Skip to main content

కరోనా ఫ్యామిలీ చాలా పెద్దది.. ఒక్కొక్కటీ మహా హంతకి


       (కరోనా ధాటికి వల్లకాడవుతున్న ఇటలీ)


చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ కరోనా వైరస్‌. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు.పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో ఈ కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో "కరోనావైరస్‌"గా గుర్తించారు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్.


కరోనావైరస్‌ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. కరోనా అనే పదం.. క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్ లు ఉన్నాయి. వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ రెండురకాల కరోనావైరస్‌ల వల్ల సాధారణ జలుబు, జ్వరం వస్తుంది. ఈ సాధారణ కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకు. జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తాయి. చాలా ముఖ్యమైన కరోనావైరస్ లలో సార్స్ SARS, మెర్స్ MERS ఉన్నాయి పరిశోధనల్లో తేలిందేమిటంటే ‘సార్స్ సీఓవీ’ వైరస్ పిల్లుల నుండి మనుషులకు సోకుతుందని,‘మెర్స్-సీఓవీ’ ఒంటెల నుండి మనుషులకు సోకుతుందని తేలింది. ఇవి కాకుండా అనేక రకాలైన కరోనావైరస్‌లు జంతువుల నుండి జంతువులకే సోకుతున్నాయని మరో అధ్యయనంలో వెల్లడైంది. ఇవి ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఎంత తేలిగ్గా వ్యాపిస్తాయనే విషయాల మీద స్పష్టత లేదు. 


కరోనా వైరస్ చాలా సాధారణంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి ప్రారంభ లక్షణాలతో దాన్ని గుర్తించవచ్చు. కానీ కరోనా కుటుంబానికే చెందిన సార్స్(సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వంటి కొన్ని వైరస్‌లు చాలా ప్రమాదకరం.వుహాన్ నుంచి వ్యాపించిన అంటువ్యాధులకు కారణమైన వైరస్‌కు 'నావెల్ కరోనా వైరస్ లేదా nCoV'అని పేరు పెట్టారు. ఇది కరోనా కుటుంబానికి చెందిన కొత్త జాతి వైరస్. దీనిని ఇంతకు ముందు వరకూ మనుషుల్లో గుర్తించలేదు.


కరోనావైరస్ అనే పేరుగల వైరస్ కలిగించే జబ్బు పేరు కోవిడ్-19 (Covid-19) Coronavirus లోని Co vi లకు డిసీస్ (disease) లోని d ని చేర్చి Covid అనే పేరు పెట్టారు. కరోనా వైరస్ సోకిన తరువాత కోవిడ్-19 జబ్బు లక్షణాలు బయటపడేందుకు 1 నుండి 14 రోజుల వరకు పట్టవచ్చని, సాధారణంగా ఇది 5 రోజుల్లో బయటపడుతుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.


ఈ వైరస్ శ్వాసవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.1960ల్లో ఈ వైరస్ ని కనుగొన్నారు. ఇప్పటివరకూ ఆరు రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపించేవి.కొత్తగా వచ్చిన కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మామూలుగా వచ్చే influenza (flu) కన్నా COVID-19 కనీసం పదింతలు ఎక్కువ ప్రాణాంతకమైనది. COVID-19 నుండి 80% మంది తేలికపాటి లక్షణాలతొ (దగ్గు, జ్వరం)తో కోలుకుంటారు. 10-20 శాతం మందికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. 2-3 % మంది ఈ వ్యాధితో చనిపోతారు.


కరోనా వైరస్ లో అరడజను రకాలున్నాయి. 1) హ్యూమన్‌ కరోనావైరస్‌ 229ఈ
2) హ్యూమన్‌ కరోనావైరస్‌ ఓసీ 43
3) సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌-సీఓవీ)
4) హ్యూమన్‌ కరోనావైరస్‌ ఎన్‌ఎల్‌ 63
5) హ్యూమన్‌ కరోనావైరస్‌ హెచ్‌కేయూ 1
6) మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌ (మెర్స్‌-సీఓవీ)


1.హ్యూమన్ కరోనా వైరస్ 229ఈ (హెచ్ కోవ్-229ఈ): ఇవి ఆల్ఫా కరోనా వైరస్ జన్యువుతో సింగిల్ ఆర్ఎన్ఎను కలిగి ఉంటాయి. కరోనా విరిడే కుటుంబంలోని కరోనా విరినే ఉప కుటుంబానికి చెందినవి.ఇది హ్యూమన్ కరోనా వైరస్ ఓసీ43తో కలిసి సాధారణ జలుబుకు కారణమవుతుంది. ఇది ముదిరితే న్యూమోనియా, బ్రాంకైటిస్లకు దారి తీస్తుంది. దీంతో పాటు హ్యూమన్ రెస్టిరేటరి సిన్ సైటియల్ వైరస్ (హెచ్ఆరఎస్వి) గుర్తించారు. ఏడు మానవ కరోనా వైరస్లలో హెచ్కోవ్ 9ఈ ఒకటైనప్పటికీ వీటిలో హెచ్ కోవ్ ఎన్ఎల్63, హెచ్కోవ్-ఓసీ43 హెచ్ కోవ్-హెచ్ కెయు 1లు ఉన్నాయి. ఇవి ప్రపంచమంతా వ్యాపించాయి. 


2.హ్యూమన్ కరోనా వైరస్ ఓసీ43 (హెచ్ కోవ్-ఓసీ43): ఇది కరోనా విరిడే కుటంబానికి చెందినది. బీటా కరోనా వైరస్ జన్యువును కలిగిన బీటా కరోనా వైరస్ 1 జాతికి చెందినది. ఈ వైరస్ ద్వారా సాధారణంగా 10 నుంచి 15 శాతం వరకు జలుబు వస్తుంది.


3.సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ (సార్స్-కోవ్): సార్స్ 2003, ఏప్రిల్ 6 ఆసియాలో ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యుహెచ్ఓ గుర్తించింది. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, వ్యాధీ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ ద్వారా వస్తుంది. దీని ద్వారా కండరాల నొప్పి, తల నొప్పి, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం 2నుంచి 14 రోజుల్లో దగ్గు, న్యూమోనియా లాంటి శ్వాసకోశ సంబంధ లక్షణాలు కనిపిస్తాయి.


4.హ్యూమన్ కరోనా వైరస్ ఎన్ఎల్63 (హెచ్కోవ్ ఎన్ఎల్ 63): ఈ వ్యాధిని మొదట 2004లో నెదర్లాండ్ లో ఏడు నెలల పాప బ్రాంఖైలిటిస్ తో బాధపడుతున్నప్పుడు గుర్తించారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యూమోనియా లాంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. ఈ వ్యాధి అత్యధిక జనాభా గల ప్రాంతాలలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తుంది.


5.హ్యూమన్ కరోనా వైరస్ HKU1 (హెచ్కోవ్ హెచ్కెయు1): ఈ వైరస్ బీటా కరోనా వైరస్ లో సబ్ గ్రూప్-ఎ కు చెందినది. దీనిని 2005 జనవరితో హాంకాంగ్ లోని ఇద్దరు వ్యాధిగ్రస్తుల్లో గుర్తించారు.


6.మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోవ్-రిలేటెడ్ కరోనా వైరస్.(మెర్స్‌-సీఓవీ): ఇది బీటా వైరస్ జన్యువును కలిగి ఉంటుంది. దీనిని 2012 నావల్ కరోనా వైరస్ (2012 ఎన్ కోవ్) అని పిలుస్తారు. 2012లో నూతన ఫ్లూయూ వ్యాధితో ఉన్న వ్యక్తిలో ఈ వ్యాధిని గుర్తించడం జరిగింది. 2015 జులైలో మెర్స్కోవ్ కేసులను 21 దేశాల్లో గుర్తించారు. ఈ వైరస్ మొదట్లో సార్స్ కరోనా వైరస్ కు భిన్నంగా ఉంది. కానీ 2013, మే 23 తరువాత సార్స్ వైరస్ గా గుర్తించారు.


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత