తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ ఆడటం పురాతనంగా వస్తున్న సంప్రదాయం. ఈ క్రమంలో బొమ్మకల్ గ్రామంలోని పలు వీధుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఆడారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటలవరకు ఆడపడుచులు బతుకమ్మ ఆడి ఆనందం పంచుకున్నారు. అనంతరం వాగుకు వెళ్లి అక్కడ కూడా భారీ సంఖ్యలో మహిళలు చాలాసేపు బతుకమ్మ పాటలు పాడుకొని గౌరీదేవికి వాయనాలు సమర్పించుకున్నారు. అనంతరం వాగులో నిమజ్జనం చేశారు.
తెలంగాణ అంతటా 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుగుతుండగా కరీంనగర్ పక్కనున్న బొమ్మకల్ లో మాత్రం 7 రోజులకే పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడు, కరీంనగర్ పక్కనే ఉన్న కొత్తపల్లి తదితర గ్రామాల్లో కూడా 7 రోజులకే సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు.
Comments
Post a Comment
Your Comments Please: