కోవిడ్ వైద్యసేవలను ఈహెచ్ఎస్ లో చేర్చి ఉద్యోగులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన విజ్ఞాపన పత్రం సమర్పించామని ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పద్మాచారి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగులు ప్రాణాలు పణంగా పెట్టి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారని, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో ప్రజల మధ్యన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, కోవిడ్ బారిన పడిన ఉద్యోగులకు వైద్యసేవలను ఇ.హెచ్.ఎస్ క్రింద అందించాలని కోరినట్లు పద్మాచారి చెప్పారు. అలాగే కరోనా వైద్యసేవలు పొందుతున్న ఉద్యోగులకు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర టెంపరేచర్ రికార్డ్ చేయడం, మాస్కులు ధరించిన వారినే లోనికి అనుమతించడం, సానిటైజర్లు తప్పనిసరిగా వినియోగించడం, ప్రతి వారం కార్యాలయ ఆవరణలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయాలని, ఉద్యోగులను రొటేషన్ పద్దతిలో కార్యాలయాలకు అనుమతించాలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో 5 రోజుల పనిదినాలు ప్రవేశ పెట్టడం ద్వారా కరోనాను నియంత్రించాలని తాము సూచించినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులందరికి ఉచితంగా కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తమ విజ్ఞప్తికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సానుకూలంగా స్పందించారని, తామిచ్చిన మెమెురాండంలోని అంశాలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పద్మాకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మాకరాచారి వెంట కారం రవిందర్ రెడ్డి, శ్రీమతి వి. మమత, మామిళ్ల రాజేందర్, ఎనుగుల సత్యనారాయణ, డా. మధుసూదన్ రెడ్డి, మునగాల మణిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, సంజీవ, గడ్డం జ్ఞానేశ్వర్, ముజీబ్ , రాయికంటి ప్రతాప్, క్రిష్ణయాదవ్, వెంకట్, గోల్కొండ సతీష్ పాల్గొన్నట్లు పద్మాకరాచారి చెప్పారు.
ప్రాచీన వైదిక విజ్ఞానం అయిన ఆస్ట్రాలజీ (జ్యోతిష్య శాస్త్రం)కి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడెవరికీ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. రేపటిపౌరులు ఏ రంగాన్ని ఎంచుకోవాలన్నా, ప్రస్తుత తరం అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాణించాలన్నా అందరూ ఆశ్రయించేది ఆస్ట్రాలజీనే. దేశ భవిష్యత్తును, ఆర్థిక స్థితిగతులను సమూలంగా ప్రభావితం చేసే రాజకీయ నాయకులందరూ ఆస్ట్రాలజీనే ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత నమ్మకాలతో పని లేకుండా ఆస్ట్రాలజీలోని శాస్త్రీయ దృక్పథం విషయంలో అవగాహన పెంచుకుంటే ప్రతిఒక్కరూ దీన్నుంచి పూర్తి ప్రయోజనాలు పొందడం సాధ్యమేనని ఆ రంగంలోని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆస్ట్రాలజీలో దశాబ్దాలుగా కృషి చేయడంతోపాటు... అందులోని శాస్త్రీయ దృగ్విషయాలను ప్రజలందరూ అందుకోవాలనే సత్సంకల్పంతో డాక్టర్ రాజా (పి.హెచ్.డి) ఉచిత కోర్సులను అందిస్తున్నారు. వారి తండ్రి అయిన రాఘవాచార్యుల నుంచి వారసత్వంగా లభించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని ఔత్సాహికులందరికీ అందించే ఉద్దేశంతో ఉచిత జ్యోతిష్య శాస్త్ర బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఉమాస్ మాంటిస్సోరి స్కూల్ లో జరుగుతున్న ఉచిత శిక్షణా తర
Comments
Post a Comment
Your Comments Please: