Skip to main content

పదవి కోసం రాములమ్మ పలవరింత

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజకీయ నాయకురాలు రాములమ్మ అలియాస్ విజయశాంతి. అయితే రాములమ్మ ఈ మధ్య కాస్త వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆమె తెలంగాణ కాంగ్రెస్ ను వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరినా.. నిరాశే మిగులుతుందన్న చర్చ సాగుతోంది. హస్తం పార్టీలో ప్రచారకమిటీ చైర్ పర్సన్ పదవిని వదులుకున్న విజయశాంతి.. కమల దళంలో తనకంతా పాతమిత్రులే కదా.. తగిన ప్రాధాన్యమిస్తారని కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమె పార్టీలో చేరి దాదాపు రెండేళ్లవుతున్నా.. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత గల పదవులూ రాకపోవడంతో ఆమె అనుచరులు, అభిమానులు రాములమ్మ నిరాశలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారట. ఆమె పార్టీలో చేరిన ఆరునెలల్లో.. జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పదవి కేటాయించి ఢిల్లీ పెద్దలంతా ఇక సైలెంటయ్యారన్న చర్చ పార్టీలో సాగుతోంది. 

Also Read: కాంగ్రెస్‎లో పసలేని దావత్‎లు

Also Read: కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

Also Read: విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న టీ-సర్కారు

వాజ్‎పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయశాంతి యాక్టివ్ గా పనిచేశారు. ఆ తరువాత అనేక కారణలతో ఆమె పార్టీ మారారు. తరువాత పాత పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో.. మళ్లీ తన రాజకీయ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకొని తిరిగి సొంతగూటికి చేరారు. అయితే ఆమె రెండోసారి బీజేపీలో చేరిన నాటి నుంచే రాజ్యసభపై భారీ ఆశలు పెట్టుకున్నారట. ఇటీవల రాజ్యసభ సీట్ల కేటాయింపులో చివరివరకు విజయశాంతి పేరు వినిపించినా బీసీ కోటాలో.. డాక్టర్ లక్ష్మణ్ కు పార్టీ పెద్దలు అవకాశం కల్పించారు. దీంతో ఆమె నిరాశ చెందినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. రాజ్యసభ కాకపోయినా.. గతంలో జాతీయ మహిళా మోర్చా హోదాలో కీలకపదవి నిర్వహించినట్టు.. అలా జాతీయ కమిటీలో ఏదైనా మంచి పదవి కేటాయిస్తారని, అది కూడా కేంద్రమంత్రి హెదాలో ఏదో ఒక పదవి ఇస్తారని చాలామంది పార్టీలో చెప్పుకున్నారు కూడా. అయితే పార్టీలో చేరి రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా.. ఆమెకు ఎలాంటి పదవులూ తలుపు తట్టకపోవడంతో రాములమ్మ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోడీ లాంటి కీలక నేతలు పరిచయం ఉన్నా రామలమ్మకు... పదవులు రాకపోవడం సొంతపార్టీలోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చర్చ సాగుతోంది.

కొండంత ఆశలు పెట్టుకొని.. జాతీయపార్టీలో కీలక పదవి కోసం బీజేపీ గూటికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ లో మాదిరిగానే అవమానాలే ఎదురవుతున్నాయనే భావనలో విజయశాంతి ఉన్నారట. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం తప్ప.. పార్టీలో పదవులు ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ నడుస్తుండడంతో... మరి.. రాములమ్మకు కమలం పార్టీలో కీలక పదవి వస్తుందా, రాదా.. వస్తే ఎప్పుడొస్తుంది.. ఎలాంటి పదవి వస్తుందన్న చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం అన్నారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఒత్తిడే ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలని రేవంత్ సూచించారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎ