Skip to main content

Posts

విశాఖలో మరో అగ్ని ప్రమాదం

విశాఖలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. డివ్తెన్ కెమ్ టెక్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది.  టి బోర్డుల్లో ఇది చోటు చేసుకుంది. ప్రమాదాన్ని ఫైర్ సిబ్బంది వెంటనే పసిగట్టారు. మంటలను అదుపు చేశారు. ఇది లాకౌట్ లో ఉన్న పరిశ్రమ కాబట్టి  ఎటువంటీ ప్రాణ నష్టం జరగలేదు.   

ఆన్ లైన్లో సంస్కృత భాష

సామాన్యులకు సంస్కృత భాషను ఉచితంగా అందించేందుకు సంస్కృత భారతి అనే సంస్థ దాదాపు గత 40 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ఇందుకోసం వివిధ పాఠాలను, పాఠ్యక్రమాలను వారు రూపొందించారు. అదే క్రమంలో పిల్లల్లో సంస్కృతభాష ద్వారా ఉత్తమ సంస్కారాన్ని కలిగించి భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలలో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో బాలకేంద్రాలను దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. సంస్కృతభారతీ-ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ 5వ తేదీ నుంచి బాలకేంద్రాన్ని ఆన్ లైన్ లో నిర్వహించబోతోంది. ఆసక్తి కలవారు ఈ అప్లికేషన్ పూర్తిచేసి పంపి సంస్కృతాన్ని అభ్యసించొచ్చు.  1. శిక్షణ పూర్తిగా ఉచితం. శుల్కము లేదు. 2. వారంలో 2 రోజులు, సోమవారం, మంగళవారాలలో రోజుకు ఒక గంట చొప్పున తరగతులు ఉంటాయి. 3. ఆంధ్రప్రదేశ్ లో 1 నుండి 8 తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్ధులు అర్హులు. 4. ఆండ్రాయిడ్ మొబైల్ లేదా కంప్యూటర్ లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. 5. 4G ఇంటర్నెట్, స్పీకర్ లేదా హెడ్ ఫోన్ ఏర్పాటు చేసుకొనవలెను. 6. మీకు అనుకూలమైన ఏదోక సమయాన్ని ఎంచుకోవచ్చు.  8. 3-10-20 తేదీన తరగతుల వివరాలు ఈమెయిల్ ద్వారా పంపిస్తారు.   తరగతులు 05-10-20 నుండి మొదలవుతాయి. చి

బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి ఇద్దరు తెలుగు మహిళలు

కొత్తగా ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు మహిళా నేతలకు కీలక స్థానాలు కల్పించారు. తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డి.కె. అరుణ, ఏపీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించారు. అలాగే ఓబీసీ మోర్చాకు బాధ్యుడిగా తెలంగాణ మాజీ అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ ను నియమించారు. మొత్తానికి 12 మంది ఉపాధ్యక్షులను, 8 మంది ప్రధాన కార్యదర్శులను, ముగ్గురు జాయింట్ జనరల్ సెక్రటరీస్, 13 మంది కార్యదర్శులు, కోశాధికారిగా రాజేశ్ అగర్వాల్, 23 మంది అధికార ప్రతినిధులను నియమించారు.  అఖిల భారత ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అగర్వాల్ పేరు మీద నియామకాలు జారీ అయ్యాయి.   

ప్రజల కోసం పని చేసేవారికి ఏ కార్పొరేట్ శక్తుల అండా అవసరం లేదు

ప్రజలకు సేవ చేయడానికి, సామాజిక అభ్యున్నతి కోసం పాటు పడడానికి, అందుకోసం రాజకీయ పార్టీలు నడపటానికి కార్పొరేట్ శక్తుల మద్దతు అవసరం లేదని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, యూపీలో కాన్షీరామ్ స్థాపించిన బీఎస్పీ పవర్ లోకి రావడానికి, 1984లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అధికారంలోకి రావడానికి ఏ కార్పొరేట్ శక్తి కూడా పని చేయలేదని, తొలినాళ్లలో ఎన్టీఆర్ కు ఆయన సొంత కులం వాళ్లే సహకరించలేదని చంద్రకుమార్ అన్నారు. మొక్కవోని దీక్ష, చిత్తశుద్ధి మాత్రమే ఏ నాయకుణ్నయినా, ఏ పార్టీనైనా ముందుకు నడిపిస్తాయన్నారు. ప్రజల కోసం చేసే నిస్వార్థపూరితమైన మంచిపని ఏదైనా ఎంతో ఆత్మతృప్తిని కలిగిస్తుందని, ఎంతో ఆనందాన్నిస్తుందని, అదే అన్నిటికన్నా విలువైందన్నారు. భావి సమాజాన్ని కాంక్షిస్తూ తాను రాసిన "మంచి మార్పు కోసం" అనే పుస్తకంతో పాటు సీడీని హైదారాబాద్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పలు సందర్భాల్లో చేసిన చిన్నపాటి తప్పిదాలు చరిత్రలో సరిదిద్దుకోలేని ఘోరాలుగా మారతాయని, 1948 న

విశ్వకర్మ పూజోత్సవానికి సిద్ధమవుతున్న బ్రహ్మగిరి

ప్రతియేటా సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు విశ్వకర్మ సామాజికవర్గమంతా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ సంబరాల్లో మునిగి తేలుతుంది. విశ్వ సృష్టికర్త, విశ్వ రచనా దురంధరుడు అయిన విశ్వకర్మను స్మరించుకోవడం, విశ్వ జనావళి బాగోగుల కోసం సరికొత్త కార్యకలాపాల గురించి యోచించడం, ఆచరణ మార్గాలు అన్వేషించడం విశ్వకర్మల సామాజిక ధర్మం. ఇందులో భాగంగానే సౌరమానం ప్రకారం ప్రతియేటా జరుపుకునే విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం గురించి చేవెళ్లలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చేవెళ్లలోని బ్రహ్మగిరిపై దాదాపు పదేళ్లుగా శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు, విశ్వకర్మ యజ్ఞమహోత్సవం జరుపుతున్నారు. ఈసారి కరోనా కారణంగా భారీ స్థాయిలో జరుపుకోకపోయినా.. నిర్వహణలో లోటు రాకుండా పరిమితులు పాటిస్తూ శ్రద్ధాభక్తులతో జరుపుకోవాలని చేవెళ్ల విశ్వబ్రాహ్మలు తీర్మానించుకున్నారు. మరోవైపు విశ్వకర్మ పూజోత్సవ ఏర్పాట్లలో భాగంగా వంటశాల చదును చేయడం, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడడం, గుట్టపై పెరిగిన కలుపును తీసిపారేయడం, మట్టిపని వగైరా పనుల్లో నిమగ్నమయ్యారు. అడ్వొొకేట్ బాలాచారి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్వాహకులు లింగాచారి, మాణిక్

పాతాళగంగలో ఉబ్బలి బసవన్న - చదివి తీరాల్సిన కథ

పూర్వం శ్రీశైల ప్రాంతం లోని బ్రహ్మగిరి సమీపం లో మహా విశ్వకర్మ వంశోద్భవుడు, మహా శివభక్తుడైన బసవాచార్యుడను ఒక శిల్పాచార్యుడు వుండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామి ని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి యింటికి చేరిన శిల్పాచార్యులు సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు.  తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. శిల్పి నక్త వ్రతాన్ని (ఉదయంనుండి భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు) పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా వున్న నందులను చూసి ఆనందించాడు. కానీ ఏమి లాభం? వెంటనే విచారంలో మునిగి పోయాడు. ఈ మహత్తర నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి? అన్నదే అతని బాధ. మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి మరి. నిద్రకూడా పట్టలేదు. అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పాచార్యుడు. వెంటనే ఒక కల. కలలో స్వామి కరుణించాడు. స్వామి శిల్పితో యిలా అన్నాడు. భక్తా! నీ సంకల్పం మహత్తర మైనది. నీ శ్రమ ఫలించింది. ఇవిగ

జయశంకర్ సార్ స్ఫూర్తితో ముందుకు సాగాలి

తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఉన్నతాశయాలను అనుసరిస్తూ ముందుకు సాగాలని హైదరాబాద్ ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, పీజేఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేపూరి లక్ష్మణాచారి ఆకాంక్షించారు. నేటితరం విద్యార్థులు, యువకులు రేపటితరం యోగక్షేమాల కోసం పని చేసినప్పుడే ఆదర్శవంతమైన సమాజం సిద్ధిస్తుందని చేపూరి అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 86 జన్మదిన వేడుకలను చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని లలితా బాగ్ డివిజన్ తానాజీ నగర్ లో నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చేపూరి లక్ష్మణాచారి, సి అనీశ్ ఆచారి, తోట శ్రీనివాసాచారి, సి అభిషేక్ ఆచారి, వేణు, అశోక్, బొడ్డుపల్లి యాదగిరి ఆచారి తదితరులు పాల్గొన్నారు.