Skip to main content

Posts

మన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయమిదే

భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు.  ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం? శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవకాశాన్ని కూడా లేకుండా చేసేదాన్ని శాస్త్రీయ వైద్యంగా పిలిచేవారి అజ్ఞానానికి

భక్తిశ్రద్ధలతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు (చిత్రమాలిక)

ప్రొఫెసర్ తియ్యబిండి కామేశ్వరరావు స్వగృహంలో తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. గతేడాది లాగే ఈసారి కూడా  కరోనా విజృంభించిన తరుణంలో వీరగురుడి ఆరాధనోత్సవాలను సాదాసీదాగా, నిష్టగా జరుపుకున్నారు. కాలజ్ఞాన ప్రదాత అయిన వీరబ్రహ్మేంద్రస్వామి 327 ఏళ్ల క్రితం కందిమల్లాయపల్లిలో జీవసమాధిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులు ఎక్కడికక్కడ స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించుకున్నారు. పలుచోట్ల జరిగిన ఈ ఆరాధనోత్సవాలకు సకల వర్గాల ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.  ఇక విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ  ఐక్య సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం తానాజీనగర్ ఉప్పుగూడలో నిర్వహించారు. ఆ సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బండ్లగూడ మండలాధ్యక్షులు తోట శ్రీనివాసాచారి, బహదూర్ పురా మండలాధ్యక్షుడు వలబోజు రవికిరణ్, సైదాబాద్ మండలాధ్యక్షుడు వోరువాళ్ళ వీరేష్, మేడిపల్లి వెంకటేశంచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వకర్మ భ

కరోనా కాటేసిన వేళ చిన్ననాటి మిత్రులే ఆప్త బంధువులు

కరోనా కాటేసిన వేళ చిన్ననాటి మిత్రులే ఆప్త బంధువులు అయ్యారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం మారేడుపాక కు చెందిన పాడి మహేందర్ రెడ్డి 10రోజుల క్రితం కరోనాతో చనిపోయారు. చాలా చిన్న వయసులోనే  మహేందర్ రెడ్డి చనిపోవడంతో కుటుంబం కష్టాలపాలైంది. దీంతో చిన్ననాటి మిత్రులందరూ కలిసి వారి కుటుంబానికి 50 వేల రూపాయలు  ఆర్థిక సహాయం చేశారు. ఆ చెక్కును మహేందర్ రెడ్డి భార్య కు అందించారు.  ఈ కార్యక్రమంలో ఇనుగంటి రామారావు, నాగభూషణాచారి, చారి, ఇనుగంటి శ్రవణ్ కుమార్, తిరుపతి యాదవ్, రాజమౌళి, నర్సింహాచారి, నాగరాజు, శ్యామ్, మిగతా మిత్ర బృందం పాల్గొన్నారు.

లీగల్ అండ్ క్రైమ్ రిపోర్టింగ్ పై ముగిసిన 2 రోజుల వర్క్ షాప్

ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులకు లీగల్, క్రైమ్ రిపోర్టింగ్ లో మరింత లోతైన అవగాహన కల్పించేందుకు నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ కు మంచి రెస్పాన్స్ లభించింది. న్యాయ పంచాయతీలు మొదలుకొని కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కోర్టు హియరింగ్స్ లో వెల్లడయ్యే ఆసక్తికరమైన అంశాలు, క్రైమ్ రిపోర్టింగ్ లో కీలకమైన అంశాలు, వివిధ రాష్ట్రాల పోలీసింగ్ లో ప్రజలకు కనిపించని కోణాలు, వాటిని వెలికి తీయాల్సిన పద్ధతులపై ఇండియా జస్టిస్ రిపోర్ట్స్-101 రిపోర్టర్స్ సంయుక్తంగా శని, ఆదివారాల్లో ఆన్ లైన్ వర్క్ షాప్ నిర్వహించాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పనిచేసిన పలువురు జర్నలిస్టులు, ఎన్జీవో సంస్థల నిర్వాహకులు, మాజీ డీజీపీ స్థాయి అధికారులు, సీబీఐ అధికారులు ఫ్యాకల్టీలుగా పాల్గొని జర్నలిస్టులకు మార్గదర్శనం చేశారు.  దేశంలో సుమారు 44 మిలియన్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, అవి పరిష్కారానికి నోచుకోవాలంటే కోర్టు వ్యవహారాల డిజిటైజేషన్ తో పాటు పెద్దసంఖ్యలో స్టాఫ్ రిక్రూట్ మెంట్ చేసుకోవాల్సి ఉందని రిటైర్డ్ జడ్జి అజయ్ కుమార్ కుహర్ అన్నారు. అలాగే న్యాయమూర్తుల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని, ఇది

ఈటలతో జతకట్టిన ఏనుగు రవీందర్ రెడ్డి

హరీష్ రావు ఆత్మీయ సహచరుడు రవీందర్ ఉత్తర తెలంగాణలో సీనియర్ టిఆరెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరుగుబాటు నేత ఈటెల రాజేందర్ తో జతకట్టనున్నారు..గురువారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి నేరుగా ఈటెలను కలిసి సంఘీభావం ప్రకటించారు..  ఈ పరిణామం టిఆరెస్ లో  సంచలనం సృష్టిస్తోంది.. మంత్రి హరీష్ రావు కు అత్యంత నమ్మకమైన రాజకీయ సహచరుడిగా మెదులుతున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెలను కలవడం రాజకీయ ప్రకంపనలకు దా రితీయబోతోంది..2004 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన రవీందర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు..15 ఏళ్ళ పదవీ కాలంలో హరీష్ రావు వెంటే నీడలా ఉన్నారు..పొద్దున్నుండి రాత్రి వరకు హరీష్ వెంటే ఉండేవారు..2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ చేతిలో ఓడిపోయినప్పటికి…హరీష్ రావు తో బంధం వీడలేదు.. కొద్దికాలానికే కాంగ్రెస్ నుంచి సురేందర్ కారెక్కడంతో సిట్టింగ్ హోదాలో ఉన్న జాజులను కాదనే పరిస్థితి లేకుండా పోయింది హరీష్ రావు కు..అయినా రవీందర్ రెడ్డి తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు హరీష్ రావు..సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్,త

జర్నలిస్టుల కుటుంబాలకు చేయూతనిద్దాం-జైన్ కుమార్ విశ్వకర్మ

వార్తల కవరేజీ విషయంలో కరోనా మహమ్మారికి ఎదురీదుతూ పనిచేస్తున్న జర్నలిస్టులను గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జైన్ కుమార్ విశ్వకర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది కాలంగా కరోనా విజృంభణకు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన తరుణంలో మీడియా సంస్థలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ఆదుకునే విషయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిన అంశమని జైన్ అన్నారు. అదే స్ఫూర్తితో స్థానిక ప్రభుత్వాలు కూడా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు వర్తింపజేసి జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి తనవంతుగా ఒక నెలకు సరిపడా సరుకులు అందజేశామని, జర్నలిస్టులకు చేయూతనందించే విషయంలో అన్ని సామాజికవర్గాలవారూ ముందుకు రావాలని జైన్ పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు టి.రమేశ్ బాబు కు ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ తరఫున ఈ సరుకులు అందజేశామని, ఇతర ప్రాంతాల్లోని బాధ్యులు కూడా ఎక్కడి

మొబైల్ జర్నలిజం-రూరల్ డెవలప్మెంట్ పై ముగిసిన శిక్షణ తరగతులు

రూరల్ డెవలప్మెంట్ అండ్ మీడియా కవరేజి,  డాక్యుమెంటేషన్ పై ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్) ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన ఆన్లైన్ శిక్షణా తరగతులు ముగిశాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో గల సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ కు సారథ్యం వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకాంక్ష ఏడు రోజుల శిక్షణా తరగతులను విజయవంతంగా నిర్వహించారు. ఇలా దేశ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. రూరల్ రిపోర్టింగ్, అభివృద్ధి కార్యక్రమాల డాక్యుమెంటేషన్ పై వివిధ విభాగాల్లో నిపుణులైన ప్రొఫెసర్ల చేత క్లాసులు ఇప్పించామని ఆకాంక్ష చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, రూరల్ డెవలప్మెంట్, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఫ్యాక్ట్ చెకింగ్, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులపై గ్రామీణులకు అవగాహన కల్పించడం, జియో ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్స్ ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడం,  మహిళా సాధికారతను ఏ విధంగా త్వరితగతిన సాధించాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ఉపయోగించుకోవడం ఎలా, గ్రామాల్లో మీడియా పోషించాల్సిన పాత్ర, కొత్త పుంతలు తొక్కుతున్న మొ