Skip to main content

రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?

హైదరాబాద్ లో రోహింగ్యాల అంశం మరోసారి పెద్ద దుమారమే రేపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భాగవత్ ప్రెస్ మీట్ పెట్టి వారి సంఖ్య ఎంతుందో హడావుడిగా ప్రకటించాల్సి రావడమే.. కేసీఆర్ సర్కారులో కలవరం ఏ స్థాయిలో రేగుతుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్‍లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల మీద, పాకిస్తాన్, బంగ్లాదేశీ చొరబాటుదార్ల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చాలెంజ్ చేయడంతో తేనెతుట్టెను కదిపినట్టయింది. సర్జికల్ స్ట్రయిక్స్ కామెంట్స్ తో ఎంఐఎం, టీఆర్ఎస్ మిత్రులు ఉలిక్కిపడ్డారు. అయితే ఉలికిపాటు బయటికి కనిపించనీయకుండా.. అసలు రోహింగ్యాలు కేంద్రం పరిధిలోని అంశం... దానికి రాష్ట్రంతో సంబంధమేంటని కేటీఆర్ బంతిని అవతలికి తోసేయగా.. మిత్రుడైన అసదుద్దీన్ రోహింగ్యాలకు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డుల్లాంటివి ఒక్కటన్నా ఇచ్చినట్టు రుజువు చేయాలని సవాల్ విసిరారు. 

ఈ క్రమంలో హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని కిషన్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో ప్రకటించిన మరుసటి రోజే రాచకొండ సీపీ పత్రికాముఖంగా ప్రకటించడం సంచలనం రేపుతోంది. రోహింగ్యాలపై తాము దృస్టి సారించామని, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4835 మంది రోహింగ్యాలు ఉన్నారని, వారిలో 4561 మందికి వేలుముద్రలు, ఐరిస్ సేకరించామని, ఎన్నికల తరువాత 274 మంది వివరాలు సేకరిస్తామని చెప్పారు. అంతేకాదు.. ఎంతమంది ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ వోటర్ ఐడీస్, కొందరైతే బ్యాంక్ అకౌంట్లు కూడా కలిగి ఉన్నారని స్వయంగా ప్రకటించారు. 

ఈ మధ్య ఏం జరిగిందో ఎవరైనా ఊహించుకోవచ్చు. గత ఫిబ్రవరిలో తాము రోహింగ్యాలను గానీ, అక్రమంగా ఉంటున్న పాకిస్తాన్ పౌరుల్ని, బంగ్లాదేశీయులను గానీ.. ఎవరినీ ఇక్కణ్నుంచి పంపించే ప్రశ్నే లేదని.. వారికి అన్ని సౌకర్యాలూ దగ్గరుండి చూసుకుంటామని, కేసీఆర్ రోహింగ్యాలను ఆదరిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ చెప్పడం అప్పట్లో తీవ్రమైన విమర్శలకు తావిచ్చింది. పార్టీ అధినేత ఆదేశాల మేరకు అవసరమైతే తెలంగాణ మంత్రి, ఒవైసీతో కలిసి రోహింగ్యాలకు భరోసా ఇచ్చేందుకు సభ నిర్వహిస్తామని గాంధీ బాహాటంగా ప్రకటించారు. 

అయితే నేషనల్ లెవల్ ఇష్యూ అయిన అక్రమ రోహింగ్యాలను దేశం కళ్లుకప్పి హైదరాబాద్ లో దాచిపెడతామన్న ధీమాతో ఉన్న కేసీఆర్ కాస్తా... ఇప్పుడు ఎన్నికల్లో సీన్ టిపికల్ గా మారుతుండడంతో తమ ప్రభుత్వం నిమిత్తమాత్రంగా ఉందని, చాలా క్లీన్ గా ఉన్నామని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడడం వల్లే సీపీ రంగంలోకి దిగి స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చిందా అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. మరోవైపు 2 గంటల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే హుంకరించడం, వారితో పొత్తు లేదని కేటీఆర్ సన్నాయినొక్కులు నొక్కడం, దానికి అక్బరుద్దీన్ కూడా అదే లెవల్లో ఘాటుగా రియాక్టు కావడం.... ఈ సర్కస్ ఫీట్లు చూస్తుంటే.... రోహింగ్యాలతో తమకు ప్రమేయం లేదని చెప్పేందుకే కొత్త స్కెచ్ వేశారా అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే కేసీఆర్ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంతో జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ జరిగిన నష్టం ఎంతనేది ఈనెల 4న చూడాల్సిందే. 

Read: గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

Read: కేసీఆర్ ఎదుర్కోబోయే ప్రమాదాన్ని ముందే చెప్పిన... 

Note: రాచకొండ సీపీ ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు
Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు.  అలాంటి మహా పండితుడికి తగిన గుర్తింపు రాకపోవడం కాస్త చింతించాల్సిన విషయమేనని, అందుకు ఎవర