Skip to main content

కకావికలమవుతున్న వలస కూలీ బతుకులు


కరోనా దెబ్బకు వలస కూలీలు విలవిల్లాడిపోతున్నారు. బుక్కెడు బువ్వ కోసం, పూట గడవకపోయినా కనీసం పిల్లలకైనా కాస్తోకూస్తో మంచి చదువులు దొరుకుతాయన్న ఉద్దేశంతో వందల కిలోమీటర్లయినా భారం అనకుండా పట్నం వెళ్లిన కూలీలు వీరు. ఇప్పుడు ఇల్లు చేరుకునేందుకు చుక్కలు చూడాల్సి వస్తోంది. దేశమంతా ఇదే పరిస్థితి. మొన్న ఢిల్లీ నుంచి పక్క రాష్ట్రాలకు తిరిగి వెళ్లేందుకు గుమిగూడిన జనంతో ఆనందవిహార్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఎంత జనం వస్తారో.. అలా కనిపించింది ఆ జనాన్ని చూస్తే. దేశం లాక్ డౌన్ అయిన వారం తరువాత కూడా ప్రభుత్వాలు కూలీ జనం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ దృశ్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక దేశ రాజధాని నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న కేరళ, తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ విషాయనికే వస్తే ఎటూ 100, 200 కిలోమీటర్లకు పైబడ్డ దూరం నుంచే గాక... ఒడిశా, బీహార్, యూపీ, కోల్ కతా, కర్నాటక వంటి పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో కూలీలు బతుకుదెరువు కోసం వచ్చారు. వారంతా ఇక్కడే స్లమ్ ఏరియాల్లో, సిటీ ఔట్ స్కర్ట్స్ లో గుడిసెలు వేసుకొని లేదా ఓపెన్ ప్లేస్ లలో గుడారాలు వేసుకొని బతుకుబండి లాగిస్తున్నారు. వీరిలో కొందరైతే కేవలం పిల్లల చదువుల కోసమే వచ్చినవాళ్లు కూడా ఉండడం విశేషం. రోజంతా ఏదో కూలీ పని చేసుకొని సాయంత్రం అయ్యాక తిండిగ్రాసం కొనుక్కొని నివాసం చేరుకుంటారు. అలాంటివారి పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15 కిలోల బియ్యం, కిలో పప్పు, ఖర్చుల కోసం 1500 రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించాయి. అయితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొట్ట కూటికి సరిపోతాయమే కానీ... సాధారణ ఖర్చుల కోసం ఆ 1500 ఏ మూలకూ సరిపోవు. ఈ క్రమంలో ఇంటిఅద్దె చెల్లించడం అనేది ఈ చిన్నజీవులకు అతిపెద్ద సవాలుగా మారుతోంది. ఇంటి యజమానులు ఫస్టు తారీఖు రాగానే అద్దె కట్టకపోతే వేధింపులు మొదలుపెడతారు. ఒక్క రెండు రోజులైనా ఆగని యజమానులు హైదరాబాద్ లో కోకొల్లలు. అతికొద్ది మంది మాత్రమే అర్థం చేసుకునే యజమానులుండడం విశేషం. ప్రభుత్వాలు మూడు నెలల వరకు ఇంటిఅద్దె విషయంలో రిలీఫ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా.. దాని అమలు విషయంలోనే ఈ వలస కూలీలకు నమ్మకం కుదరడం లేదని వారి మాటల్ని బట్టి తెలుస్తోంది. (కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు, ట్రాఫిక్ సిబ్బంది బావుపేట నుండి ఒరిస్సాకు వెళ్తున్న కూలీలకు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్న దృశ్యం. రాజస్థాన్ సేవా సంస్థ, రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఇది జరిగింది.)


స్థానిక ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు తిండి, వసతి ఏర్పాట్లకు ఉపక్రమించినా.. అవి వలస కూలీల తాకిడికి ఏమాత్రం సరిపోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ సక్సెస్ కావాలంటే ఎక్కడివారిని అక్కడే ఉంచాలి. అది జరగాలంటే.. వారు కదలకుండా చేసే నమ్మకం కలిగించాలి. ముఖ్యంగా ఇంటిఅద్దెలతో పాటు రాబోయే 3 నెలల వరకు వెసులుబాటు కల్పించే ఏర్పాట్లు చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. పాలక ప్రభుత్వాలు ఈ సూచనలు ఎంతవరకు అమలు చేస్తారో చూద్దాం. 


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల