Skip to main content

భక్తిశ్రద్ధలతో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు (చిత్రమాలిక)

ప్రొఫెసర్ తియ్యబిండి కామేశ్వరరావు స్వగృహంలో

తెలుగువారి ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. గతేడాది లాగే ఈసారి కూడా  కరోనా విజృంభించిన తరుణంలో వీరగురుడి ఆరాధనోత్సవాలను సాదాసీదాగా, నిష్టగా జరుపుకున్నారు. కాలజ్ఞాన ప్రదాత అయిన వీరబ్రహ్మేంద్రస్వామి 327 ఏళ్ల క్రితం కందిమల్లాయపల్లిలో జీవసమాధిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణులు ఎక్కడికక్కడ స్వామివారి ఆరాధనోత్సవాలు నిర్వహించుకున్నారు. పలుచోట్ల జరిగిన ఈ ఆరాధనోత్సవాలకు సకల వర్గాల ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. 
ఇక విశ్వబ్రాహ్మణ-విశ్వకర్మ  ఐక్య సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం తానాజీనగర్ ఉప్పుగూడలో నిర్వహించారు. ఆ సంఘం గ్రేటర్ హైదరాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బండ్లగూడ మండలాధ్యక్షులు తోట శ్రీనివాసాచారి, బహదూర్ పురా మండలాధ్యక్షుడు వలబోజు రవికిరణ్, సైదాబాద్ మండలాధ్యక్షుడు వోరువాళ్ళ వీరేష్, మేడిపల్లి వెంకటేశంచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశ్వకర్మ భవన్ లో సుదర్శన హోమం

అటు సికింద్రాబాద్ లోని విశ్వకర్మ సంఘం భవనంలో వీరగురుడి ఆరాధనోత్సవాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం అధ్యక్షుడు మోటుకూరి నాగభూషణం, విశ్వకర్మ భవనం అధ్యక్షుడు దుబ్బాక కిషన్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. దేశప్రజలందరూ కరోనా మహమ్మారి బారిన పడకుండా సుఖ-సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శాంతిపూజ, సుదర్శన హోమం నిర్వహించారు. కాలజ్ఞాన ప్రదాత అయిన వీరబ్రహ్మేంద్రస్వామి కరుణా కటాక్షాలతో ప్రపంచ పజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తాము ఈ యజ్ఞం నిర్వహించామని దుబ్బాక కిషన్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 

విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో..
ఖమ్మం, బీసీ కాలనీలోని శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జెండా గద్దె వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకారపు శ్రీనివాస్ విశ్వకర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వీవీఐఎస్ ఖమ్మం నగర ఎలక్షన్ కమిటీ కన్వీనర్ కొనపర్తి రాజేశ్వరాచారి, 58వ డివిజన్ కార్యవర్గ ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని శ్రీనివాాస్ విశ్వకర్మ చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన అందరికీ ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. 
----------------------------------
కె. శ్రీనివాసాచార్యులు ఇంట్లో

కందుకూరి వెంకటేశ్వరరావు నివాసంలో

మారోజు ఉమాపతిఆచార్యులు శ్రద్ధాభక్తులు

తుమ్మోజు రామలక్ష్మణాచార్యుల ఇంట్లో
------------------------------
ట్యాంక్ బండ్ మీద వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం వద్ద 

ఇలా తెలుగురాష్ట్రాల్లో అన్ని చోట్లా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలను భక్తిపూర్వకంగా జరుపుకున్నారు.

Comments

Popular posts from this blog

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక