Skip to main content

హైదరాబాద్ లో అసలైన పరిమళం


పరిమళం అన్న మాటలోని శబ్ద సౌందర్యమే తప్ప ఆ శబ్దంలోని సహజ గుణాన్ని ఆస్వాదించే అవకాశం హైదరాబాదీలకు ఇప్పుడే చిక్కింది. రోడ్డెక్కితే వాహనాల రొొదలు, అవసరం లేకపోయినా చెవులు హోరెత్తించే హారన్ల హాహాకారాలు, చీమకాలు కూడా పట్టని సందులోకి రయ్యిన దూసుకొచ్చి గుండెలు గుభేలుమనిపించే మోటార్ సైక్లిస్ట్ లు, రెడ్ లైట్ ఉండగానే ఏమాత్రం ఓపిక లేకుండా గేరు వేసి బండ్లను ముందుకు పరుగెత్తించే ఆదరాబాదరా బాబులు, ఎదురుగా వచ్చేవాణ్ని కన్ఫ్జూజ్  చేసి కంగారుపెట్టి ప్రమాదాలకు కారణమయ్యే పోకిరీరాయుళ్లు.. ఇలా ఎందరో ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో హైదరాబాద్ రోడ్లన్నీ గాఢ నిద్రలో ఉన్నట్టు చాలా కూల్ గా, ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. 


రోడ్డు మీది నుంచి టూ వీలర్ మీద వెళ్తుంటే రాజుగారి రథానికి ఎదురే లేదన్న ఫీలింగ్ మనసుకెంతో హాయినిస్తోంది. ఒకసారి టాప్ గేర్ పడ్డాక మళ్లీ గేర్ డౌన్ చేసే అవసరం అతికొద్ది సమయాల్లో మాత్రమే కనిపిస్తోంది. అంతేనా... రోడ్డుకు ఇరుపక్కలా ఉన్న నీడనిచ్చే చెట్లు, పూల  చెట్లు వాహనదారుల గమనానికి సాక్షీభూతాల్లా అగుపిస్తున్నాయి. రోడ్డు మీద పరుచుకున్న పూలు జీవన ప్రయాణంలో మృదుత్వాన్ని మోసుకొస్తున్న ఎంకరేజింగ్ ఫీలింగ్ ఏదో మనసుకు ఉత్తేజాన్నిస్తోంది. నాసాగ్రాలకు గతంలో ఎప్పుడూ సోకని పూల పరిమళాలు, కాలుష్యం లేని గాలితో జతై శ్వాసకోశాలకు చేరి శరీరానకి, మెదడుకు తెలియని చైతన్యాన్ని ప్రవహింపజేస్తున్నాయి. 


దాదాపుగా కొన్ని శతాబ్దాల కిందట ఎప్పుడో నమోదై ఉన్న అసలైన ప్రకృతి దృశ్యం ఇప్పుడు ప్రత్యక్ష అనుభూతినిస్తుందన్న కామెంట్లు హైదరాబాదీల్లో వినిపిస్తున్నాయి. వాహ్ హైదరాబాద్. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము