుకోసం స్పెషల్ గా ప్లాన్ చేశారు.  టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం, హెచ్చరికల పర్వం ముగిసి.. విందు రాజకీయాల పర్వం నడుస్తోంది. ఈ మధ్య పార్టీకి మాంచి ఊపొచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఇకనైనా అంతర్గత కుమ్ములాటలు అదుపు చేయకపోతే లాభం ఉండదని భావించారు. ఇందుకోసం నాయకుల మధ్య విభేదాలు రూపుమాపాలని మాణిక్కం ఠాగూర్ ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. తన రెండు రోజుల పర్యటనలో హైదరాబాద్ వచ్చిన ఠాగూర్.. ఈసారి నేతల మధ్య సమన్వయం కోసం విందు రాజకీయాలకు తెరలేపారు. బ్రేక్ ఫాస్ట్ ఒక నేత ఇంట్లో చేస్తే.. లంచ్ ఇంకో లీడర్‎సాబ్ ఇంట్లో చేయడం.. అందరికీ యాక్సిస్ ఉండే చోట మరో చోట రాత్రిపూట చేతులు కడగడం. ఇదీ ఠాగూర్ నిర్ణయించుకున్న ప్రోగ్రామ్. ఇందుకోసం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‎గౌడ్‎తో డిన్నర్ ఏర్పాటు చేసినప్పట

విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న ప్రభుత్వం-ఎర్రోజు భిక్షపతి

కాంగ్రెస్, బీజేపీలకు విజ్ఞాపనపత్రాలు ఇస్తాం: ఎర్రోజు భిక్షపతి తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను దారుణంగా అవమానపరుస్తుందని, ఇకనైనా ప్రభుత్వం మోసపుచ్చే ధోరణి విడనాడకపోతే ఆత్మగౌరవ పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారిలో విశ్వబ్రాహ్మణులే ముందువరుసలో ఉంటారన్నారు. అయినా కడు పేదరికంలో మగ్గుతున్న విశ్వబ్రాహ్మణుల పట్ల కనీసం ఇతర బీసీ కులాలకు ఇచ్చిన గౌరవం, ఆదరణ కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండలు అందించిన విశ్వబ్రాహ్మణుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తమ సంఘంలోనే తమకు గొడవలు పెట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన తమ ప్యానెల్ కు బదులు... అప్రజాస్వామికంగా దొంగదారిలో ఎంపికైన సంఘాన్ని గుర్తించి అలా ఎంపికైన సంఘానికే ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల స్థలాన్ని, రూ. 5 కోట్లను కేటాయించడం పూర్తి అన్యాయమన్నారు. అప్రజాస్వామిక సంఘాన్ని కొందరు టీఆర్ఎస్ నాయకులే ప్రోత్సహిస్తున్నారని, అది

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  Also Read:  విమోచనమా? విద్రోహమా? సమైక్యతా దినోత్సవమా? అలాంటి మహా పండితుడికి తగిన గుర్తి

కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

కమలనాథుల వ్యూహం తెలంగాణ బీజేపీ కేడర్లోనే గాక, ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఈటల చేతనే.. అదే కేసీఆర్ కు చుక్కలు చూపించాలని అమిత్ షా వ్యూహం పన్నారు. షా వ్యూహం పాసవుతుందా.. ఫెయిలవుతుందా అన్నది కాస్త పక్కనపెడితే.. ఈటల ప్రకటనల వెనుక భారీ పరమార్థమే దాగున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ అమిత్ షా-ఈటల ఏం మాట్లాడుకున్నారు? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? వారి వ్యూహంతో కేసీఆర్ నిజంగానే ఉలిక్కిపడతారా.. అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.  తెలంగాణ బీజేపీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తారని పేరున్న గులాబీ బాసుకు కూడా వణుకు పుట్టించే విధంగా పథకరచన చేస్తోంది కమలం క్యాంపు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ లో సంచలన విజయం నమోదు చేసి దేశవ్యాప్త రాజకీయ నేతల దృష్టిని తనవైపు మరల్చిన మాజీ మంత్రి ఈటల.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసిఆర్ ను ఢీకొట్టడానికే సిద్ధమవుతున్నారు. కేసిఆర్ పై గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించడం అందుకే సంచలనంగా మారింది. అంతేకాదు.. అసలు తా