Skip to main content

ఈటలతో జతకట్టిన ఏనుగు రవీందర్ రెడ్డి

హరీష్ రావు ఆత్మీయ సహచరుడు రవీందర్


ఉత్తర తెలంగాణలో సీనియర్ టిఆరెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తిరుగుబాటు నేత ఈటెల రాజేందర్ తో జతకట్టనున్నారు..గురువారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి నేరుగా ఈటెలను కలిసి సంఘీభావం ప్రకటించారు.. 

ఈ పరిణామం టిఆరెస్ లో  సంచలనం సృష్టిస్తోంది.. మంత్రి హరీష్ రావు కు అత్యంత నమ్మకమైన రాజకీయ సహచరుడిగా మెదులుతున్న ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెలను కలవడం రాజకీయ ప్రకంపనలకు దా రితీయబోతోంది..2004 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన రవీందర్ రెడ్డి వరుసగా మూడుసార్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు..15 ఏళ్ళ పదవీ కాలంలో హరీష్ రావు వెంటే నీడలా ఉన్నారు..పొద్దున్నుండి రాత్రి వరకు హరీష్ వెంటే ఉండేవారు..2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ చేతిలో ఓడిపోయినప్పటికి…హరీష్ రావు తో బంధం వీడలేదు..

కొద్దికాలానికే కాంగ్రెస్ నుంచి సురేందర్ కారెక్కడంతో సిట్టింగ్ హోదాలో ఉన్న జాజులను కాదనే పరిస్థితి లేకుండా పోయింది హరీష్ రావు కు..అయినా రవీందర్ రెడ్డి తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు హరీష్ రావు..సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్,తాజా మాజీ ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి గడ్డపై దాయాదుల మాదిరిగానే వ్యవహరించారు.. ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది..

 ఒక ఒరలో రెండు కత్తుల వలె వ్యవహారం ముదరడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులకంటే తన వెంట ఉన్న అనుయాయుల పనులు పోటీ పడి చేయిస్తూ ఏనుగు రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకుంటున్నారు.. దీంట్లో రెండేళ్లు మంత్రి ఈటెల రాజేందర్ సహకారం తీసుకున్నారు ఏనుగు..దీనికి తోడు హరీశ్రావ్..ఈటెలతో 20 ఏళ్ల రాజకీయ అనుబంధం సైతం రవీందర్ రెడ్డిని ఈటెల దరిచేర్చింది..    

సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో…సమయం చూసి అడుగేయడంలో రవీందర్ రెడ్డి సిద్ద హస్తుడు.. మొన్నటి వరకు అనుయాయులందరు కట్టకట్టుకొని బీజేపీలో చేరడం ద్వారా టిఆరెస్ కు షాక్ ఇద్దామని రవీందర్ రెడ్డిపై తీవ్రంగా ఒత్తిడి పెంచారు..అయితే ఇది సరైన సమయం కాదని..కొద్ది కాలం వేచిచూద్దామని క్యాడర్ కు నచ్చ చెప్పారు..

అప్పటికే ఈటెల రాజేందర్ వ్యవహారంపై ఉప్పందడం వల్లనే క్యాడర్ను కొద్ది టైమ్ అడిగినట్లు కనపడుతోంది.. టిఆరెస్ తరపున 2004 లో సంతోష్ రెడ్డి,కేశపల్లి గంగారెడ్డి తో పాటు రవీందర్ రెడ్డి అసెంబ్లీ మెట్లెక్కారు.. అప్పటి నుంచి టిఆరెస్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖుడిగా ఎదిగారు.. కేసీఆర్ కు సన్నిహితంగా  ఉంటూనే…ఉమ్మడి నిజామాబాద్ టిఆరెస్ రాజకీయాల్లో చక్రం తిప్పారు…ఉత్తర తెలంగాణ స్థాయిలో ముఖ్య నేతగా ఎదిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ఈటెల రాజేందర్ తో జతకట్టిన బడా నేతల్లో మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతున్నారు.. ఆరు రోజుల రాజకీయ సమికరణాలలో టిఆరెస్ లో ఈ స్థాయి కలిగిన నేత  బాహాటంగా ఈటెలను కలిసిన సందర్భం లేకపోవడం గమనార్హం.. ఇప్పటిదాకా ఈటెలకు మద్దతు తెలిపిన టిఆరెస్ నేతల్లో మండల స్థాయి నేతలే ఉన్నారు..ఉన్నా వారంతా హుజురాబాద్ ప్రాంత నేతలే…ఏనుగు రవీందర్ రాజకీయ మలుపు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది…

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల