జనమెరిగిన నాయకుడు జానారెడ్డికి….. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటారనే పేరుంది. నియాజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఆయనలో ఉంది. కాంగ్రెస్ కు అధికారం వస్తే ముఖ్యమంత్రి రేసులో ముందుండే వ్యక్తి ఆయనే. గతంలోనే ఆయన తన కుమారుడికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం రాలేదు. అలాంటి జానారెడ్డి బీజేపీలో చేరతారా? కమలనాథులు జానాకు గవర్నర్ పదవి ఆఫర్ చేశారా.. ? లేక జానారెడ్డినే తనకు గవర్నర్‌గిరీ కావాలని, తన కుమారుడికి నాగార్జునసార్ ఉపఎన్నిలల్లో టికెట్ ఇవ్వాలని అడిగారా? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది. నాగార్జునసాగర్ ఎంఎల్ఏ నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో జానారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై చర్చకు దారితీసింది. సాగర్ కు జరిగే ఉపఎన్నిలను తమకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని మరోమారు చాటి చెప్పాలని చూస్తున్న బీజేపీ నేతలు.. అందుకు సాగర్‌లో తగిన నాయకుడు జానారెడ్డే కాబట్టి ఆయన్ను ఎలాగైనా తమ పార్టీలోకి లాగాలని గట
BHAGYANAGAR POST (BNP) news/views website is pride of Telugu People. It has un-detachable heartly bond with both the Telugu States. BNP covers Greater Hyderabad Political developments besides the cultural richness and social forwardness of Telangana and Andhrapradesh. Especially it contributes the dynamic political dimensions of Telugu Leaders.