Skip to main content

జనవరి ఫస్టు రోజున చలో రామప్ప - బొడ్డుపల్లి బాలబ్రహ్మం

ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన రామప్ప దేవాలయ చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఫస్టున  ఓ భారీ యాత్రను తలపెట్టారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఖ్యాతికెక్కిన రామప్ప దేవాలయ యాత్రను శనివారం (జనవరి ఫస్టు) తలపెట్టామని మంగళంపల్లి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి బాలబ్రహ్మాచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకటవ తేదీ శనివారం రాత్రి‌ BHEL నుండి ఓ లగ్జరీ బస్సు బయలుదేరి రెండవతేదీ ఆదివారం ఉదయానికల్లా దక్షిణ  కాశీగా అందరూ పిలుచుకునే కాళేశ్వరం చేరుకుంటారు. గోదావరి త్రివేణి సంగమంలో పుణ్యనదీ స్నానం  ఆచరించి, ఆ తరువాత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒకే ప్రాణవట్టం పై (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు) యముడు, శివుడి దర్శనం చేసుకుంటారు. అనంతరం బ్రహ్మశ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఈశ్వరీమాత నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనం ముగించుకొని మద్యాహ్నం 2 గంటలకు ప్రపంచ ప్రఖ్యాత రామప్ప గుడిని చేరుకుంటారు. రామప్ప గుడి శిల్పసంపద, ముఖ్యమైన ప్రదేశాలు, వాటి గొప్పతనం తెలిపే విషయాలను వీడియో షూట్ చేస్తారు. యాత్రలో పాల్గొన్నవారి అభిప్రాయాలు, అనుభూతులను రికార్డు చేస్తారు. సాయంత్రం 5 గంటలకు రామప్ప నుంచి బయలుదేరి వరంగల్ వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వరాలయం, భధ్రకాళి అమ్మవార్లను దర్శించుకొని రాత్రి పది గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని   బాలబ్రహ్మాచారి  చెప్పారు. ఈ యాత్రలో భాగంగా రామప్ప గుడిని తీర్చిదిద్దిన రాక్ మెల్టింగ్ టెక్నాలజీ, శాండ్ టెక్నాలజీలపై నిపుణుల చేత ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తామన్నారు. 


రామప్ప గుడికి అంతర్జాతీయ ఖ్యాతి లభించగానే కొందరు సూడో మేధావులు రామప్ప దేవాలయం పేరు మార్చే కుట్రలకు పాల్పడుతున్నారని, ఎన్నడూ లేనిది రుద్రేశ్వరాలయంగా  పేర్కొంటూ   ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని, శతాబ్దాలుగా ప్రజలందరూ పిలుచుకునే పేరుకు బదులుగా కొత్తగా ఆనాటి పాలకుడి పేరును తెరమీదికి తెస్తున్నారని బాలబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మన ప్రాచీన శిల్పాచార్యులను శంకించడం, అవమానించడమే అవుతుందన్నారు.  ఆధునిక చరిత్రకు అందని రోజుల్లోనే ఎందరో శిల్పాచార్యులు తమ జీవితాలను ధారవోసి భారతీయ సంస్కృతిని, కళలను సుసంపన్నం చేశారని, అలాంటివారి  అసమాన ప్రతిభను తెరమరుగు చేసే కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 

యాత్ర సందర్భంగా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ- స్నాక్స్ లు సైతం ఏర్పాటు చేస్తున్నామని, యాత్రలో పాల్గొనేవారు రూ. వెయ్యి రూపాయలు చెల్లించి సీటు రిజర్వు చేసుకోవాలని సూచించారు. తనను 92477 37298 నెంబరులో సంప్రదించవచ్చని, అలాగే ఈ యాత్రకు పక్కా ప్లాన్ చేసి సహకరిస్తున్న కొత్తపల్లి సీతారామాచారిని 98499 32519 నెంబరులో సంప్రదించవచ్చని ఆయన చెప్పారు. జనవరి ఫస్టున అమరశిల్పి జక్కన జయంతి కావడం విశేషం. 
బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి


Comments

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే

సీతను అడవికి పంపడంలో చాకలి పాత్ర ఎంత?

రామాయణం లాంటి మహా ఇతిహాసంలో కొన్ని అపరిపక్వమైన అల్లికలు, జాతి నిందాపూర్వక వ్యాఖ్యానాలు కాలక్రమంలో చేరిపోయాయి. కొంచెం మనసు పెట్టి ఆలకిస్తే వాటి మూలాలను బట్టబయలు చేయొచ్చు. అలాంటి ఒక అనుమానమే ప్రస్తుతం డీడీ భారతిలో వస్తున్న రామాయణాన్ని వీక్షించడం ద్వారా తీరింది. అది నా లాంటి జిజ్ఞాసువులు ఎందరికో ఉపయోగపడుతుందని రాయాలనిపించింది.  జాతి నింద ఏముంది? తెలుగువాడికి తెలిసిన రామాయణంలో సీతమ్మను అడవికి పంపిన ఘటన అపరిపక్వంగా ఉంది. ఆ నోటా ఆ నోటా తనదాకా వచ్చిన మాటను ఆధారం చేసుకొని రాముడు సీతను అడవికి పంపినట్టు లవకుశ వంటి రామాయణానికి సంబంధించిన సినిమాల ద్వారా, పాటల ద్వారా విన్నాం. అది నిజమని ఇప్పటికీ భ్రమిస్తున్నాం. "చాకలి నింద" కారణంగా రాముడు సీతను అడవి పంపాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడన్నది మనకున్న అవగాహన. ఇప్పుడు కాస్త విడమరచి ఆలోచించే శక్తి ఉన్న టైమ్ లో… 33 ఏళ్ల క్రితం భారత ప్రజల్ని ఉర్రూతలూపిన ఉత్తర రామాయణాన్ని పరిశీలనగా వీక్షించే అవకాశం ఏర్పడింది కాబట్టి.. ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది.  వృత్తాంతాన్ని పరిశీలిద్దాం రాముడు లంకా విజయం తరువాత పుష్పక విమానంలో అయోధ్య రావడం, పట్టాభిషేకం చేసుకొన

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో