Skip to main content

మన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయమిదే

భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని బతికించుకునే సమయం ఆసన్నమైందని హైదరాాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు అంటున్నారు. గతేడాదికి పైగాా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తున్న సమయం నుంచీ శాస్త్రీయ వైద్యంగా భుజకీర్తులు తగిలించుకున్న అల్లోపతి వైద్యం ఇప్పటివరకు దాని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయిందని, అయినా పాలకులు, ప్రపంచ దేశాలు, డబ్ల్యు.హెచ్.ఒ వంటి వ్యవస్థలన్నీ ఇప్పటికీ పునరాలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నాానికి చెందిన ఆనందయ్య ఇప్పటికే 20 వేల మందికి పైగా కరోనా పేషెంట్లకు ప్రాణభిక్ష పెడితే దాన్ని నాటువైద్యంగా అభివర్ణిస్తున్న ఆధునిక మీడియా పోకడలను ఆయన ఖండించారు. 


ఏది నాటు వైద్యం? ఏది శాస్త్రీయ వైద్యం?

శాస్త్రీయ వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు గుంజుతూ, పేషెంట్ ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని సంతకం చేయించుకుని మరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే కార్పొరేట్ దవాఖానాాల్లో జరిగేది శాస్త్రీయ వైద్యం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రాణాలు పోతే ప్రశ్నించే అవకాశాన్ని కూడా లేకుండా చేసేదాన్ని శాస్త్రీయ వైద్యంగా పిలిచేవారి అజ్ఞానానికి జాలిపడాల్సిందేనన్నారు. ఆయుర్వేదంలో అనేక రోగాలకు మందులు ఉన్నాయని, ఎంతో విలువైన ఆ విజ్ఞానాన్ని నాటువైద్యం పేరుతో ప్రజలకు దూరం చేసే కుట్ర దశాబ్దాలుగా దేశంలో విజయవంతంగా అమలైందన్నారు. చదువుకున్నవారు, మీడియా సంస్థల అజ్ఞానం వల్లే ఆయుర్వేద వైద్యులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో డబ్బులు కట్టినా ప్రాణాలు పోతున్న క్రమంలో ఆనందయ్య అందిస్తున్న చికిత్స కరోనా పేషెంట్లకు దివ్యౌషధంగా మారిందని, ఈ ఉదంతం వల్ల ప్రభుత్వాల్లో కాసింతైనా చలనం రావడం సంతోషదాయకమన్నారు. ఒక్క కరోనాకే కాదని, ఆధునిక వైద్య విధానానికి అంతుబట్టని అనేక రోగాలకు ఆయుర్వేదంలో చికిత్స ఉందని గుర్తించాలని కామేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఆనందయ్య లాంటి ఎంతో మంది ఆయుర్వేద వైద్యులు వెలుగులోకి రాకుండా నాటువైద్యులుగా తెరమరుగైపోయారని, ఇప్పుడైనా దేశీయ వైద్యానికి మంచిరోజులు రావాలని ఆకాంక్షించారు. అయితే ప్రజలే ముందుకొచ్చి ఆయుర్వేదాన్ని బతికించుకుంటే ప్రభుత్వాలు చచ్చినట్టు గుర్తిస్తాయని, నెల్లూరు సంఘటన ఇందుకు ఓ తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల కళ్లు తెరిపించే సత్తా ప్రజలకే ఉందని, ఆయుర్వేదానికి మద్దతుగా నిలబడాల్సింది కూడా ప్రజలేనన్నారు. వైద్య వృత్తిలోకి వస్తున్న ఎవరైనా వారికి నిర్దేశించినట్టు ఐదేళ్ల కోర్సు పూర్తి చేసుకొని వృత్తిని చేపడుతున్నారు. అయితే అల్లోపతి డాక్టర్ల చేతిలో ఏదైనా పొరపాటు జరిగితే లేదా అనుకోని సంఘటన జరిగితే ప్రాక్టీసులో భాగంగా, శాస్త్రీయమైన ప్రాక్టీసులో భాగంగా పరిగణిస్తున్న, ప్రచారం చేస్తున్న వ్యవస్థలు లేదా సంస్థలు... ఇతర వైద్య విధానాల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు.. దాన్ని తెలిసీ తెలియని వైద్యంగా, అశాస్త్రీయ వైద్యంగా పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వైద్యులు అయిదేళ్ళు పూర్తిచేసుకుని, పట్టా పుచ్చుకొని, రోగులకు శాయశక్తులా నయం చేస్తామని ప్రమాణం చేశాకే వైద్య వృత్తిని అవలంబిస్తున్నారు. కానీ బుద్ధిజీవులు అందరూ ఈ విషయాలను కావాలనే విస్మరిస్తున్నారని కామేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కామేశ్వరరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తొలితరం ఆయుర్వేద వైద్యుడు. 20 ఏళ్లుగా ఆయన  ఆయుర్వేదం మీదనే అనేక పరిశోధనలు చేసి ఇప్పటికి దాదాపు 70 రకాల మందులు సొంతంగా తయారు చేశారు. సురభి ఆయుర్వేదిక్ క్లినిక్ అండ్ రీసెర్చ్ సెంటర్ పేరుతో సొంత ప్రయోగశాలను నడుపుతున్నారు. తన ల్యాబ్ లో తయారవుతున్న ఆయుర్వేద మందులు వందశాతం సహజసిద్ధమైనవని, సువాసన కోసం గానీ, కలర్స్ కోసం గానీ ఎలాంటి కృత్రిమ పదార్థాలు కలపడం లేదని, అందువల్లే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తన మందులకు ప్రజల్లో ఆదరణ లభిస్తోందన్నారు. వికలాంగుడైన డాక్టర్ కామేశ్వరరావు తన పరిస్థితిని లెక్క చేయకుండా వారధి ఫౌండేషన్ పేరుతో పేదలకు క్రమం తప్పకుండా రేషన్ సరుకులు అందిస్తుండడం విశేషం. 

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల