Skip to main content

రెంట్లు తగ్గాలి.. ఫీజులు ఎత్తేయాలి.. సామాన్యుడి సరికొత్త డిమాండ్లు


(Representative photo of Minister Vemula Prashantreddy)


జీతాలు పెరుగుతాయని ఆశపడుతున్న సమయంలో అకస్మాత్తుగా జేబులు కొట్టేసినట్టయింది ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. కరోనా ఎడాపెడా ప్రపంచం మొత్తాన్ని కాటేస్తున్న సమయంలో జీతాలు పెరగకపోయినా ఫరవాలేదు.. కనీసం ఉన్న వేతనాలైనా చేతికి రావాలి కదా. అలాగని ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం ఏమని తప్పు పడతాం? కానీ ఒక పరిష్కారం ఉంది. అదేంటో చూడండి. 


పిల్లాజెల్లా పెరిగి పెద్దవుతుంటే... ఎదిగిన వాళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న అందరూ సమాయత్తమవుతుంటే... ఈ పిడుగులాంటి వార్తేంట్రా బాబూ అనుకొని గుడ్లు తేలేస్తున్నారు. ఎలాగైనా సరే... సర్కారును కన్విన్స్ చేసి పాత జీతాన్నే కంటిన్యూ చేయాలని కేసీఆర్ కు మొర పెట్టుకుందామని కూడా కొందరు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతకీ కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కకావికలం చేస్తుంటే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఎవరడిగారు? అసలు ఎవరూ గ్యారంటీ ఇవ్వలేని కామన్ మ్యాన్ లైఫే డౌట్ ఫుల్ గా మారిపోయిన క్రమంలో ప్రభుత్వ ఉద్యోగల జీతాల ఇష్యూ ఓ పెద్ద ఇష్యూ అవుతుందా? డిసెంబర్ లో చైనాను శివాలెత్తించిన కరోనా.. మార్చినాటికి మన దేశంలో అడుగుపెట్టింది. నిజాముద్దీన్ మర్కజ్ లో తబ్లిగి జమాత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల ద్వారా యావత్ దేశానికి వ్యాపించిందని రూఢిగా తేలింది. ఇప్పుడు దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. దేశమంతా లాక్ డౌన్ విధించిన దేశాల్లో ఇండియానే ఫస్ట్. చైనాలో కూడా ప్రకటించినప్పటికీ కేవలం వుహాన్ వరకే అమలు చేశారు. కానీ భారత్ లో మాత్రం ఊరూరా లాక్ డౌన్ నడుస్తోంది. అంటే ఇండియా మొత్తం ఇంటికే పరిమితమైంది. మొత్తం ప్రొడక్షన్ ఆగిపోయిందన్నమాట. అంటే ప్రజలంతా కూర్చుని తినడమే తప్ప ఎవరూ ఏమీ కొనుగోలు చేయడం లేదు. కనీసం ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేసి ఖజానాకు ఎంతోకొంత సాయం చేసే అవకాశం కూడా లేకుండాపోయింది. అటు ఖజానాకు కాసుల గలగల కురిపించే మద్యం దుకాణాలు మూతలు పడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఆగిపోవడంతో ట్రాన్స్ పోర్టేషన్ చతికిలపడింది. ప్రైవేటు కంపెనీలకు తాళంకప్పలు వేళ్లాడుతున్నాయి. ఉద్యోగులంతా గడప దాటడం లేదు. పూటలు ఎలా గడవాలో వారికి దిక్కుతోచడం లేదు. రోజువారీ కూలీలకు పని దొరకడం లేదు. అసలు ప్రైవేటు పనులు చేయించుకునే మనుషులే లేకుండాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలన్నీ క్లోజ్ అయినప్పుడు జీతాల్లో కోత వేయక ఏంచేస్తారు? 


ఇప్పటికైతే ప్రభుత్వ ఉద్యోగులకు కోత పడలేదు. మార్చి వేతనాల నుంచి.. అంటే వచ్చే ఏప్రిల్ నుంచి కోతలు పడతాయంటున్నారు. ఆల్రెడీ సింగరేణిలో కోతలు పడిపోయాయి. కార్మికుల వేతనాల్లో 50 శాతం దాకా కోసేసి పే చేస్తారని కన్ఫామ్ అయింది. మరి అధిక వేతనాలు తీసుకుంటున్న అతిపెద్ద సెక్టార్లలో వేతనాలకు కోతలు పడితే.. వారిమీద ఆధారపడే అనేక ఇతర రంగాల ప్రజల పరిస్థితేంటి? అంటే ప్రజల కొనుగోలు శక్తి ఎంతగా పడిపోతుందో దీన్నిబట్టి తెలిసిపోతుంది కదా. అందరూ పని మానేసి ఇంట్లోనే కూర్చుంటే కుటుంబాలు గడిచేదెలా? సమాజం ఎదిగేదెలా? అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్.. వేతనాల్లో కోత పడే అవకాశాలున్నాయని ఒక సంకేతం ఇచ్చేశారు. అది కూడా అమల్లోకి రావడం ఖాయమైపోయింది. 


మరిప్పుడేంటి పరిస్థితి? ఏముంది.. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత వేసినట్టే... యావత్ పబ్లిక్ కి ఆ ఎఫెక్ట్ పడకుండా చూడాలి. అంటే ఉదాహరణకు.. ఇప్పుడు ప్రజలంతా కేవలం నిత్యావసర వస్తువుల మీద ఆధారపడి మాత్రమే బతుకుతున్నారు కదా... అన్ని రకాల కమర్షియల్స్ ఆగిపోయాయి కదా.. అందువల్ల ఆయా వస్తు సేవల ధరలు కూడా తగ్గించాలి. ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేసే సేవల రేట్లను కూడా ప్రభుత్వ అజమాయిషీలోకి తీసుకురావాలి. ఉదాహరణకు కొన్ని అంశాలవారీగా ఆలోచిస్తే బెటర్ కదా. 



1) కిరాణా వర్తకుడు వసూలు చేసే రేట్లు ఒక పరిమితికి మించి వసూలు చేస్తే అందుకు మూల్యం అదే స్థాయిలో చెల్లించుకోవాలి. 


2) ఒక బార్బర్ హెయిర్ కట్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేస్తే నిబంధనలు వర్తింపజేయాలి. 


3) అలాగే సిటీలో ప్రతినెలా 20వ తేదీ దాటితే పవర్ కట్ చేసే విద్యుత్ సిబ్బంది.. మళ్లీ పరిస్థితులు కుదుటపడేదాకా గృహ విద్యుత్ మీటర్ల దిక్కు కన్నెత్తయినా చూడకూడదు. 


4) అలాగే ప్రైవేట్ ఆసాములు వసూలు చేసే ఇంటి అద్దెల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తొలిగిపోయేదాకా రెంట్లు అడగరాదని, అది కూడా సగానికి సగం తగ్గించి తీసుకోవాలన్న షరతులు విధించాలి. 


5) ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను చాలా తగ్గించి తీసుకునేలా ప్రభుత్వమే ఫీజులు ఫిక్స్ చేయాలి. అది కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న పేరెంట్స్ ని పీక్కు తినకుండా రక్షణలు కల్పించాలి. అంటే ఒకరకంగా సెమీ గవర్నమెంట్ స్కూల్స్ లాగా వాటిని పని చేయించాలి. అందులో పనిచేసే సిబ్బందికి మినిమమ్ వేజెస్ ప్రభుత్వమే ఫిక్స్ చేయాలి. విద్యాసంస్థలు నడవడానికి అయ్యే కనీస ఖర్చులో ఎంత తక్కువ పడుతుందో చూసి, ఆ తగ్గిన మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలి. 


6) అన్ని ఆసుపత్రులను కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలి. వారికి మినిమమ్ చార్జీల కింద ప్రభుత్వమే భరించాలి. వైద్య సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్స్ కూడా గణనీయంగా తగ్గించాలి. అప్పుడే హాస్పిటల్స్ వాటి సర్వీస్ చార్జీలను తగ్గిస్తాయి. అయినప్పటికీ అవి రన్ అవడానికి ఎంత తక్కువ పడుతుందో అంత మొత్తాన్ని ప్రభుత్వమే సమకూర్చాలి. ఇవన్నీ శాశ్వతంగా కాకపోయినా.. కనీసం లాక్ డౌన్ పీరియడ్ వరకైనా జరగాలి. 


7) సినిమాలు, సీరియల్స్ ప్రొడక్షన్స్ అంతా ఆగిపోయినప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయం ఏం ఉంటుంది? కాబట్టి మీడియా రంగాన్ని ప్రభుత్వమే టేకోవర్ చేసుకొని, అర్హత కోసం ఏదో ప్యారామీటర్ పెట్టి అన్ని మీడియా సంస్థల్లో పనిచేసే స్కిల్డ్ పర్సన్స్ చేత ప్రభుత్వమే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తే ఎంత మేలు? 


ఇలా కామన్ మ్యాన్ కు అవసరమైన అన్ని వస్తు, సేవలు కూడా ప్రభుత్వ నిఘా కిందికి తీసుకురావాలి. ఎవరు, ఏ స్థాయిలో ఆ నిబంధనలు ఉల్లంఘించినా 24 గంటలూ పని చేసేలా ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలి. ఇలా చేసి ప్రజలకు అవసరమైన కనీస సేవలకు గ్యారెంటీ ఇస్తే బతుకు జట్కా బండి సాఫీగా సాగిపోతుంది. 


ఈ పరిస్థితులు ఇలా ఉంటే... బాగా నష్టపోయేది హాస్పిటాలిటీ అండ్ టూరిజం రంగాలు. ప్రజల ప్రాణాలకే గ్యారెంటీ లేని ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హోటళ్లు, టూరిజం స్పాట్లను ఎవరడిగారు? బతికుంటే బలుసాకు తినొచ్చని ప్రజలంతా అనుకుంటున్నప్పుడు హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమాలు, షికార్లు, పబ్బుల ప్రసక్తేముంది? ఈ విధంగా పనికొచ్చే అన్ని రంగాల్లో మినిమమ్ వేజెస్ ప్రభుత్వమే ఫిక్స్ చేయాలి.  సో ఫ్రెండ్స్... ప్రభుత్వం తన ఉద్యోగుల వేతనాలకు కోతలు వేయడం అనేది ఎంతో ముందుచూపుతో చేసిన చర్య అని అర్థం చేసుకొని అందుకు సహకరిద్దాం. అదే సమయంలో మనకు అందాల్సిన సేవలు అదేరీతిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుదాం. అలా కోరడంలో తప్పు లేదు కదా. ఏమంటారు? సో ప్రజలందరినీ ఈ విధంగా ఆలోచింపజేద్దామా? ఒక మూవ్ మెంట్ మొదలుపెడదామా? ఆల్ ద బెస్ట్.  ఐ విష్ యూ ఆల్ సక్సెస్. 


 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము