Skip to main content

Posts

తబ్లిగీకి హాజరైన హిందూ యువకులు

ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు జగిత్యాల జిల్లా నుంచి పలువురు హిందూ యువకులు సైతం వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ముస్లిం యూత్ ను కోఆర్డినేట్ చేసిన యువకుడే హిందూ యువకులను కూడా ఫ్రెండ్ షిప్ టూర్ లాగా మోటివేట్ చేసి తీసుకెళ్లాడని తెలుస్తోంది. Photo: Business Line ఇప్పటికీ హైడింగ్ లోనే మర్కజ్ మహానుభావులు? ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ నుంచి తిరిగొచ్చిన పలువురు ఇప్పటికీ ట్రేస్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. మరి వారంతా ఎక్కడున్నారు? ఇప్పటికే ఎవరికైనా, ఎంతమందికైనా కరోనా వైరస్ ను అంటించారా? వారున్న ప్రదేశాలు ఎక్కడ? ఈ ప్రశ్నలకు జవాబులు వెదికే పనిలో ఇప్పటికే పోలీసులు ఉన్నారు. కానీ కొందరి ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియకపోవడానికి కారణం వారు అజ్ఞాతంగా ఉండిపోవడమే.  తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో తబ్లిగీలు రహస్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్గిమల్ల, గుల్లకోట, చిల్వకోడూరు, గొల్లపల్లి, చందోలి తదితర గ్రామాల నుంచి పలువురు ముస్లిం యువకులు (10-15 మంది వరకు) ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. వారు వెళ్లొచ్చిన విషయం ఆయా గ్రామాల ప్రజలకు కూడా తెలుసని, సర్పం

హైదరాబాద్ లో అసలైన పరిమళం

పరిమళం అన్న మాటలోని శబ్ద సౌందర్యమే తప్ప ఆ శబ్దంలోని సహజ గుణాన్ని ఆస్వాదించే అవకాశం హైదరాబాదీలకు ఇప్పుడే చిక్కింది. రోడ్డెక్కితే వాహనాల రొొదలు, అవసరం లేకపోయినా చెవులు హోరెత్తించే హారన్ల హాహాకారాలు, చీమకాలు కూడా పట్టని సందులోకి రయ్యిన దూసుకొచ్చి గుండెలు గుభేలుమనిపించే మోటార్ సైక్లిస్ట్ లు, రెడ్ లైట్ ఉండగానే ఏమాత్రం ఓపిక లేకుండా గేరు వేసి బండ్లను ముందుకు పరుగెత్తించే ఆదరాబాదరా బాబులు, ఎదురుగా వచ్చేవాణ్ని కన్ఫ్జూజ్  చేసి కంగారుపెట్టి ప్రమాదాలకు కారణమయ్యే పోకిరీరాయుళ్లు.. ఇలా ఎందరో ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ రోడ్లన్నీ గాఢ నిద్రలో ఉన్నట్టు చాలా కూల్ గా, ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి.  రోడ్డు మీది నుంచి టూ వీలర్ మీద వెళ్తుంటే రాజుగారి రథానికి ఎదురే లేదన్న ఫీలింగ్ మనసుకెంతో హాయినిస్తోంది. ఒకసారి టాప్ గేర్ పడ్డాక మళ్లీ గేర్ డౌన్ చేసే అవసరం అతికొద్ది సమయాల్లో మాత్రమే కనిపిస్తోంది. అంతేనా... రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న నీడనిచ్చే చెట్లు, పూల  చెట్లు వాహనదారుల గమనానికి సాక్షీభూతాల్లా అగుపిస్తున్నాయి. రోడ్డు మీద పరుచుకున్న పూలు జీవన ప్రయాణంలో మృదుత్వాన్ని మోసుకొస్తున్న ఎంకరేజింగ్ ఫీలింగ్

డాక్టర్లపై దాడులు జరుగుతున్నది ఇందుకేనా?

ఈ దేశ సామాన్య ముస్లింలు.. రోగుల ప్రాణాలు నిలబట్టే డాక్టర్లపై దాడులు చేసేంత తెలివిలేనివారా? కరోనా విజృంభణ తమను కూడా చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తుందన్న విషయం కూడా వారికి తెలియదా? ఒక సామాన్య భారతీయుడికి ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే. అయితే వారికి తెలియదనుకోవడం పొరపాటే అయినా.. వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారన్నది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. మన దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లింల కోసం ఆలోచించే నాయకులు, సంఘాలు మాత్రం మరింత బాగా, బాధ్యతగా ఆలోచించాల్సిన తక్షణావసరం ఏర్పడుతోంది.  మన ముస్లింలు కరోనా డయాగ్నిసిస్ కోసం సహకరించకపోవడానికి మూలం దేశంలో కరోనా కనిపించడానికి ముందే ఏర్పడింది. డిసెంబర్ లో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లుకు రూపకల్పన జరిగి చట్టరూపం దాల్చడానికి ముందు నుంచే అస్సాంలో మొదలైన నిరసనలు అనేక రాష్ట్రాలకు విస్తరించాయి. ఇక సీఏఏ అమల్లోకి వచ్చాక ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో 3 వారాల పాటు ధర్నాలు జరిగాయి. దేశమంతా చలితో వణికిపోతున్న ఆ టైమ్ లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజకీయం వేడెక్కింది. సీఏఏ ను వాపస్ తీసుకునేదాకా విశ్రమించేది లేదన్న అసాధ్యమైన డిమాండ్ తో సామాన్య ప్రజల్ని రంగంలోకి దింపారు. చిన్నపిల్ల

ఆ 9 నిమిషాల్లో జరిగేది ఇదే

ప్రకృతి మనిషి లాగా ప్రశ్నించదు. కానీ దాని టైమ్ వచ్చినప్పుడు ఉరుముతుంది.. గర్జిస్తుంది... ఆ ఫెళఫెళార్భాటాలకు ఈ అల్ప మానవుడు చచ్చి ఊరుకుంటాడు. అప్పుడు ప్రశ్నించడానికి ఎవరూ మిగలరు. అందుకే అదే ప్రకృతి కాస్త బుర్ర అనే పదార్థాన్నిచ్చి విజ్ఞత-వివేకాలు అనే మనో నేత్రాలను కూడా ఇచ్చింది. దాన్ని గ్రహించలేని మనిషి ఊరికే నోరుంది కదాని ప్రతిదాన్నీ ప్రశ్నిస్తూ అనవసరంగా ప్రకృతి ఆగ్రహానికి గురవుతున్నాడు. ఆ ఆగ్రహం నుంచి కాస్తయినా ఉపశమనం కలిగించేదే 9 నిమిషాల లైట్సాఫ్ ప్రిన్సిపుల్. ఆ 9 నిమిషాల్లో ఏం జరుగుతుందో ఓసారి చూడండి.  ఏప్రిల్ 5న రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశమంతా కొన్ని కోట్ల కుటుంబాలు ఒక్కసారిగా లైట్లు ఆఫ్ చేస్తాయి. అంటే.. దేశం మొత్తమ్మీద 15 గిగా వాట్ల పవర్ జనరేషన్ ఆగిపోతుంది. ఎంత బొగ్గు, ఎన్ని నీళ్లను ఆ తక్కువ టైమ్ లో కాపాడుతున్నామో చూడండి. కోట్లాది కుటుంబాలు ఒకేసారి లైట్లు ఆఫ్ చేసి, దీపాలు వెలిగిస్తే.. ఆ దీపాల వెలుగు కంటికి ఎంత ఎనర్జీ ఇస్తుందో గ్రహించారా? ఎన్ని వేలు, లక్షల మెగావాట్ల పవర్ ఆదా అవుతుందో ఊహించారా? ఎన్ని వేల టన్నుల బొగ్గు గానీ, ఎంత పెద్దమొత్తంలో నీరు గానీ సేవ్ అవుతాయో ఓసారి అం

రెంట్లు తగ్గాలి.. ఫీజులు ఎత్తేయాలి.. సామాన్యుడి సరికొత్త డిమాండ్లు

(Representative photo of Minister Vemula Prashantreddy) జీతాలు పెరుగుతాయని ఆశపడుతున్న సమయంలో అకస్మాత్తుగా జేబులు కొట్టేసినట్టయింది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. కరోనా ఎడాపెడా ప్రపంచం మొత్తాన్ని కాటేస్తున్న సమయంలో జీతాలు పెరగకపోయినా ఫరవాలేదు.. కనీసం ఉన్న వేతనాలైనా చేతికి రావాలి కదా. అలాగని ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం ఏమని తప్పు పడతాం? కానీ ఒక పరిష్కారం ఉంది. అదేంటో చూడండి.  పిల్లాజెల్లా పెరిగి పెద్దవుతుంటే... ఎదిగిన వాళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న అందరూ సమాయత్తమవుతుంటే... ఈ పిడుగులాంటి వార్తేంట్రా బాబూ అనుకొని గుడ్లు తేలేస్తున్నారు. ఎలాగైనా సరే... సర్కారును కన్విన్స్ చేసి పాత జీతాన్నే కంటిన్యూ చేయాలని కేసీఆర్ కు మొర పెట్టుకుందామని కూడా కొందరు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతకీ కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేస్తుంటే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఎవరడిగారు? అసలు ఎవరూ గ్యారంటీ ఇవ్వలేని కామన్ మ్యాన్ లైఫే డౌట్ ఫుల్ గా మారిపోయిన క్రమంలో ప్రభుత్వ ఉద్యోగల జీతాల ఇష్యూ ఓ పెద్ద ఇష్యూ అవుతుందా? డిసెంబర్ లో చైనాను శివాలెత్తించిన కరోనా.. మార్చినాటికి మన దేశంలో అడుగుపెట్టి

కకావికలమవుతున్న వలస కూలీ బతుకులు

కరోనా దెబ్బకు వలస కూలీలు విలవిల్లాడిపోతున్నారు. బుక్కెడు బువ్వ కోసం, పూట గడవకపోయినా కనీసం పిల్లలకైనా కాస్తోకూస్తో మంచి చదువులు దొరుకుతాయన్న ఉద్దేశంతో వందల కిలోమీటర్లయినా భారం అనకుండా పట్నం వెళ్లిన కూలీలు వీరు. ఇప్పుడు ఇల్లు చేరుకునేందుకు చుక్కలు చూడాల్సి వస్తోంది. దేశమంతా ఇదే పరిస్థితి. మొన్న ఢిల్లీ నుంచి పక్క రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు గుమిగూడిన జనంతో ఆనందవిహార్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఎంత జనం వస్తారో.. అలా కనిపించింది ఆ జనాన్ని చూస్తే. దేశం లాక్ డౌన్ అయిన వారం తరువాత కూడా ప్రభుత్వాలు కూలీ జనం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ దృశ్యం ద్వారా తెలుసుకోవచ్చు.  ఇక దేశ రాజధాని నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న కేరళ, తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ విషాయనికే వస్తే ఎటూ 100, 200 కిలోమీటర్లకు పైబడ్డ దూరం నుంచే గాక... ఒడిశా, బీహార్, యూపీ, కోల్ కతా, కర్నాటక వంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో కూలీలు బతుకుదెరువు కోసం వచ్చారు. వారంతా ఇక్కడే స్లమ్ ఏరియాల్లో, సిటీ ఔట్ స్కర్ట్

చంటిబిడ్డల శవాలతో తల్లులు.. చేతులెత్తేసిన ఇటలీ

ఇటలీ దేశం శవాల దిబ్బగా మారుతోంది. అందుకు తార్కాణమే తాజా ఫొటోలు.