Skip to main content

గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

గ్రేటర్ ఎన్నికలు జాతీయ అంశంగా మారడంతో అందరి దృష్టీ హైదరాబాద్ మీదనే పడింది. ఎవరు గెలుస్తారు.. ఎవరు గ్రేటర్ పీఠాన్ని ఏలుతారు.. అనేది అందరి మదనీ తొలుస్తున్న అంశం. అందరికన్నా ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, దాని మిత్రుడైన ఎంఐఎం కు మరింత అవసరమైన సబ్జెక్టు. దీని మీద గ్రౌండ్ సర్వేలు కూడా పలు ప్రైవేట్ సంస్థలు చేస్తున్నాయి. నవంబర్ మొదటి నుంచి ఆయా సంస్థలు క్షేత్ర స్థాయిలో పనిచేసి రిపోర్టులను రికార్డు చేస్తున్నాయి. రాజకీయ వ్యాఖ్యానాలు, వేడి పుట్టించే కామెంట్లు వాతావరణాన్ని గంభీరంగా మారుస్తూ... ప్రజల నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 

ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సంస్థల రిపోర్టులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. 

Also Read: రోహింగ్యాల మీద హడావుడిగా ప్రెస్‍మీట్ ఎందుకు పెట్టినట్టు?

                    ఒవైసీలతో స్నేహం కేసీఆర్ కు సవాలేనా?

ఈ వీడియోలో ఇంకా పూర్తి వివరాలు, విశ్లేషణ ఉన్నాయి. చూడండి. 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

రేవంత్ డిమాండ్- తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి

రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని లేకపోతే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభుత్వం చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కరాళ నృత్యం చేస్తుందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం అన్నారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్ ఒత్తిడే ఉందని, ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కొనే ప్రణాళిక రచించాలని రేవంత్ సూచించారు. కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారన్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎ