Skip to main content

విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న ప్రభుత్వం-ఎర్రోజు భిక్షపతి

కాంగ్రెస్, బీజేపీలకు విజ్ఞాపనపత్రాలు ఇస్తాం: ఎర్రోజు భిక్షపతి

తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను దారుణంగా అవమానపరుస్తుందని, ఇకనైనా ప్రభుత్వం మోసపుచ్చే ధోరణి విడనాడకపోతే ఆత్మగౌరవ పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందని విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారిలో విశ్వబ్రాహ్మణులే ముందువరుసలో ఉంటారన్నారు. అయినా కడు పేదరికంలో మగ్గుతున్న విశ్వబ్రాహ్మణుల పట్ల కనీసం ఇతర బీసీ కులాలకు ఇచ్చిన గౌరవం, ఆదరణ కూడా ఇవ్వడం లేదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమానికి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండదండలు అందించిన విశ్వబ్రాహ్మణుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తమ సంఘంలోనే తమకు గొడవలు పెట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన తమ ప్యానెల్ కు బదులు... అప్రజాస్వామికంగా దొంగదారిలో ఎంపికైన సంఘాన్ని గుర్తించి అలా ఎంపికైన సంఘానికే ఉప్పల్ భగాయత్ లో ఐదెకరాల స్థలాన్ని, రూ. 5 కోట్లను కేటాయించడం పూర్తి అన్యాయమన్నారు. అప్రజాస్వామిక సంఘాన్ని కొందరు టీఆర్ఎస్ నాయకులే ప్రోత్సహిస్తున్నారని, అది ఎవరనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించాలన్నారు. దీనిపై ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకు ఎన్నిసార్లు వ్యక్తిగతంగా కలిసి విన్నవించినా.. ఫలితం లేకుండా పోయిందని, ఫలితంగా ఈ ప్రభుత్వంపై విశ్వబ్రాహ్మణ జాతి నమ్మకం కోల్పోయే పరిస్థితి దాపురించిందన్నారు. 

గత సెప్టెంబర్లో అబ్దుల్లాపూర్‎మెట్ లో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్.. భూ కేటాయింపులు, నిధుల కేటాయింపుల కాగితాలు తమ సంఘానికి అప్పగించారని, వారు ప్రజల చేత ఎన్నికైనట్టుగానే తెలంగాణ విశ్వబ్రాహ్మణ సమాజం ఓట్ల ద్వారా ఎన్నికైన వీవీఐఎస్ ను కూడా ప్రభుత్వం గుర్తించిందని, అందుకే తనను ఆ సభకు పంపి కాగితాలు అప్పగించాలని ఆదేశించినట్లు చెప్పిందని గంగుల అన్నారని గుర్తు చేశారు. అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు విస్మరించారో అర్థం కావడం లేదన్నారు. ఏ ఒక్క నాయకుడి కోసమో యావత్ విశ్వబ్రాహ్మణ జాతి ఓర్పును పరీక్షించాలనుకోవడం మంచిది కాదని కేసీఆర్ కు హితవు పలికారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని, లేకపోతే పోరాటానికి పిలుపునివ్వాల్సి వస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే గ్రామగ్రామం నుంచి విశ్వబ్రాహ్మణ యూత్ ఐక్యంగా కదిలి ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు. తమకు ప్రభుత్వపరంగా జరుగుతున్న అన్యాయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కు 2 వేల కోట్లు కేటాయించాలని, వడ్రంగులపై అటవీ అధికారులు దాడులు ఆపాలని, స్వర్ణకారులపై పోలీసు వేధింపులు నిలిపివేయాలని, శిల్పకారులకు క్వారీలు కేటాయించాలని, విశ్వబ్రాహ్మణ పురోహితుల్ని దేవాలయాల్లో అర్చకులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో విశ్వబ్రాహ్మణుల పారిశ్రామికవాడకు 20 ఎకరాల  స్థలాన్ని కేటాయించాలని, 50 ఏళ్లు పైబడినవారికి పెన్షన్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ లోని తార్నాకలో ప్రధాన కార్యదర్శి నందిపేట రవీంద్రాచారి, ఇతర నాయకులతో కలిసి భిక్షపతి ప్రెస్‎మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మచారి, ఎర్రోజు రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం అన్నారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఒత్తిడే ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలని రేవంత్ సూచించారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎ