Skip to main content

జర్నలిస్టుల కుటుంబాలకు చేయూతనిద్దాం-జైన్ కుమార్ విశ్వకర్మ

వార్తల కవరేజీ విషయంలో కరోనా మహమ్మారికి ఎదురీదుతూ పనిచేస్తున్న జర్నలిస్టులను గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జైన్ కుమార్ విశ్వకర్మ అభిప్రాయపడ్డారు. గతేడాది కాలంగా కరోనా విజృంభణకు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన తరుణంలో మీడియా సంస్థలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టులను ఆదుకునే విషయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం స్వాగతించాల్సిన అంశమని జైన్ అన్నారు. అదే స్ఫూర్తితో స్థానిక ప్రభుత్వాలు కూడా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలు వర్తింపజేసి జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ఈ క్రమంలో కొందరు జర్నలిస్టులను ఎంపిక చేసి వారికి తనవంతుగా ఒక నెలకు సరిపడా సరుకులు అందజేశామని, జర్నలిస్టులకు చేయూతనందించే విషయంలో అన్ని సామాజికవర్గాలవారూ ముందుకు రావాలని జైన్ పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు టి.రమేశ్ బాబు కు ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ తరఫున ఈ సరుకులు అందజేశామని, ఇతర ప్రాంతాల్లోని బాధ్యులు కూడా ఎక్కడికక్కడ ఈ తరహాలో సరుకులు పంచాలని ఫెడరేషన్ సభ్యులను కోరారు. 

ఈ కార్యక్రమంలో జైన్ తో పాటు వీవీఐఎస్ హైదరాబాద్ అధ్యక్షుడు కమ్మరి మహేశ్ ఆచార్య, ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూరి లక్ష్మణాచారి, రాంచందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.  


Comments

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.

అద్భుతమైన సినిమా - చెత్త మెసేజ్

శ్యామ్ సింగారాయ్ సినిమా చాలా మంచి కళాత్మక విలువలున్న సినిమా. చిత్రీకరణ, ఫోటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. ఈ సినిమాలో నాని టైటిల్ రోల్ కు న్యాయం చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి కూడా బాగా నటించింది. మంచి పాత్ర ను ఎంచుకోడంలో సాయి పల్లవి ఎప్పుడూ ముందుంటుంది. ఈ సినిమాకు హైలెట్ హీరో నాని పాత్ర శ్యామ్ సింగరాయి , చాలా హుందాగా ఉంది పాత్ర. హీరోయిన్ డాన్స్ బాగా చేసింది. కథక్ నృత్యం చేస్తూ ఒక సీన్ లో ఆమె చేసే నాట్యం ఎక్సలెంట్ గా ఉంది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది.  కథ విషయానికి వస్తే, హీరో సినిమా డైరెక్టర్. 2020 లోమొదటి సినిమా తీసి హిట్ సాధిస్తాడు. అతను పేరు సాధిస్తాడు. అనుకోకుండా అతను ఒక కేసులో  ఇరుక్కుని పోతాడు. ఆ కేసు నుండి బయట పడడానికి అతన్ని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే, ఆమె అతని ద్వారా చాలా విషయాలు తెలుసుకొంటుంది. సినిమా 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి శ్యామ్ సింగరాయ్ దగ్గరకు వెళుతుంది. అతను ఒక బెంగాల్ కవి, అతని తల్లి తెలుగామే, కాబట్టి తెలుగు కూడా వస్తుంది. హీరో , 4 అన్నతమ్ముల్లో చిన్నోడు. వారిది ఉన్నత కుటుంబం, అభ్యుదయ భావాలు కలిగిన అతడు నాస్తికుడు, దేవుని నమ్మడు. కులానికి, మతాలకు వ్యతిరేకంగా పోరాడుత