గత ఆరో తేదీన టోక్యోలో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రుల రెండో సమావేశం జరిగింది. అందులో అమెరికా తరఫున మైక్ పాంపియో, ఇండియా తరఫున జైశంకర్ పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా తాజాగా అమెరికా పాలకవర్గానికి చెందిన ఓ ప్రతినిధి చేసిన వ్యాఖ్య చైనాకు కళ్లెం వేసే అంశాన్ని తెరపైకి తెస్తోంది. వాషింగ్టన్ ఫారిన్ ప్రెస్ సెంటర్లో ఈ అంశాన్ని ఆయన రివీల్ చేశారు. పసిఫిక్ సముద్ర జలాల్లో, హిమాలయ పర్వతశ్రేణుల్లో చాలా దూకుడుగా ముందుకెళ్తున్న చైనాను అడ్డుకోవాలంటే భారత్ లాంటి దేశాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ఏ దేశం ముందుకొచ్చిన తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా వ్యూహాత్మకంగా పలు దఫాలుగా చర్చలు జరపడం, దరిమిలా అమెరికా ప్రతినిధి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నాలుగు దేశాలు ఓ కూటమిగా పని చేయడం లేదని, ఇందులో ఎవరికీ సభ్యత్వం లాంటిది లేదని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి ఏ దేశ సార్వభౌమాధికారానికీ ఇబ్బందులు తలెత్తకుండా అదే సమయంలో కొన్ని దేశాల విస్తరణ కాంక్షకు కళ్లెం వేసే ఎత్తుగడతో ఇలాంటి దేశాలను ఒక్క అవగాహన కిందకు తీసుకొచ్చే ప్రయత్నంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యుద్ధానికి సిద్ధంగా ఉండండి అంటూ చైనా అధ్యక్షుడు జింపింగ్ తన సేనలను అప్రమత్తం చేయడం ప్రపంచవ్యాప్త చర్చగా మారిన విషయం అందరికీ తెలిసిందే.
Comments
Post a Comment
Your Comments Please: