బిహార్ ఎన్నికల పుణ్యాన కోవిడ్-19 వ్యాక్సిన్ ఎన్నికల హామీగా మారిపోయింది. రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బిహార్ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అంటూ ప్రకటించడం దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో కూడా చర్చాంశంగా మారింది. మరుసటి రోజు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా ఫ్రీ-వ్యాక్సిన్ నినాదాన్ని ఎత్తుకున్నాయి. తమిళనాడు, కర్నాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ ను ఫ్రీ అంటూ ప్రకటించాయి. అదే బాటలో తెలంగాణ కూడా ఫ్రీ-వ్యాక్సిన్ కు ఓటేసింది. ఈటల రాజేందర్ ఇదే అంశాన్ని కన్ఫామ్ చేస్తూ ప్రజలందరికీ ఫ్రీ-వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని, పౌరుల ఆరోగ్య భద్రత అనేది రాష్ట్రాల బాధ్యతే అయినా.. కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి బయట పడాలంటే కేంద్ర, రాష్ట్రాలు కలిసి ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ తీసుకొచ్చిన ఫ్రీ-వ్యాక్సిన్ నినాదం మీద పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తినా... ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ అంశాన్ని పాజిటివ్ తీసుకొని తమ విధానాలు ప్రకటించడం గమనించాల్సిన అంశం. తెలంగాణ మంత్రి ఈటల కూడా కేంద్రాన్ని విమర్శించకుండా తమ తయారీలో తాముంటామని చెప్పడం విశేషం.
కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
Comments
Post a Comment
Your Comments Please: