Skip to main content

తబ్లిగీకి హాజరైన హిందూ యువకులు

ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు జగిత్యాల జిల్లా నుంచి పలువురు హిందూ యువకులు సైతం వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ముస్లిం యూత్ ను కోఆర్డినేట్ చేసిన యువకుడే హిందూ యువకులను కూడా ఫ్రెండ్ షిప్ టూర్ లాగా మోటివేట్ చేసి తీసుకెళ్లాడని తెలుస్తోంది.



Photo: Business Line


ఇప్పటికీ హైడింగ్ లోనే మర్కజ్ మహానుభావులు?


ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ నుంచి తిరిగొచ్చిన పలువురు ఇప్పటికీ ట్రేస్ కాలేదని పోలీసులు చెబుతున్నారు. మరి వారంతా ఎక్కడున్నారు? ఇప్పటికే ఎవరికైనా, ఎంతమందికైనా కరోనా వైరస్ ను అంటించారా? వారున్న ప్రదేశాలు ఎక్కడ? ఈ ప్రశ్నలకు జవాబులు వెదికే పనిలో ఇప్పటికే పోలీసులు ఉన్నారు. కానీ కొందరి ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియకపోవడానికి కారణం వారు అజ్ఞాతంగా ఉండిపోవడమే. 



తాజాగా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో తబ్లిగీలు రహస్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్గిమల్ల, గుల్లకోట, చిల్వకోడూరు, గొల్లపల్లి, చందోలి తదితర గ్రామాల నుంచి పలువురు ముస్లిం యువకులు (10-15 మంది వరకు) ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. వారు వెళ్లొచ్చిన విషయం ఆయా గ్రామాల ప్రజలకు కూడా తెలుసని, సర్పంచ్ లకు సైతం ఆ విషయం తెలుసని, అయితే ఆ విషయాన్ని బయట పెట్టినట్టయితే తమ పేరు ఎక్కడ తబ్లిగీలకు తెలుస్తోందనని భయపడుతున్నట్టు సమాచారం. పట్టణాల్లో పరిస్థితులకు, ఊళ్లల్లో పరిస్థితులకు స్పష్టమైన తేడా ఉండడమే కారణంగా చెబుతున్నారు. గ్రామాల్లో ఏ చిన్న విషయమైనా దాగదు. ఎవరిద్వారా ఎవరికి చేరింది? ఎలా చేరిందన్న విషయం చాలా సింపుల్ గా బయటపడిపోతుంది. తబ్లిగీల సమాచారాన్ని పోలీసులకు ఎవరందించారో తెలియరాదని ఆయా గ్రామాల సర్పంచ్ లు సైతం భయపడుతున్నారంటే.. తబ్లిగీలు ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 


తబ్లిగీకి హాజరైన హిందూ యువకులు


ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కు జగిత్యాల జిల్లా నుంచి పలువురు హిందూ యువకులు సైతం వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ముస్లిం యూత్ ను కోఆర్డినేట్ చేసిన యువకుడే హిందూ యువకులను కూడా ఫ్రెండ్ షిప్ టూర్ లాగా మోటివేట్ చేసి తీసుకెళ్లాడని తెలుస్తోంది. పైన పేర్కొన్న గ్రామాలకు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన వ్యక్తి ఇద్దరు హిందూ యువకుల్ని సైతం తీసుకెళ్లాడని ఆయా గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. వారు కూడా హైడింగ్ లోనే ఉండడం విశేషం. 



ఎంతమందికి అంటించారో?


ఢిల్లీకి వెళ్లొచ్చిన తబ్లిగీలు కరోనా బయటపడకముందు ఎంతమందితో కలిశారు? అలా కలిసినవారు మళ్లీ ఎంతమందిని కలిశారు? వారిలో ఎంతమంది కరోనా బారిన పడ్డారు అనే విషయంపై ఆయా గ్రామాల సర్పంచ్ లు, సామాన్య జనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అటు ఢిల్లీ వెళ్లొచ్చిన హిందూ యువకులు సైతం ఇంటి నుంచి బయటికి రాకుండా ఉంటున్నట్టు తెలుస్తోంది. వారి గురించి పోలీసులకు  చెప్పినా, వారి ద్వారా తబ్లిగీల ఆచూకీ తెలుస్తుందని, అలా తమకు భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని సర్పంచ్ లే ఆందోళన చెందుతున్నారు. ఈ లోగా ఒకవేళ వారికి కరోనా సోకితే.. అది ఇంకా ఎంతమందికి సోకి ఉంటుందో.. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన ఈ గ్రామాల్లో వ్యక్తమవుతోంది. కరుడుగట్టిన ఉగ్రవాది ఆజంఘోరీ జగిత్యాలలోనే ఎన్ కౌంటర్ లో చనిపోవడం గుర్తించాల్సిన అంశం.  


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము