Skip to main content

Posts

కోవిడ్ వైద్య సేవలను ఇ.హెచ్.యస్ లో చేర్చాలి

కోవిడ్ వైద్యసేవలను ఈహెచ్ఎస్ లో చేర్చి ఉద్యోగులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన విజ్ఞాపన పత్రం సమర్పించామని ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పద్మాచారి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారని, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో ప్రజల మధ్యన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు వైద్యసేవలను ఇ.హెచ్.ఎస్ క్రింద అందించాలని కోరినట్లు పద్మాచారి చెప్పారు. అలాగే కరోనా వైద్యసేవలు పొందుతున్న ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర టెంపరేచర్ రికార్డ్ చేయడం, మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించడం, సానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించడం, ప్రతి వారం కార్యాలయ ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయాలని, ఉద్యోగులను రొటేషన్ పద్దతిలో కార్యాలయాలకు అనుమతించాలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో 5 రోజుల పనిదినాలు ప్రవేశ పెట్టడం ద్వారా

హరీశ్ రావు జబర్దస్త్ ఆన్సర్

  సిద్ధిపేట, జూలై 03:   కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్, బీజేపీలది గోబెల్స్ ప్రచారం అని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. 80 మీటర్ల నుంచి 618 మీటర్ల ఎగువకు నీళ్లు ఎత్తిపోసే ప్రాజెక్టు గొప్పదనాన్ని గుర్తించలేక, ప్రభుత్వ సాహసోపేతమైన నిర్ణయం విజయవంతమైతే ఓర్చుకోలేక విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతి పక్షాలది కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నమే తప్ప ప్రాజెక్టు ఔన్నత్యాన్ని గుర్తించే స్థితిలో లేరని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.  హరీశ్ రావు ఏమన్నారో.. పూర్తి వీడియోలో వినండి

శరవేగంగా రైతు వేదిక నిర్మాణాలు జరగాలి-కలెక్టర్ వెంకట్రామరెడ్డి

సిద్ధిపేట, జూలై 03: జిల్లాలో రైతు వేదిక నిర్మాణాలు శరవేగంగా జరపాలని గుత్తేదార్లను జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. సిద్ధిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజమ్మీల్ ఖాన్, డీఏఓ శ్రవణ్ లతో కలిసి ఆయన సమీక్షించారు. క్లస్టర్లవారీగా రైతు వేదిక, ప్రతీ గ్రామంలో డంప్, గ్రేవ్ యార్డు నిర్మాణాలకు ఎంత మేర ఇసుక అవసరమో ప్రతిపాదనలు ఇస్తే త్వరితగతిన పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తామని గుత్తేదార్లకు కలెక్టర్ సూచించారు. డంప్, గ్రేవ్ యార్డులు, రైతు వేదికల నిర్మాణాలపై క్లస్టర్లవారీగా చర్చించారు. అనుకున్న లక్ష్యంలోపు నిర్మాణాలు పూర్తి చేసి జిల్లాను అగ్రభాగాన నిలపాలని కోరారు.  ఆడిట్ అంశంపై కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిపై ఆడిట్ జరుగుతుందని, ఇందుకోసం నలుగురు రిటైర్డు అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. 4 నెలల పాటు జరగనున్న ఇంటర్నల్ ఆడిట్ కోసం బ్యాంకర్లు, రిటైర్డు అధికారులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ కనక రత్నం, డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీపీ

ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కి నిత్యావసర వస్తువుల పంపిణీ

  ప్రణవి ఫౌండేషన్ మరోసారి నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో BME, H&S విభాగంలో పని చేస్తున్న ఫోర్త్ క్లాస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జైన్ కుమార్ ఆచార్య చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలోచాలీచాలని జీతాలతో పనిచేస్తున్నవారికి ప్రణవి ఫౌండేషన్ ద్వారా సహాయం చేశామని, ఇదే తరహాలో తమ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని జైన్ చెప్పారు. పి.రేశ్మారెడ్డి, కె.రామలింగం, జి.వెంకటేశ్వర్లు, కె.వెంకటరమణ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జి. శ్రీకాంత్, శ్రీధర్, ఆర్.కృష్ణ, జగన్, అజయ్, కెనడా నుంచి భారత్ అండ్ భారతి తదితరుల సహకారంతో సరుకుల పంపిణీ చేసినట్లు జైన్ చెప్పారు. ఇందుకు సహకరించినవారికి జైన్ కృతజ్ఞతలు తెలిపారు.

వామ్మో! కరోనా టెస్టుల కోసం ఇంత పెద్ద క్యూనా?

కరోనా పాజిటివ్ కేసులు రోజుకు దాదాపు వెయ్యికి చేరుకోవడంతో మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వం సీరియస్ గా చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఇలా ఉంటే అసలు టెస్టుల కోసం ఎంత మంది క్యూలో ఉన్నారో చూస్తే జడుసుకోవాల్సిందే. సికింద్రాబాద్, తిరుమలగిరిలో విజయా డయాగ్నొస్టిక్స్ ముందు టెస్టుల కోసం ఎంత మంది లైన్ కట్టారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.  అంతేకాదు.. అసలు అనుమానంతో క్యూలో ఉన్నవారి సంగతలా ఉంచితే.. క్యూలో ఉన్నవారికే కరోనా ఉంటే అది లేనివారికి కూడా సోకే పరిస్థితి దాపురించింది. ఎవరు దీన్ని ఆపాలి.. ఎలా ఆపాలి... ఎక్కడ బ్రేక్ పడుతుందో ఆ దేవుడికే తెలియాలని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

కరోనా కొమ్ములు విరిచే కిల్లర్- వీడియో

భారతీయ ఆయుర్వేదం అనే అమ్ములపొదిలో గాండీవాల్లాంటి అనేక చిట్కాలున్నాయి. అందులో ఒకటే పసుపుకొమ్ముల ఆవిరి. పసుపుకొమ్ముల ఆవిరి ఎలా చేయాలంటే.. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని అందులో తగినన్ని పసుపుకొమ్ములు వేసి బాగా మరిగించాలి. ఆ ఆవిరిని బాగా పట్టాలి. కరోనా రాకుండా నిరోధించడానికి ఇది అద్భుతంగా పని చేస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.  ఆవిరి పట్టడం ఇలా.. ఆవిరి పట్టడంలోనే మనకు మంచి రిలీఫ్ వస్తుంది. ముక్కునుండి పీల్చుకొని నోటిద్వారా 3 సార్లు, నోటి నుంచి పీల్చుకొని ముక్కుద్వారా 3 సార్లు.. ఇలా మార్చి మార్చి ఒక పదిసార్లు పడితే యాంటీ బ్యాక్టీరియాతో కూడిన వేడిఆవిరి ఊపిరితిత్తుల్లోకి, ముక్కు నాళాలు, శ్వాసకోశ నాళాల గుండా వెళ్తుంది. ఆవిరి వేడికి కరోనా వైరస్ చనిపోతుంది. వాస్తవానికి కరోనా అనేది వైరస్ కూడా కాదని, అది కేవలం ప్రొటీన్ మాత్రమేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది సింగిల్ గా ఉన్నప్పుడు నిర్జీవం.. ఏమీ చేయదు. ఆ వైరస్ కాస్తా మన చేతుల నుంచి ముక్కు, నోరు, కళ్లు.. ఇలాంటి అవయవాల ద్వారా లోపలికి వెళ్తే అది శ్వాసకోశ నాళాలు లేదా ఆహారవాహిక ద్వారా గోడలకు అంటుకుంటుంది. దానికుండే కొమ్ముల కారణంగా అది ఆ గోడలకు పట్టుకుని

బై డాడీ - ఆఖరి మాటల సెల్ఫీ వీడియో

ప్రాణం విడుస్తూ ఓ యువకుడు తీసిన వీడియో తెలుగు మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న యువకుడికి అకస్మాత్తుగా వెంటిలేటర్ తీసేశారని స్వయంగా బాధితుడే సెల్ఫీ వీడియో తీసుకొని తండ్రిని ఉద్దేశించి చివరిమాటలు మాట్లాడటం రాష్ట్రంలో కరోనా భయంకర రూపం దాలుస్తున్న విషయాన్ని కళ్లకు కట్టింది. డాడీ.. నాకు ఊపిరాడ్తలేదు డాడీ.. వద్దనంగా వెంటిలేటర్ తీసిండ్రు. మూడు గంటలైతంది డాడీ.. నా గుండె ఆగిపోయింది. కిడ్నీ ఫెయిలైంది. ఊపిరొక్కటే ఆడ్తంది.. ఇప్పుడు అది గూడ అయిపోయింది డాడీ.. బాయ్ డాడీ.. బాయ్. ఇవీ ఆ యువకుడి చివరి మాటలు.  కరోనా ఉధృతిని, దాని వ్యాప్తిని అత్యంత ముందుచూపున్న నేతలుగా పేరున్నవారు కూడా అంచనా వేయలేకపోయారు అనడానికి ఇది మరో నిదర్శనం. మొన్న 28 ఏళ్ల యువ జర్నలిస్టు మనోజ్ గాంధీలో చికిత్స సరిగా అందక చనిపోవడం మరుపునకు రాకముందే మరో నవయువకుడు కరోనా కోరలకు చూస్తూ చూస్తూ బలైపోవడం ప్రజలకు జీర్ణం కాని విషయం. కరోనా అనేది తెలంగాణకు రమ్మన్నా రాదు.. నీ దండం బెడ్తా రావే అంటె గూడ రాదు.. అన్న మాటల్ని ఓసారి మననం చేసుకుంటే మన నేతలు కరోనా విషయంలో ఎ