Skip to main content

భక్తుల డిమాండ్‎కు తలొగ్గిన శ్రావణభార్గవి

ఒకసారి పాపులారిటీ వస్తే.. దానికి బోనస్ గా నిర్లక్ష్యం కూడా వస్తుందా? అయితే ప్రజల నుంచి నిరసన ఎదురైతే.. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పాపులారిటీ కూడా పేకమేడల్లా కూలిపోక తప్పదు. గాయని శ్రావణభార్గవి విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు.. శ్రీవారి భక్తులు. ఇటీవల ఆమె పాడి నటించిన అన్నమయ్య కీర్తన వివాదానికి కేంద్ర బిందువైంది. ఆమె పాటపై అన్నమయ్య వంశీకులు తీవ్ర్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియోను డిలీట్ చేయాలని కోరారు. అయినా ఆమె మాత్రం వెనక్కు తగ్గలేదు. తన పాటలో అసభ్యత ఏముందని ఎదురు ప్రశ్నించింది కూడా. ఆ వివాదం చినికిచినికి గాలివానగా మారి... అన్నమయ్య కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికీ సిద్ధమయ్యారు. అటు వెంకన్న భక్తులు కూడా శ్రావణభార్గవికి వార్నింగ్ ఇచ్చారు. ఆమెను తిరుమలలో అడుగుపెట్టనీయం అంటూ హెచ్చరించారు. ఇలా అన్ని వైపుల నుంచీ విమర్శలు రావడంతో శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగిరాక తప్పలేదు. ఆలస్యంగానైనా తన యూట్యూబ్ చానల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేయాల్సి వచ్చింది. ఆమె మంచి గాయని కావడంతో వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అది కాస్తా వివాదాస్పదం అయ్యాక మరింత వ్యూస్ వచ్చే అవకాశం పెరిగింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వీడియోను డిలీట్ చేయక తప్పలేదు. 

అన్నమయ్య గురించి తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. శ్రీనివాసుడి మహిమల గురించి తెలియాలంటే అన్నమయ్య పాటలు వింటే సరిపోతుందని చెబుతారు. అంతటి ఆధ్యాత్మిక తత్వాన్ని, భక్తి భావాన్ని తన సాహిత్యం ద్వారా అందించిన అన్నమయ్యను భగవంతుడితో సమానంగా భావిస్తారు. అలాంటి అన్నమయ్య భగవంతుడి రూపురేఖలకు మోహితుడై రాసిన ఓ కీర్తనను.. శ్రావణభార్గవి తన అందాలను వర్ణించుకుంటున్నట్టుగా అభినయిస్తూ పాడింది. 'ఒకపరి ఒకపరి వయ్యారమే' అంటూ సాగే కీర్తనను శ్రావణభార్గవి.. ఇలా వక్రీకరించిందని అన్నమయ్య కుటుంబ సభ్యులు, శ్రీవారి భక్తులు విమర్శనాస్త్రాలు సంధించారు. అన్నమయ్య కుటుంబ సభ్యులను శ్రావణభార్గవి లైట్ తీసుకున్నా.. భక్తుల ఒత్తిడికి మాత్రం తలొగ్గక తప్పలేదు. 

Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

శ్రావణభార్గవి హావభావాలు, అభినయం.. అన్నమయ్య ఆధ్యాత్మికతలోని ఔన్నత్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు ఆరోపించారు. భక్తితో కూడుకున్న పాటను ఇలా అసభ్యకరంగా రూపొందించడం ఏంటని.. వెంటనే వీడియో డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ట్రస్ట్‌ సభ్యునికి, శ్రావణ భార్గవికి మధ్య జరిగినట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు శ్రావణ భార్గవి వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొంతమంది శ్రావణ భార్గవిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించారు. కొందరు తిరుపతి వాసులైతే.. ఆమె వీడియో డిలీట్ చేసి క్షమాపణ చెప్పకపోతే.. తిరుపతిలో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. దీంతో మొత్తానికి శ్రావణభార్గవి భక్తుల ఆగ్రహానికి తలవంచక తప్పలేదు. ఆమె వీడియోను డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగినట్టేనని భావిస్తున్నారు. 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత