Skip to main content

ఆ 9 నిమిషాల్లో జరిగేది ఇదే



ప్రకృతి మనిషి లాగా ప్రశ్నించదు. కానీ దాని టైమ్ వచ్చినప్పుడు ఉరుముతుంది.. గర్జిస్తుంది... ఆ ఫెళఫెళార్భాటాలకు ఈ అల్ప మానవుడు చచ్చి ఊరుకుంటాడు. అప్పుడు ప్రశ్నించడానికి ఎవరూ మిగలరు. అందుకే అదే ప్రకృతి కాస్త బుర్ర అనే పదార్థాన్నిచ్చి విజ్ఞత-వివేకాలు అనే మనో నేత్రాలను కూడా ఇచ్చింది. దాన్ని గ్రహించలేని మనిషి ఊరికే నోరుంది కదాని ప్రతిదాన్నీ ప్రశ్నిస్తూ అనవసరంగా ప్రకృతి ఆగ్రహానికి గురవుతున్నాడు. ఆ ఆగ్రహం నుంచి కాస్తయినా ఉపశమనం కలిగించేదే 9 నిమిషాల లైట్సాఫ్ ప్రిన్సిపుల్. ఆ 9 నిమిషాల్లో ఏం జరుగుతుందో ఓసారి చూడండి. 


ఏప్రిల్ 5న రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశమంతా కొన్ని కోట్ల కుటుంబాలు ఒక్కసారిగా లైట్లు ఆఫ్ చేస్తాయి. అంటే.. దేశం మొత్తమ్మీద 15 గిగా వాట్ల పవర్ జనరేషన్ ఆగిపోతుంది. ఎంత బొగ్గు, ఎన్ని నీళ్లను ఆ తక్కువ టైమ్ లో కాపాడుతున్నామో చూడండి. కోట్లాది కుటుంబాలు ఒకేసారి లైట్లు ఆఫ్ చేసి, దీపాలు వెలిగిస్తే.. ఆ దీపాల వెలుగు కంటికి ఎంత ఎనర్జీ ఇస్తుందో గ్రహించారా? ఎన్ని వేలు, లక్షల మెగావాట్ల పవర్ ఆదా అవుతుందో ఊహించారా? ఎన్ని వేల టన్నుల బొగ్గు గానీ, ఎంత పెద్దమొత్తంలో నీరు గానీ సేవ్ అవుతాయో ఓసారి అంచనా వేయండి. అంతేకాదు.. 9 నిమిషాల తరువాత మళ్లీ క్రమంగా లైట్లు ఆన్ చేసుకోవడం మొదలవుతుంది. అంటే గ్రిడ్ కు అనుసంధానమైన పవర్ జెనరేటర్లు అన్నీ పూర్వస్థాయిలో విద్యుదుత్పత్తి చేయడానికి (డిమాండ్ ను బట్టి) ఒక గంట పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దేశం మొత్తమ్మీద ఒక గంట "ఎర్త్ అవర్" ఆదా అవుతుందన్నమాట. ఇదంతా ప్రకృతికి ఎంత మేలు చేసే అంశం. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే.. ప్రకృతి మనకు ఎలా బతకాలో నేర్పిస్తుంది. అది చెప్పినట్టు నడుచుకుంటే మనకు సుఖ సంతోషాలిస్తుంది ప్రకృతిమాత. ఒక్క 9 నిమిషాల పవర్ సేవింగ్ లో, దీపాలు వెలిగించి చేసే ప్రకృతి ఆరాధనలో కొన్నేళ్ల పాటు పనికొచ్చే వనరుల్ని మనకు ధారాదత్తం చేసే శక్తిని ఈ భూమండలం నింపుకుంటుంది. 9 నిమిషాల్లో ఏం జరుగుతుంది బ్రదర్.. అని మెటికలు విరిచే మెటీరియలిస్ట్ లు చాలా మందే ఉంటారు. వారినలా ఉండనిద్దాం. 



పొల్యూషన్ పూర్తిగా ఆగిపోయిన ఆ తొమ్మిది నిమిషాల్లో ఎన్ని వేల టన్నుల ఆక్సిజన్ దేశ ఉపరితలం మీద పరుచుకుంటుందో ఓసారి ఊహించుకోండి. ఆ ఆక్సిజన్ ఎన్ని విషవాయువుల్ని బలహీనం చేస్తుందో అర్థం చేసుకోండి. పర్యావరణంలో దుష్టశక్తులు అంటే అవే కదా. మన కంటికి కనిపించనంత మాత్రాన ప్రకృతి దాని పని అది చేసుకోదు అనుకుందామా? అంత స్వచ్ఛమైన ఆక్సిజన్... ఓజోన్ పొరకు ఎంత బలాన్నిస్తుందో ఒక్కసారి అంచనా వేయండి. ఒక పేషెంట్ కు వైద్యుడేం చెప్తాడు? నీ రోగం కుదరాలంటే రెస్ట్ తీసుకో... ఇంటిపట్టునే ఉండు.. ఫలావా వస్తువులు తినకు.. ఫలానా వస్తువులు తిను.. అని మాత్రమే చెప్తాడు తప్ప.. తానిచ్చే మందులో ఏముంది? అది నీ శరీరంలోకి వెళ్లి ఏం చేస్తుంది? ఎలా పనిచేస్తే నువ్వు కుదుటపడతావు.. అని చెప్తాడా? చెప్పడు కదా. మరి ఆ చిన్న టాబ్లెట్ శరీరం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు లైట్సాఫ్ చేయడం కూడా అలాంటిదే. 


కాబట్టి ప్రకృతి అనేది కరోనా రూపంలో ఓ సవాల్ విసిరి ఎలాగైనా బతకి తీరాలని నీకు ఆపత్కాలంగా సూచిస్తే.. అదే ప్రకృతికి వెన్నుదన్నునిచ్చే కార్యక్రమం ద్వారా ఎలా బతకాలో చెప్పే విజ్ఞత కూడా మనిషికి ప్రకృతే ఇచ్చింది అని మనం గుర్తించాలి. అదే కదా.. మన ప్రధాని ప్రతిపాదించిన సామూహిక లైట్సాఫ్ కార్యక్రమం. దీనిద్వారా మనిషి నేర్చుకోవాల్సిన పాఠమేంటి? మనిషి మోడువారిన మానులా బతకడం కాదు.. పచ్చనైన చెట్టులా బతకాలని పెద్దలు చెప్పింది ఇందుకే. 


 


Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత