Skip to main content

డాక్టర్లపై దాడులు జరుగుతున్నది ఇందుకేనా?


ఈ దేశ సామాన్య ముస్లింలు.. రోగుల ప్రాణాలు నిలబట్టే డాక్టర్లపై దాడులు చేసేంత తెలివిలేనివారా? కరోనా విజృంభణ తమను కూడా చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తుందన్న విషయం కూడా వారికి తెలియదా? ఒక సామాన్య భారతీయుడికి ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే. అయితే వారికి తెలియదనుకోవడం పొరపాటే అయినా.. వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారన్నది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. మన దేశ ప్రజలందరూ, ముఖ్యంగా ముస్లింల కోసం ఆలోచించే నాయకులు, సంఘాలు మాత్రం మరింత బాగా, బాధ్యతగా ఆలోచించాల్సిన తక్షణావసరం ఏర్పడుతోంది. 



మన ముస్లింలు కరోనా డయాగ్నిసిస్ కోసం సహకరించకపోవడానికి మూలం దేశంలో కరోనా కనిపించడానికి ముందే ఏర్పడింది. డిసెంబర్ లో సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లుకు రూపకల్పన జరిగి చట్టరూపం దాల్చడానికి ముందు నుంచే అస్సాంలో మొదలైన నిరసనలు అనేక రాష్ట్రాలకు విస్తరించాయి. ఇక సీఏఏ అమల్లోకి వచ్చాక ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో 3 వారాల పాటు ధర్నాలు జరిగాయి. దేశమంతా చలితో వణికిపోతున్న ఆ టైమ్ లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజకీయం వేడెక్కింది. సీఏఏ ను వాపస్ తీసుకునేదాకా విశ్రమించేది లేదన్న అసాధ్యమైన డిమాండ్ తో సామాన్య ప్రజల్ని రంగంలోకి దింపారు. చిన్నపిల్లల్ని సైతం షాహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొనేలా చేశారు. జ్వరంతో ఉన్న పసిపాప అదే చలిలో ఉండటంతో చనిపోవడం కూడా జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం ఈ దేశ ముస్లింలు అందరికీ వ్యతిరేకమని, అది అమల్లోకి వస్తే ముస్లింలు పౌరులు కాకుండా పోతారన్న అపోహను బలంగా నాటడంలో ఈ దేశ సెక్యులర్ పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏను తాము వ్యతిరేకిస్తున్నామని.. జనాభా లెక్కల కోసం వచ్చే ప్రభుత్వాధికారులకు ఏ విషయమూ వివరించరాదని సీఏఏ వ్యతిరేక నాయకత్వం ముస్లింల చేత  ప్రతిజ్ఞలు చేయించింది. 


Also Read:  Can India limit religious gatherings @CORONA times?


హైదరాబాద్ లో పోటీ ర్యాలీలు
ఈ క్రమంలోనే జనవరి 4న హైదరాబాద్ లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో మిలియన్ మార్చ్ జరిగింది. ఆ మార్చ్ కు అధికార టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, దళిత సంఘాలు, పౌరసంఘాలుగా చెప్పుకునే ఇతర లెఫ్ట్ బ్యాగ్రౌండ్ గల నేతలు.. ఇలా అందరూ సహకరించారు. ఆ సభను ఒకరకంగా యాంటీ సీఏఏ మార్చ్ అనేకన్నా యాంటీ బీజేపీ, యాంటీ మోడీ మార్చ్ గా అభివర్ణించుకోవచ్చు. ఇంకో అంశమేంటంటే.. ఆ ర్యాలీ తరువాత సామూహికంగా నమాజ్ నిర్వహించడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంబీటీ గ్రౌండ్ వర్క్ తో జరిగిన ఆ భారీ ర్యాలీ తరువాత జనవరి 25 రాత్రి ఎంఐఎం మరో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు రాత్రి సీఏఏ వ్యతిరేక కార్యక్రమం నిర్వహించడం ఎంత కుట్రపూరితమైన, వ్యూహాత్మకమైన నిర్ణయమో ఎవరైనా అంచనా వేసుకోవచ్చు. తిరంగా జెండా పట్ల ఎప్పుడూ గౌరవాన్ని ప్రకటించని ఎంఐఎం.. ఆ రాత్రి తిరంగా జెండాలు పట్టుకొని సీఏఏ వ్యతిరేక నిరసనకు పూనుకోవడాన్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు రాత్రి కవితలు, ముషాయిరాలు, ఉపన్యాసాలతో ఖిల్వత్ గ్రౌండ్ హోరెత్తింది. తిరంగా జెండాల నీడన జరిగిందంతా దేశ వ్యతిరేక ప్రదర్శనలేనని గమనించాలి. 



అలా ఊపందుకున్న సీఏఏ వ్యతిరేక నిదర్శనలు అన్ని జిల్లాల్లో, మారుమూల గ్రామాల్లో (దేశవ్యాప్తంగా) సైతం విస్తరించాయి. ముస్లిం నాయకత్వం తన వర్గం ప్రజలందరికీ పౌరుల వివరాల సేకరణ కోసం వచ్చే ఏ ప్రభుత్వాధికారికైనే సహకరించరాదని స్థానికంగా ఉండే అన్ని స్థాయిల ముస్లిం నాయకత్వం, కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర యాక్టివిస్టులు బహిరంగ ప్రకటనలు చేశారు. ఈ లోగా కరోనా కలకలం మొదలైంది. అప్పటికే ఇండొనేషియా నుంచి, మలేషియా నుంచి తబ్లిగీ జమాత్ కోసం మతపెద్దలు హాజరయ్యారు. కానీ అది నడుస్తున్న విషయం దేశ ప్రజలకు తెలియదు. అది నడుస్తుందని తెలిసివారు, దానికోసం హాజరయ్యేవారికి తప్ప. ఈ లోగా కరోనా కాస్త చైనాను దాటుకొని ప్రపంచమంతా విస్తరించి, మన గడపలో అడుగుపెట్టి, జమాత్ తబ్లిగీ పూర్తయి, ఇండొనేషియన్లు కరీంనగర్ వచ్చారన్న విషయం బయటపడ్డ సమయం దాకా మనకు దాని ప్రభావమే తెలీదు. తీరా లాక్ డౌన్ ప్రకటించి, జమాత్ కు హాజరైనవారి వల్లే ఇంత విపరీతంగా వ్యాపించిందని బయటకు పొక్కే నాటికి పరిస్థితి అదుపు తప్పింది. ఏప్రిల్ 5 నుంచి 6 నాటికి ఒక్క రోజులోనే 63 కొత్త కేసులు బయటపడ్డాయంటే తబ్లిగీ ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జమాత్ కు వెళ్లొచ్చినవారిని గుర్తించేందుకు వెళ్తున్న వైద్యసిబ్బందిపై దాడికి కారణమెవరో చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. 


ఆ పార్టీలు ఇప్పుడేం చెబుతాయి?
సీఏఏ ద్వారా తమమీద దేశ బహిష్కరణ వేటు లాంటిది పడబోతుందన్న అపోహలో ఉన్న ముస్లింలు... తమవద్దకు వచ్చే వైద్యసిబ్బందిని జనాభా లెక్కల కోసం వచ్చే ప్రభుత్వాధికారులుగా పొరపడుతున్నారు. అందుకే వారుండే ఇలాకాల్లో అడుగుపెట్టనివ్వకుండా రాళ్లదాడులకు దిగుతున్నారు. మహిళా సిబ్బందిపై బండబూతులకు దిగుతున్నారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. వివరాలను మాత్రం అవ్వమని, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదాల ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. అక్కడ జమాత్ లో సైతం అసలు మత బోధల కన్నా... సీఏఏ వ్యతిరేక పాఠాలు నేర్పించడం, ప్రజలందరినీ రోడ్ల మీదికి రప్పించాలని రెచ్చగొట్టడం, ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య పరీక్షలకు సహకరించరాదని చెప్పడం.. ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు బాగా సింకవుతున్నాయి. ఈ దేశ సగటు ముస్లింలు కరోనాకు సహకరించకపోవడానికి కారణం వాళ్ల అజ్ఞానం, అమాయకత్వం కన్నా.. వారికి అలా నూరిపోసిన రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలదేనని చెప్పక తప్పదు. మరి.. పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చాక ఆ రాజకీయ పార్టీల్లో ఎంతమంది తమ పాత్రను కరెక్ట్ చేసుకుంటారనేదే బిలియన్ డాలర్ల ప్రశ్న. 



 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత