Skip to main content

వీకెండ్ స్టోరీ: హండ్రెడ్ పర్సెంట్ హరామ్


ఈ మధ్య కొద్ది నెలలుగా టెండర్ కట్స్ పేరుతో ఓ భారీ వ్యాపార ప్రకటన ఖరీదైన ఇంగ్లిష్ పేపర్లో, ఫ్రంట్ పేజ్‍లో దర్శనమిస్తోంది. త్వరలో హైదరాబాద్ లో మటన్, చికెన్, ఎగ్స్, ఫిష్, ప్రాన్స్.. ఇలా మాంసాహార ఉత్పత్తులు మీరు కోరుకున్న చోటికి డోర్ డెలివరీ అంటూ ఊదరగొడుతోంది. ఇప్పుడైతే హైదరాబాద్ లోని 11 సెంటర్లలో టెండర్ కట్స్ దుకాణాలు రెడీ అయ్యాయని కూడా తాజాగా మరో ప్రకటన వెలువడింది. అది వ్యాపార ప్రకటన కాబట్టి అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఈ యాడ్ లో చక్కగా బొట్టు పెట్టుకున్న ఈ హిందూ మహిళ చేత ఎంతో గర్వంగా పోజిప్పించి టెండర్ కట్స్ మాంసానికి బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎడమవైపు పైన 100 PER CENT HALAL అంటూ స్టార్ గుర్తులో హైలైట్ చేయడమే ఈ నాలుగు మాటలు మాట్లాడుకోవడానికి దారితీస్తోంది. 

హలాల్ అనేది ముస్లింల విశ్వాసాల ప్రకారం దేవునికి సమర్పించుకునే నైవేద్యం. ముస్లిమేతరులు ముస్లిమేతర పద్ధతుల్లో సమర్పించుకునే నైవేద్యాన్ని సంప్రదాయ ముస్లింలు ఎవరూ ముట్టుకోరు. మహమ్మద్ ప్రవక్త చెప్పినట్టుగా చెబుతున్న షరియా సూత్రాలను ఇండియన్ ముస్లింలు పెద్దసంఖ్యలో తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. బయటి దేశాల్లో దీనిమీద పెద్ద పట్టింపులేవీ లేవని గమనించాలి. హలాల్ పద్ధతిని ఎత్తేసిన యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. ఇక ముస్లిమేతరుల్లో సిక్కులు ఝట్కా పద్ధతి మాంసాన్నే వినియోగిస్తారు. ఇతర పద్ధతిని వీరు ఏమాత్రం అంగీకరించరు. ఝట్కా అంటే ఒక్క వేటుతో జంతువు మెడ నరకడం. హలాల్ అంటే మెడను సగం కోయడం. ఝట్కాలో ఉన్న మరణానికి, హలాల్ లో ఉన్న మరణానికి చాలా తేడా ఉంటుందని ఇప్పటికే జంతుప్రేమికులు చాలా సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉన్నారు. ఆహారంగా వినియోగించుకునే జంతువును బాధ తెలియకుండా చంపడం కొద్దిగా మెరుగైన పద్ధతిగా చాలా మంది భావిస్తున్నారు. హలాల్ చేసిన తరువాత ప్రాణం పోయేదాకా ఆ జంతువు పడే బాధ వర్ణనాతీతంగా ఉంటుందని వేరే చెప్పాల్సిన పన్లేదు. ఇక హిందువులు చాలా ఫ్లెక్సిబుల్. వారు కొంటున్న మాంసం హలాలా.. ఝట్కానా.. అనేది వారు పెద్దగా పట్టించుకోరు. బోనాలు, ఎల్లమ్మ, పోచమ్మ కొలుపులు, ఇతర దేవతలకు జంతు బలులు ఇచ్చేటప్పుడు జంతువు మెడ పూర్తిగా కోసి నైవేద్యంగా సమర్పించుకోవడం ఆచారం. దాన్ని తప్పకుండా పాటిస్తారు. ఇది కాకుండా రోజువారీ మాంసాహార వినియోగంలో హలాల్, ఝట్కా సంప్రదాయాల జోలికి వారు వెళ్లడం లేదు. ఇది ఒక కోణమైతే.. హండ్రెడ్ పర్సెంట్ హలాల్ పేరుతో హిందూ మహిళను చూపించి వ్యాపార ప్రకటన ఇచ్చుకోవడం మోసం కాదా అనేదే పాయింటు. ముస్లింలకే పరిమితమైన హలాల్ ను ముస్లిమేతరులు అందరి మీదా రుద్దడం కాదా? సాధారణ హిందూ గృహిణి బొమ్మను పెద్దగా చూపించి, హండ్రెడ్ పర్సెంట్ హలాల్ ను చిన్నగా చూపించి ప్రజలందరినీ మభ్యపెట్టడం కాదా? 

మన దేశం నుంచి మాంసాహారం పెద్దఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇప్పటివరకూ APEDA (అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్ పోర్ట్స్ డెవలప్ మెంట్ అథారిటీ) ఆహార ఉత్పత్తుల ఎగుమతి చట్టం ప్రకారం మాంసాహారం హలాల్ పద్ధతిలోనే ఎగుమతి అయ్యేది. అయితే దీనిపై పలు సిక్కు సంఘాలు, హిందూ సంఘాలు, ఎన్జీవోలు, కొన్ని క్రిస్టియన్ సంస్థలు కూడా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చాయి. విదేశాలకు మాంసం ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా హలాల్ చేయాల్సి వచ్చేది. దీంతో మాంసం ఎగుమతి అంతా కేవలం ముస్లింల చేతుల్లోకి వెళ్లిపోయింది. గత జనవరిలో కేంద్రం అపెడా చట్టాన్ని సవరించడం ద్వారా హలాల్ అనే పదాన్ని తొలగించారు. దీంతో మాంసం ఎగుమతిలోకి భారతీయులంతా వచ్చినట్లయింది. హలాల్ సర్టిఫికేషన్ తో ప్రభుత్వానికేం సంబంధం లేదని, అది మాంసం ఆర్డర్ చేసే దేశాలకు సంబంధించిన వ్యవహారమని చట్టం తేల్చి చెప్పింది. దీంతో షరియా మార్గదర్శకాలు అనుసరించి జారీ చేసే హలాల్ ఇండియా సర్టిఫికెట్ కు విలువ లేకుండాపోయింది. అయినా అదే సర్టిఫికెట్ ఆధారంగా చెన్నైకి చెందిన టెండర్ కట్స్ అనే సంస్థ మత విశ్వాసాలను, చట్ట సవరణను పట్టించుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ హలాల్ అంటూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుండడం గమనార్హం. 

సెక్యులరిజానికి పెద్దపీట వేసే భారత్ లో ఒక వర్గంవారికి మాత్రమే వ్యాపారాన్ని ధారాదత్తం చేసే చట్టాలు సవరించాలన్న డిమాండ్ గత ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఫలితంగా ఇటీవల కేంద్రం అపెడా చట్టాన్ని సవరించింది. అయినా ఆ చట్టం స్ఫూర్తిని తుంగలో తొక్కి... హలాల్ అనే ప్రత్యేక విశ్వాసాన్ని జనమందరికీ రుద్దడం హరామ్ కాదా? హలాల్ పేరుతో హరామ్ చేయొచ్చా? ఇప్పటికే పలు వ్యాపార ప్రకటనలు తమ సెంటిమెంట్లు గాయపరిచాయన్న ఆందోళనలతో క్షమాపణ చెప్పిన సందర్భాలు కోకొల్లలు. ఆ ఉదాహరణలేవీ పరిగణనలోకి తీసుకోకుండా టెండర్ కట్స్ ఇంత సున్నితంగా హలాల్ చేయడం హర్షణీయమేనా?


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత