Skip to main content

Posts

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

ఎంబీసీ జాతిపిత కాళప్ప 75వ బర్త్ డే వేడుకలు

అత్యంత వెనుకబడిన కులాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి మెప్పించిన కె.సి.కాళప్ప జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల మధ్య నిరాడంబరంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలోని తన స్వగృహంలో కాళప్ప 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంబీసీల్లోని పలు కులాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తమ కులాల అభ్యున్నతి కోసం కాళప్ప చేసిన కృషిని అంతా గుర్తు చేసుకున్నారు. కాళప్ప అనారోగ్యానికి గురైన తరువాత ఎంబీసీ ఎజెండా చలనం లేకుండా పోవడంపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం వరకు కాళప్ప పూర్తి ఆరోగ్యంగా ఉండి యావత్ ఎంబీసీల ఎజెండాను పరుగులు పెట్టించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.  2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించి.. అందుకోసం సామాజిక అధ్యయనం చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టారు. ఆ సమయంలో బీసీల్లో ఉన్న మోస్ట్ బ్యాక్‎వార్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) కు కూడా సమన్యాయం, సహజ న్యాయం జరగాలనే బలమైన వాయిస్ వినిపించారు కాళప్ప. బీసీల్లో ఉన్న దాదాపు నూటపాతిక కులాల్లో కేవలం 5

ఆనాడు బూర్గుల.. నేడు రేవంత్

ఆధునిక పోకడలకు దూరంగా ఉండే వెనుకబడ్డ కొడంగల్ నుంచి.. రాష్ట్ర అత్యున్నత పదవికి ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రస్థానం చాలాచాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అంతేకాదు.. పాత మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రికి ఎన్నికైన రెండో సీఎం రేవంత్ కావడం మరో విశేషం. ఆయన రాజకీయ జీవితంలోని ముఖ్యాంశాల గురించి ఓసారి చూద్దాం.  తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నికైన సందర్భం ఒక ముఖ్యాంశమైతే.. పాలమూరు జిల్లా నుంచి సీఎంగా ఎన్నికవుతున్న రెండో వ్యక్తి కూడా రేవంతే కావడం మరో ముఖ్యాంశం. ఆంధ్రాలో విలీనం కాక ముందు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు బూర్గుల రామకృష్ణారావు. ఆయన అప్పటి కల్వకుర్తి తాలూకాలోని పడకల్లు గ్రామంలో జన్మించారు. గొప్ప మేధావి, రచయిత, నిజాంపై పోరాడిన ధీరుడిగా కీర్తి గడించిన బూర్గుల తరువాత.. ఇంత కాలానికి మళ్లీ పాలమూరు ప్రాంతం నుంచి రేవంత్ రూపంలో మరో వ్యక్తి సీఎం అవుతున్నాడు. కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ ముఖ్యమంత్రిగా ఎన్నికవుతుండడంతో ఆ ప్రాంతానికి మరోసారి ఆ ఖ్యాతి దక్కినట్టయింది. పాలమూరు నుంచి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్నారు.  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోత

థాంక్స్ టు సోనియమ్మ

తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్ రెడ్డి. పట్టిన పట్టు వదలడు అనే పేరున్న రేవంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా అలాగే మలుచుకున్నారు. రాజకీయ జీవితాన్ని తాము కోరినట్టుగా మలుచుకున్న అతికొద్ది మంది నాయకుల్లో రేవంత్ ఒకరు. చాలా మందికి అదృష్టవశాత్తూ సీఎం కుర్చీ దొరకవచ్చు. కానీ రేవంత్ కు ఆ సీటు అదృష్టవశాత్తూ దొరకలేదు. తన ప్రయాణాన్నే సీఎం కుర్చీ దిశగా టార్గెట్ చేసి పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు. ఆ విషయాల గురించి మరింత డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ముందు.. రేవంత్ తెలంగాణ సీఎం అయిన సందర్భం గురించి చెప్పుకోవాలి.  నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజానీకం. ఈ కృషిలో రేవంత్ పాత్రను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇతర కాంగ్రెస్ నేతలెవరూ చేయని పనిని రేవంత్ చేసిపెట్టారు. ప్రజల్లో నమ్మకం కలిగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామేం చేస్తారో రేవంత్ చెప్పారు. ఆయన మాటల్ని ప్రజలు నమ్మారు. రాష్ట్ర కాంగ్రెస్ సైన్యాన్ని నడిపించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్.. టీ-పీసీసీ చీఫ్ గా అనుకున్న లక్ష్య

కాంగ్రెస్ ను తలెత్తుకునేలా చేసిన టఫ్ మ్యాన్

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. బీఆర్ఎస్ కార్డు సైడ్ అయిపొయ్యి.. కాంగ్రెస్ కార్డు ముందుకొచ్చింది. దీనికంతటికీ కారణం ఒకే ఒక్కడు. ఆయనే టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగిల్ హ్యాండెడ్ గా పార్టీని, సీనియర్లను, శ్రేణులను, కేడర్ ను నడిపించి ఉన్నతాసనాన్ని ఖరారు చేసుకున్నారు రేవంత్. మరి.. ఈ ఉన్నతమైన స్థానం ఆయనకు ఊరికే లభించిందా? ఆయన కృషి ఎలాంటిది?  తెలంగాణ ప్రభుత్వ మార్పిడిలో కీలకమైన క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారూ ఉంటే అది రేవంత్ రెడ్డి. టీ-పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం వెనుక.. కాంగ్రెస్ కు కాకతాళీయమైన అవసరమేం లేదంటారు నిపుణులు. రేవంత్ ను టీ-పీసీసీ చీఫ్ గా తీసుకోవడం వెనుక ఉభయుల ప్రయోజనాలూ ఉన్నాయట. అందుకే కాంగ్రెస్ ను తనకు అప్పగిస్తే.. కొన్ని కీలకమైన నిర్ణయాలు తనకు కట్టబెడితే.. పార్టీని నడిపిస్తానని.. హైకమాండ్ నిశ్చింతగా ఉండొచ్చని.. కచ్చితంగా రిజల్ట్ రాబడతానని ఎంతో నమ్మకంగా చెప్పారట రేవంత్. ఆయన మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ చూసే.. సోనియా, రాహుల్ టీ-పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించేందుకు ముందుకొచ్చారు. దానిపై టీ-కాంగ్రెస్ సీనియర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు, ఎన్ని అసంతృప్తులు వచ్చినా డోంట్ కేర్

వనపర్తి గెలుపు బాటలో నిరంజన్ రెడ్డి

తెలంగాణలో సుదీర్ఘమైన, చెప్పుకోదగిన చరిత్ర గల పాతకాలపు సంస్థానమే వనపర్తి. ఆత్మాభిమానానికి, పౌరుష పరాక్రమాలకు, కవి గాయక వైతాళికులకు పెట్టింది పేరు.. ఈ వనపర్తి. కాలక్రమంలో అదే ఇప్పుడు నియోజకవర్గంగా మారింది. అలాంటి వనపర్తిలో ఎన్నికల పోరాటం రసవత్తరంగా మారుతోంది. అందుక్కారణం సిట్టింగ్ మినిస్టర్ గా, నీళ్ల నిరంజనుడిగా పేరున్న కేసీఆర్ అనుచరుడు ఒకరైతే.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తెలంగాణ ఆవిర్భవించిన సమయంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి మరొకరు. అయితే ఆయనకు టికెట్ ఇస్తానని ఊరించిన కాంగ్రెస్ అధిష్టానం.. మేఘారెడ్డిని అభ్యర్థిగా మార్చేసింది. ఇలాంటి సమయంలో వనపర్తిలో గెలుపు జెండా ఎగరేసేది ఎవరు? ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే తెలంగాణకు ముందు.. తెలంగాణకు తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలమూరు రూపురేఖలు మారిపోయాయి. అందులో భాగమైన వనపర్తి జిల్లా పేరుతో ఏర్పడిన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు తీసింది. ఇప్పుడీ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మేఘా

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం) అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం.  దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి. 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం.  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరా