కమలనాథుల వ్యూహం తెలంగాణ బీజేపీ కేడర్లోనే గాక, ప్రజల్లోనూ ఆత్మవిశ్వాసం నింపేలా కనిపిస్తోంది. కేసీఆర్ చేతిలో దెబ్బ తిన్న పులిలా ఉన్న ఈటల చేతనే.. అదే కేసీఆర్ కు చుక్కలు చూపించాలని అమిత్ షా వ్యూహం పన్నారు. షా వ్యూహం పాసవుతుందా.. ఫెయిలవుతుందా అన్నది కాస్త పక్కనపెడితే.. ఈటల ప్రకటనల వెనుక భారీ పరమార్థమే దాగున్నట్టు మాత్రం కనిపిస్తోంది. ఇంతకీ అమిత్ షా-ఈటల ఏం మాట్లాడుకున్నారు? ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు? వారి వ్యూహంతో కేసీఆర్ నిజంగానే ఉలిక్కిపడతారా.. అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ రోజురోజుకూ దూకుడు పెంచుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తారని పేరున్న గులాబీ బాసుకు కూడా వణుకు పుట్టించే విధంగా పథకరచన చేస్తోంది కమలం క్యాంపు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ ఓ సంచలనాత్మకమైన ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హుజూరాబాద్ లో సంచలన విజయం నమోదు చేసి దేశవ్యాప్త రాజకీయ నేతల దృష్టిని తనవైపు మరల్చిన మాజీ మంత్రి ఈటల.. వచ్చే ఎన్నికల్లో ఏకంగా సీఎం కేసిఆర్ ను ఢీకొట్టడానికే సిద్ధమవుతున్నారు. కేసిఆర్ పై గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటించడం అందుకే సంచలనంగా మారింది. అంతేకాదు.. అసలు తా
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.