Skip to main content

కాంగ్రెస్‎లో పసలేని దావత్‎లు

కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా.. ఒక్కటయ్యేది మాత్రం దావత్ దగ్గరే. అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో దావత్ లకు టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడూ అసమ్మతులతో, అసంతృప్తులతో రగిలిపోయే టీ-కాంగ్రెస్ నేతల్ని ఒక్కటి చేయాలంటే ఈ దావత్ ల స్ట్రాటజీ అయితేనే బాగుంటుందని ఆ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ భావించినట్టున్నారు. అందుకోసం స్పెషల్ గా ప్లాన్ చేశారు. 

టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం, హెచ్చరికల పర్వం ముగిసి.. విందు రాజకీయాల పర్వం నడుస్తోంది. ఈ మధ్య పార్టీకి మాంచి ఊపొచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఇకనైనా అంతర్గత కుమ్ములాటలు అదుపు చేయకపోతే లాభం ఉండదని భావించారు. ఇందుకోసం నాయకుల మధ్య విభేదాలు రూపుమాపాలని మాణిక్కం ఠాగూర్ ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. తన రెండు రోజుల పర్యటనలో హైదరాబాద్ వచ్చిన ఠాగూర్.. ఈసారి నేతల మధ్య సమన్వయం కోసం విందు రాజకీయాలకు తెరలేపారు. బ్రేక్ ఫాస్ట్ ఒక నేత ఇంట్లో చేస్తే.. లంచ్ ఇంకో లీడర్‎సాబ్ ఇంట్లో చేయడం.. అందరికీ యాక్సిస్ ఉండే చోట మరో చోట రాత్రిపూట చేతులు కడగడం. ఇదీ ఠాగూర్ నిర్ణయించుకున్న ప్రోగ్రామ్. ఇందుకోసం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‎గౌడ్‎తో డిన్నర్ ఏర్పాటు చేసినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదని నేతలంతా వాపోతున్నారట. నేతల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన విందులో... ఎవరైతే పార్టీలో అంతర్గత అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ నేతలే హాజరు కాకపోవడంతో విందు సమన్వయ రాజకీయం కాస్తా జస్ట్ భోజనాలతోనే ముగిసిందట.

Also Read: కేసీఆర్‎ను ఓడించే భారీ స్కెచ్ రెడీ

Also Read: విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న టీ-సర్కారు

ఆదివారం మధ్యాహ్నం కోమటిరెడ్డి ఏర్పాటు చేసిన లంచ్ మీట్‎లో ఠాగూర్‎తో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పాల్గొన్నారు. అక్కడ సునీల్ రిపోర్టు ఆధారంగా జరిగిన చేరికలు, అంతర్గత అంశాలు, షర్మిల పార్టీ ప్రభావం తదితర అంశాలు చర్చకు వచ్చాయట. అయితే ఇలాంటి కీలక విందుకు కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డిని ఆహ్వానించినా.. రేవంత్ మాత్రం హ్యాండిచ్చారు. ఆ టైమ్ కి ఆయన వేరే ప్రోగ్రాంలో పాల్గొనడంతో ఈ లంచ్ మీట్ నిష్ప్రయోజనంగా మారిందని నేతలు వాపోతున్నారు. దీంతో అసలైన అంశాలకు బదులు పస లేని అంశాలమీదనే చర్చించుకోవాల్సి వచ్చిందట. అంతకుముందు ఉదయం జానారెడ్డితో ఠాగూర్ ఒక రహస్య ప్రదేశంలో అల్పాహార విందులో పాల్గొని పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించినట్లు సమాచారం. ఈ బ్రేక్‎ఫాస్ట్ మీట్‎లో ఎవరెవరు పాల్గొన్నారన్నది బయటకు పొక్కకుండా నేతలంతా సీక్రసీ మెయింటెయిన్ చేయడం మాత్రం విశేషంగానే భావించాలి. 

ఇదంతా ఒక ఎత్తయితే పార్టీ నేతలంతా ఆసక్తిగా ఎదురుచూసిన డిన్నర్ మీట్‎కి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేవంత్ ను వ్యతిరేకించే ఇతర నేతలు మాత్రం ఈ విందుకు యథావిథిగా హాజరయ్యారు. అసలు విందు ఏర్పాటు చేసిందే నేతల మధ్య సమన్వయం కోసమని.. కానీ ఎవరైతే పార్టీ పట్ల బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ  పీసీసీ మీద అసంతృప్తిగా ఉన్నారో.. ఆ నేతలే హాజరు కాకపోవడంతో సమన్వయ విందు కాస్తా ఆ ఇద్దరు కీలక నేతల గైర్హాజరుతో భోజనాలకే పరిమితమైందట. ఉన్న కొంతమంది నేతలు పార్టీ అంశాలు చర్చించినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో కొంతమంది నైరాశ్యంలో మునిగిపోయారని సమాచారం. అయితే మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి రేవంత్ రాకపోవడం.. పీసీసీ ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ కి కోమటిరెడ్డి రాకపోవడం.. ఇల్లు కూడా పక్కనే ఉన్న జగ్గారెడ్డి కూడా అలాగే వ్యవహరించడంతో పీసీసీ డిన్నర్ మీట్ అంశం హాట్ టాపిగ్గా మారింది. నేతలందరి ఇళ్లు కూడా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోనే ఉండడంతో.. ఇలాంటి విందుల వల్ల ఒరిగేదేంటి అనుకొని నేతలంతా నిట్టూర్పులు విడిచారట. 

ముఖ్యనేతలంతా సమన్వయ విందులకు డుమ్మా కొట్టడంతో.. ఇప్పట్లో టీ-కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కష్టమేనని భావిస్తున్నారట. పార్టీ జోష్ లో ఉన్న సమయంలో బహిరంగ వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు మెసేజ్‎లు పోకుండా.. సమన్వయం కోసం ఠాగూర్ చేసిన విందు రాజకీయం బెడిసికొట్టడంతో.. మరి సమన్వయం కోసం అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.