Skip to main content

Posts

Showing posts with the label INTERNATIONAL

విజయ్ దివస్: పాక్ మెడలు వంచిన రోజు ఇదే

పాకిస్తాన్ కుత్సిత బుద్ధికి భారత్ తిరుగులేని రీతిలో జవాబిచ్చింది. మానవత్వాన్ని మరచిన పాక్ సేనలు బంగ్లాదేశ్ మీద జరిపిన దారుణ కాండకు తగిన గుణపాఠం చెప్పింది. అవకాశం దొరికిన ప్రతిసారీ ముస్లిం దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే పాక్ అసలు బండారం బయటపడింది. బంగ్లాదేశ్ ముస్లిం దేశమే అయినప్పటికీ.. తూర్పు పాకిస్థాన్ కు సంబంధించిన భూభాగపు ప్రజలపై విపరీతమైన కక్షతో పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన సైనికులు వచ్చి కేవలం తమ భాషను ఆమోదించని కారణంగా వేలాది మందిని చంపడమే కాకుండా తమ మతానికే చెందిన అక్షరాల లక్షకుపైగా మహిళలను రేప్ చేసినట్లుగా తెలిసి... అప్పటి భారత ప్రభుత్వం ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఉండలేకపోయింది. బంగ్లాదేశ్ కు సహకారం అందించి, సైనికులను పంపించి దుర్మార్గాలకు పాల్పడిన పశ్చిమ పాకిస్తాన్ కు సంబంధించిన 93 వేల మందికిపైగా దుష్ట సైనికులను ప్రాణాలతో బంధించింది. భారతదేశపు గడ్డపై మోకాళ్ళపై కూర్చుండబెట్టింది.. పాక్ పాలకుల్ని తలదించుకునేలా చేసింది. ఆ రోజే డిసెంబర్ 16, 1971 "విజయ్ దివస్".  Also Read:   ఆవు పేడతో చెప్పుల తయారీ 1971లో జరిగిన ఆ నాటి యుద్ధం భారత ఉపఖండం రూపురేఖలనే మార్చేసింది. తూర్పు

డ్రాగన్ కంట్రీకి వ్యతిరేకంగా నాలుగు దేశాలు

గత ఆరో తేదీన టోక్యోలో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రుల రెండో సమావేశం జరిగింది. అందులో అమెరికా తరఫున మైక్ పాంపియో, ఇండియా తరఫున జైశంకర్ పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా తాజాగా అమెరికా పాలకవర్గానికి చెందిన ఓ ప్రతినిధి చేసిన వ్యాఖ్య చైనాకు కళ్లెం వేసే అంశాన్ని తెరపైకి తెస్తోంది. వాషింగ్టన్ ఫారిన్ ప్రెస్ సెంటర్లో ఈ అంశాన్ని ఆయన రివీల్ చేశారు. పసిఫిక్ సముద్ర జలాల్లో, హిమాలయ పర్వతశ్రేణుల్లో చాలా దూకుడుగా ముందుకెళ్తున్న చైనాను అడ్డుకోవాలంటే భారత్ లాంటి దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ఏ దేశం ముందుకొచ్చిన తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా వ్యూహాత్మకంగా పలు దఫాలుగా చర్చలు జరపడం, దరిమిలా అమెరికా ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నాలుగు దేశాలు ఓ కూటమిగా పని చేయడం లేదని, ఇందులో ఎవరికీ సభ్యత్వం లాంటిది లేదని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి ఏ దేశ సార్వభౌమాధికారానికీ ఇబ్బందులు తలెత్తకుండా అదే సమయంలో కొన్ని దేశాల విస్తరణ కాంక్షకు కళ్లెం వేసే ఎత్తుగడతో ఇలాంటి దేశాలను ఒక్క అవగాహన కింద

చైనా పెట్టుబడులకు ఇండియా చెక్

Photo: cnn.com కరోనా పుణ్యమా అని భారత్ ఆలస్యంగానైనా కళ్లు తెరిచింది. మన సరిహద్దుల్ని ఆనుకునే ఉన్న డ్రాగన్ కంట్రీ కుట్రపూరితమైన ఆర్థిక సామ్రాజ్యవాదానికి తొలి చెక్ పెట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్న ఆపరేషన్లో భాగంగానే హుటాహుటిన ఎఫ్.డి.ఐ పాలసీని సవరించింది. దీని ప్రకారం మన దేశ సరిహద్దులు ఆనుకొని ఉన్న దేశాలు ఇకపై నేరుగా భారత్ లోని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం గానీ, పెట్టుబడులు పెట్టడం గానీ చేయడానికి వీల్లేదు. అలాగే భారత్ లోని కంపెనీలు కూడా యాజమాన్య హక్కుల బదలాయింపులు గానీ, కంపెనీల విస్తరణ గానీ, నూతన భాగస్వాములు, పెట్టుబడుల సేకరణ విషయంలో మన సరిహద్దుల్ని ఆనుకొని ఉన్న దేశాలతో కుదుర్చుకోవాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. తాజా ఎఫ్.డి.ఐ నిబంధనల సవరణ ప్రధానంగా చైనాను, అది విసిరే ఆర్థికపరమైన పెను సవాళ్లను ఎదుర్కోవడానికేనని భావిస్తున్నారు.    చైనాను పూర్తిగా నమ్మి పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచి ఇటలీలోని దేశీయ ఇండస్ట్రీని చేజేతులా నాశనం చేసుకున్న ఆ దేశం.. చాలా ఆలస్యంగా ఆ విషయాన్ని గుర్తించింది. కరోనా విజృంభించి శవాల దిబ్బగా మారిన తరుణంలోనే ఇటలీ పునరాలోచనలో పడింది. ఇటలీతో పాటు

అగ్గితోటి కడగడమే అందరికీ క్షేమకరం

  చచ్చినవాడు పుడతాడో లేదో గట్టిగా చెప్పే శక్తి సామర్థ్యాలు మనకు లేకున్నా.. పుట్టినవాడు కచ్చితంగా చచ్చి తీరుతాడనేది మాత్రం తిరుగులేని సత్యం. ఆ సత్యాన్ని తిరగరాద్దామని మనవాళ్లు ఎన్నో వేల కోట్ల డాలర్లు వెచ్చించి ప్రయోగాలు చేస్తున్నా ఇప్పటికైతే ఆశావహమైన ఆనవాళ్లేమీ కనిపించలేదు. ప్రపంచ మానవ జీనోమ్ ప్రాజెక్టు అంతిమ లక్ష్యం కూడా అదేనని ఆ మధ్య మీడియా అంతా వివిధరకాల కథనాలు గుప్పించింది. మనిషి మరణాన్ని అధిగమించబోతున్నాడని, ఆ సుదినం దగ్గర్లోనే ఉందని శాస్త్రవేత్తలు కూడా ఊరించారు. అలాంటి ప్రయోగాల్లో కనీసం అంగుళం కూడా ఫలితం సాధించినట్టు రుజువులైతే లభించలేదు. అయితే ఇప్పుడు ప్రపంచ మానవుడు మృత్యువును జయించే ప్రయోగాలు దేవుడెరుగు.. అసలు కంటికి కనిపించనంత అతి చిన్న వైరస్ కణానికే భయపడి చస్తున్నాడు. ఇలాంటి వైరస్ ఇప్పటివరకు మనిషి కంట పడలేదు. కరోనా ఉన్నట్టు గుర్తించారు కానీ.. అది చూపించే ప్రభావం మనిషి అనుభవంలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే ఆ మాయావి వైరస్ పంజా ఎంత విస్తృతంగా ఉందో అనుభవంలోకి వస్తోంది.  భూతల స్వర్గం అమెరికాలో చనిపోయినవారి శవాలను వారి బంధువులకో, తెలిసినవారికో అప్పగించడానికి కూడా సమయాభావం ఏర్పడుతోంది. కో

ఆనందం ఆవిరైన సౌత్ కొరియా.. మరి చైనా సంగతేంటి?

Imp Link: అగ్గితోటి కడగడమే అందరికీ క్షేమకరం కరోనా విశ్వరూపం అనూహ్యమైన ఉపద్రవంగా మారబోతుందా? ఇదే అనుమానం ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తోంది. కరోనాను చాలా తొందరగా అధిగమించామనుకుంటున్న దేశాలకు వణుకు పుట్టిస్తోంది. క్వారంటైన్ లో ఉండి కోలుకున్న దాదాపు వంద మంది సౌత్ కొరియా కోవిడ్-19 పేషెంట్లు ఎంతో నిబ్బరంగా రోజువారీ కార్యకలాపాల్లో మునిగిపోయారు. అయితే వారికి నిర్వహించిన పరీక్షల్లో మళ్లీ పాజిటివ్ తేలడంతో వైద్య నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా అదుపులోకి వస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ ట్రెండ్ ఏంటో అవగతం కావడం లేదని సౌత్ కొరియా వ్యాధి నిరోధక శాఖ డైరెక్టర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  Also Read: నెగెటివ్ వచ్చినా మరణం తథ్యమేనా? సౌత్ కొరియాలో కరోనా అదుపులోకి రావడంతో ఇప్పటికే పాఠశాలలు తెరిచారు. జనజీవనం మీద, జన సంచారం మీద ఆంక్షలను పరిమితం చేయడంతో రోజువారీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇదే వారి ఆందోళనకు కారణమవుతోంది. ఈ క్రమంలో చైనా పరిస్థితేంటి అన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్నాయి. వుహాన్ లో కరోనా కొత్త కేసులు జీరో స్టేటస్ కి తీసుకొచ్చిన క్రమంలో వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు.

చంటిబిడ్డల శవాలతో తల్లులు.. చేతులెత్తేసిన ఇటలీ

ఇటలీ దేశం శవాల దిబ్బగా మారుతోంది. అందుకు తార్కాణమే తాజా ఫొటోలు. 

కరోనా ఫ్యామిలీ చాలా పెద్దది.. ఒక్కొక్కటీ మహా హంతకి

       (కరోనా ధాటికి వల్లకాడవుతున్న ఇటలీ) చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ కరోనా వైరస్‌. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో ఈ కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్‌"గా గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్. కరోనావైరస్‌ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా అనే పదం.. క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్ లు ఉన్నాయి. వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల

తెరమీదికొస్తున్న పాత సంప్రదాయాలు ఇవే

కరోనా వైరస్ అంటుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువల్ల క్రమంగా కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి.మరణ భయం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తానికి అనుభవంలోకి వస్తున్న భయంకరమైన దృశ్యం కనిపిస్తోంది. అయితే కరోనా వైరస్ మృత్యు కోరలు చాస్తున్నా.. దానికన్నా కూడా నరనరాల్లో భయంకరంగా వ్యాపించి ఉన్న అతివిశ్వాసపు ఏహ్య భావాల జాడ్యం మాత్రం కొందరిలో ఇప్పటికీ బుసలు కొడుతుండడమే విచిత్రం.  ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్.. ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందనే ఆసక్తి ప్రపంచ ప్రజల్లో, ప్రపంచ మీడియాలో వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కోసం జనాన్ని సిద్ధం చేయడం, ఆ ప్రతిపాదనకు విపరీతమైన ఆదరణ లభించడం చూస్తుంటే భారత ప్రజలు ఎంత స్వేచ్ఛను కోరుకుంటారో.. అనుకోని ఆపదలు సంభవించినప్పుడు అంతా సహకరించి ఒక్క తాటిపైకి వస్తారని కూడా రుజువవుతోంది.  చద్దిమూటలవుతున్న పెద్దల మాటలు పెద్దల మాట చద్దిమూట అన్న సూక్తిని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకొని కొట్టిపారేశాం. మనలో చాలామంది నిన్నటివరకు నవ్వుకున్నారు కూడా. కానీ ఇప్పుడదే సూక్తి కరోనా మహ

మత స్వేచ్ఛ ఎలా ఉంటదో చెప్పవా ట్రంప్.. ప్లీజ్

  భారత్ లో మత స్వేచ్ఛపై ట్రంప్ మాట్లాడతాడట. మత స్వేచ్ఛపై ఏం మాట్లాడతావు? భారత్ లో మత స్వేచ్ఛ ఉందంటావా? లేదంటావా? అమెరికా కన్నా ఎక్కువుందంటావా ?  లేక అసల్లేదంటావా ? ఏ దేశంలో అమల్లో ఉన్న మత స్వేచ్ఛను ప్రామాణికంగా తీసుకొని భారత్ లో మతస్వేచ్ఛను కొలుస్తావు బాస్?     పేరులో ఇస్లామిక్ నేచర్ ఉన్నా, వేషధారణలో ఇస్లామిక్ కల్చర్ కనిపించినా భూతద్దం పెట్టి ఒళ్లంతా సెర్చ్  చేసే అమెరికాధీశుడు భారత్ లో మత స్వేచ్ఛ మీద మాట్లాడతాడట. మెక్సికో నుంచి వచ్చే శరణార్థులను అడ్డగించేందుకు నువ్వు ముళ్ల కంచెలు నాటుకుంటావు. అయినా అక్రమ వలసలు వరదలా పారుతుంటే 24 గంటల సెక్యూరిటీని అమలు చేసుకుంటావు. యూరోప్, మధ్య ప్రాచ్య దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా విపరీతమైన ఆంక్షలు పెడతావు.      ఎయిర్ పోర్టుల్లో తలపాగా చుట్టుకున్న సిక్కును చూసినా ముస్లిం పౌరుడేమోనని జడుసుకుంటావు. క్లీన్ షేవ్ తో ఉన్న మా స్మార్ట్ హీరో భారతీయుడు కమల్ హాసన్ ని చూసినా పేరులో హసన్ ధ్వనిస్తుంది కాబట్టి బట్టలు విప్పించి మరీ ముస్లింను కాదని చెప్పేదాకా వదలిపెట్టకుండా.. ఇండియాలో హిందువును అని చెప్పని కమల్ చేత నువ్వు మాత్రం... నేను హిందువునే మొర్రో అని గొ