Skip to main content

తెరమీదికొస్తున్న పాత సంప్రదాయాలు ఇవే


కరోనా వైరస్ అంటుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువల్ల క్రమంగా కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి.మరణ భయం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచ మానవాళి మొత్తానికి అనుభవంలోకి వస్తున్న భయంకరమైన దృశ్యం కనిపిస్తోంది. అయితే కరోనా వైరస్ మృత్యు కోరలు చాస్తున్నా.. దానికన్నా కూడా నరనరాల్లో భయంకరంగా వ్యాపించి ఉన్న అతివిశ్వాసపు ఏహ్య భావాల జాడ్యం మాత్రం కొందరిలో ఇప్పటికీ బుసలు కొడుతుండడమే విచిత్రం. 


ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తున్నదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రపంచ జనాభాలో రెండో అతిపెద్ద దేశమైన భారత్.. ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందనే ఆసక్తి ప్రపంచ ప్రజల్లో, ప్రపంచ మీడియాలో వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ కోసం జనాన్ని సిద్ధం చేయడం, ఆ ప్రతిపాదనకు విపరీతమైన ఆదరణ లభించడం చూస్తుంటే భారత ప్రజలు ఎంత స్వేచ్ఛను కోరుకుంటారో.. అనుకోని ఆపదలు సంభవించినప్పుడు అంతా సహకరించి ఒక్క తాటిపైకి వస్తారని కూడా రుజువవుతోంది. 


చద్దిమూటలవుతున్న పెద్దల మాటలు


పెద్దల మాట చద్దిమూట అన్న సూక్తిని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకొని కొట్టిపారేశాం. మనలో చాలామంది నిన్నటివరకు నవ్వుకున్నారు కూడా. కానీ ఇప్పుడదే సూక్తి కరోనా మహమ్మారి నుంచి కాపాడే తారకమంత్రమే అయింది. 


1) ఎంగిలి (అంగిలి) అంటుకోరాదు


ఒకరి ఎంగిలి ఇంకొకరికి అంటుకోరాదన్నది చిన్నప్పుడు అమ్మా-నాన్న, నాన్నమ్మ-తాత లాంటి పెద్దలు చాలా స్ట్రిక్టుగా చెప్పేవాళ్లు. కొన్నిసార్లు బయటివాళ్ల ఎంగిలి తిన్నామని తెలిస్తే బెత్తం దెబ్బలు కూడా పడ్డరోజులున్నాయి. అందులో ఏం తప్పుంది? తిన్నంతమాత్రం ఏం కొంపలు మునుగుతాయో ఎంత ఆలోచించినా అప్పట్లో అర్థమయ్యేది కాదు. అయితే వాళ్లకు విడమరిచి చెప్పే విజ్ఞానం లేకపోవచ్చు కానీ.. వాళ్లు అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మాత్రం తు.చ. తప్పకుండా పాటించేవారు. దానికి విఘాతం కలిగితే సహించేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ప్రపంచం మొత్తానికీ అందులోని మర్మం ఏంటో అనుభవంలోకి వచ్చేసింది. 


2) నైవేద్యం వండేటప్పుడు అంత చాదస్తమా? 
ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు, నోములు, వ్రతాలు జరిగినప్పుడు దేవుడికి ప్రసాదాలు తయారు చేయడం అందరికీ తెలిసిందే. ఆ ప్రసాదాలు తయారు చేసేటప్పుడు వాళ్ల అత్తగారు ఒక్క మాట కూడా మాట్లాడనిచ్చేది కాదని మా అమ్మ చెప్పేది. అంత మూర్ఖత్వమా అని నా లాంటివాళ్లం అనుకునేవాళ్లం. ప్రసాదాల వంటి పవిత్రమైన వంటకాలు చేసేటప్పుడు నోటికి గుడ్డు కూడా కట్టుకునేవారని మా అమ్మ ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. ఆ మాటలు విని మొన్నటివరకు మేం నవ్వుకున్నాం. కానీ కరోనా విశ్వరూపం చూపిస్తున్నప్పుడు, ప్రపంచమంతా కూడా మూతులకు మాస్కులు తగిలించుకోవడం చూస్తున్నప్పుడు వారి చాదస్తం లోపల కూడా ఇంత పరమార్థం ఉందా అని అనిపించక మానదు. 


3) లాలాజలాన్ని లైట్ తీసుకోరాదు


హెచ్ఐవీ  రోగులను సమాజం నుంచి బాయ్ కాట్ చేయవద్దన్న ఉద్దేశంతో డాక్టర్లు, మీడియా అంతా కూడా.. హెచ్ఐవీ సోకిన వ్యక్తిని తాకితే ఏమీ కాదని, వారు తిన్న ప్లేట్ లో తిన్నా, వారిని అంటుుకున్నా, వారి ఎంగిలి మనం గ్రహించినా ఏమీ కాదని పనికట్టుకొని మరీ ప్రచారం చేశారు. లాలాజలంలో హైచ్ఐవీ వైరస్ ఉండదని శాస్త్రీయంగా రుజువు చేశారు. కానీ ఇప్పుడేమంటారు మన డాక్టర్లు?హెచ్ఐవీ గురించి ఒకరకంగా చెప్పిన డాక్టర్లు, కరోనా వైరస్ గురించి అదే సూత్రానికి వ్యతిరేకంగా మరో కొత్త సూత్రాన్ని తయారు చేసి చెప్తారా? అంటే రోగానికో సూత్రం తయారు చేసి ప్రజల్ని కన్ఫ్జూజ్ చేయడమేనా డాక్టర్ల పని? దీనివల్ల అర్థం చేసుకోవాల్సిందేంటంటే.. గొప్పగా అభివృద్ధి చెందిందని భావిస్తున్న మన సైన్సు భారతీయ సంప్రదాయాల కన్నా ఇంకా వెనుకబడే ఉందని. వైరస్ బయట పడిన తరువాత దాని లక్షణాలు తెలుసుకొని, దాని వ్యాప్తి ఎలా జరుగుతుందో అర్థం చేసుకొని మందులు కనుక్కునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మన పూర్వీకులు ఆ నష్టం కూడా జరగకుండా చాలా ముందు చూపుతో కామన్ సూత్రాలు కొన్ని తయారు చేశారు. 


4) కామన్ సూత్రాలు కొన్ని


- ఒకరికొొకరు అంటుకోకుండా దూరంగా ఉండడం. 
- ఒకరి గాలి ఒకరికి సోకకుండా వ్యవహరించడం- ఒకరు వాడిన నీళ్లు మరొకరు వాడకపోవడం- ఒకరు తిన్న కంచాన్ని మరొకరు వాడకపోవడం (ఆకుభోజనం అందుకే)
- ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం- ఇంట్లోకి వచ్చాక ఆ దుస్తుల్ని ఇంటి బయటే మూలన పడేసి, వాటిని నీటితో తడిపేయడం లేదా ఉతుక్కోవడం- అపరిచితుల్ని లేదా కొత్తవారిని (బంధువులైనా సరే) కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి రానివ్వకపోవడం5) పైన చెప్పుకున్నవన్నీ చాదస్తంగానో, అంటరానితనంగానో చెప్పుకొని లైట్ తీసుకున్నాం. మడి ఆచారాల్ని అంటరానితనంగా చెప్పుకొని దానికి వ్యతిరేకంగా చట్టాలు కూడా తయారు చేసుకున్నాం. చాలా మంది (అమాయకులో, అజ్ఞానులో)ని శిక్షించుకున్నాం. అంటరానితనం పాటించినందుకు ఎందరికో జరిమానాలు విధించుకున్నాం. కానీ బాగా చదువుకున్నానని విర్రవీగుతున్న ఆధునిక మానవుడు.. పాత అలవాట్లను ఇప్పుడు తప్పంటాడా.. మనిషికి, మనిషికి మధ్య కనీసం మీటరు దూరం ఉండాలని లేకపోతే చట్టరీత్యా శిక్షార్హులవుతారని కొత్త చట్టాలు తయారు చేస్తాడా? కనీసం ఆత్మపరిశీలన అయినా చేసుకుంటాడా?6) యజ్ఞయాగాలతో లాభాలు


- యజ్ఞయాగాలతో కంటికి కనపడని అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎంత మొత్తుకున్నా లైట్ తీసుకున్నాం. 
- కరోనా విజృంభించాక ఇంట్లో కుంపటి విలువ తెలిసిపోయి ఇప్పుడు ప్రపంచమంతాా ఆ బాటన పయనిస్తోంది. 
- మొన్నమొన్నటివరకు ప్రతి ఇంట్లో ఒక మూలన అగ్ని ఉండేది. ముఖ్యగా రాత్రి వేళల్లో నిరంతరంగా నిప్పు వెలిగేది. 
- నిప్పు దేన్నయినా దహించివేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే కదా.
ఆధునిక  మానవుడు ఇప్పుడు అంతర్ముఖుడు కావాల్సిన సమయం వచ్చిందంటున్నారు అనుభవజ్ఞలు.


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల