Skip to main content

Posts

ఫ్రంట్ లైన్ వారియర్స్ కి అవార్డులు, సన్మానాలు

కరోనా ఆపత్కాలంలో భయంకరమైన వైరస్ కి భయపడకుండా పేదలు, అన్నార్తుల ఆకలి కేకలు విని స్పందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను మోర్డ్ స్వచ్ఛంద సంస్థ  ఘనంగా సత్కరించింది. వారు చేసిన సేవలను ప్రపంచానికి చాటే ఉద్దేశంతో హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ ప్లానిటోరియంలోని ఆడిటోరియంలో అర్హులైనవారికి గోల్డెన్ లీడర్స్ ఎక్సలెన్సీ అవార్డ్స్ అందజేశారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు సముద్రాల వేణుగోపాలాచారి హాజరయ్యారు. సమాజ సేవలో ముందుండి పోరాడిన యోధులను సన్మానించుకోవడం మంచిదన్నారు. దీనివల్ల ఇలాంటి సేవాతత్పరులు ఇంకా ముందుకొచ్చి మేలైన సమాజానికి తోడ్పాటునందించే అవకాశం లభిస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగాగురు రాందేవ్ బాబా శిష్యుడైన రామకృష్ణదేవ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్స్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రముఖ నటుడు, సోషల్ వర్కర్ టార్జాన్ లక్ష్మినారాయణ, నిర్మాత, దర్శకుడు రామసత్యనారాయణ, నటుడు మాణిక్ రావు, డాక్టర్ ఎ.శ్రీనివాస్, డాక్టర్ ప్రశాంత్, కాం

లాండ్రీ, దోభీఘాట్లకు ఫ్రీ పవర్.. అంతకుమించి అడగొద్దు

గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నెలకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. లాండ్రీలకు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సినిమా పరిశ్రమకు ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించారు.  మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు: - ఎన్నికల ప్రణాళికలనేవి కేవలం కాగితాలకే పరిమితమైపోతున్న నేటి రాజకీయాల్లో 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తాను ప్రకటించిన పార్టీ ప్రణాళిక (మేనిఫెస్టోను వందకు వంద శాతం అమలు చేసిందని సగర్వంగా ప్రకటిస్తున్నాం. కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాదు... చెప్పని అంశాలను కూడా అనేకం ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచి అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి రాజకీయాల్లో ఇదో అరుదైన అంశం. మాకు తెలంగాణ ప్రజల పట్ల, హైదరాబాద్ అభివృద్ధిపై ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనం. మేం చెప్పనవి, అమలు చేసిన పలు కార్యక్రమాలు. • నగర ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాల కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. దీనిపై మేం మేనిఫెస్టోలో చెప్పలేదు. చెప్పకపోయినా అమలు చేశాం. నగరంలో 350 బస్త

ఆ లోగుట్టు ఒవైసీకే ఎరుక

ఏ దారెటు పోతుందో ఎవరికెరుక? ఆ దారి వేసినవారికి తప్ప. ఎవరెన్ని పరుగులు కొట్టారన్న కొలబద్దే మ్యాజిక్ ఫిగర్ ను శాసిస్తున్న నడుస్తున్న రాజకీయాల్లో ఏ పార్టీ ప్రయాణం ఏ దిశగా సాగుతుందని ఆలోచించే తీరుబడి గానీ, అవసరం గానీ అటు ప్రజలకైనా, ఇటు పార్టీలకైనా అక్కర్లేని మ్యాటరైపోయింది. బిహార్లో 5 సీట్లు అందుకొని ఫస్ట్ ఇన్నింగ్స్ తోనే జోష్ పెంచుకున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) పార్టీని లైట్ తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆవేశం కన్నా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ముందుకెళ్తుండడం జాతీయ పార్టీలకు సైతం కనువిప్పు కావాల్సిన సందర్భం. బిహార్లో ఎంఐఎం సూపర్ పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా ఈ మాటే చెప్పుకుంటున్నారు. మొదట్నుంచీ యాంటీ బీజేపీ, యాంటీ నేషనలిస్ట్ పాలసీలతో ముందుకెళ్తున్న ఎంఐఎం.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు బహుదూరం జరిగిపోయింది. మునుగుతున్న నావలో ఎవరైనా ఎంతకాలం కొనసాగుతారు? ఆ పార్టీ నేతలే రాజకీయ భవిష్యత్తు వెదుక్కుంటూ అత్యంత శక్తిమంతంగా ఎదిగిన బీజేపీ గూటిలో చేరిపోతున్నారు. మరికొందరేమో ప్రాంతీయ పార్టీలతో కలిసిపోతున్నారు. అలాంటప్పుడు కేవలం సెక్యులరిజం, భావస

బీజాపూర్ జిల్లాలో పేలిన ప్రెషర్ బాంబు

బీజాపూర్ జిల్లాలో ప్రెషర్ బాంబు పేలి 209 బెటాలియన్ జవాన్ నిర్మల్ కుమార్ సాహు కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పధకం కింద రహదారి పై మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఒక చోట రెండు కేజీల ఐఈడి మందుపాతరను పెట్టగా బీడీఎస్ బృందాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. అదే క్రమంలో మరో చోట పెట్టిన ప్రెషర్ బాంబు పేలుడు కు జవాన్ గాయపడ్డారు.

నగ్రోటా చొరబాటు: 26/11 మోడల్ ఆపరేషన్ కోసమేనా?

   జమ్మూ జిల్లా నగ్రోటా ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు టెర్రరిస్టులు భారీ కుట్రతోనే దేశంలోకి చొరబడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఇవే అంశాలు వెలుగుచూశాయి. హోంమంత్రి అమిత్ షా, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ ఎజిత్ దోవల్, ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లాతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు నగ్రోటా ఎన్ కౌంటర్ పై సమీక్షించారు. 2008 నవంబర్ 26న ముంబై మీద జరిగిన టెర్రరిస్టు దాడి తరహాలోనే తాజాగా కాశ్మీర్ లో భారీ కుట్రకు ప్లాన్ చేశారని భద్రతా దళాలు అంచనా వేశాయి. మరో వారం రోజుల్లో ఆనాటి భారీ అటాక్ జరిగిన దినం సమీపిస్తున్న దృష్ట్యా ఉగ్రవాదులు ట్రక్ లో దాక్కొని మళ్లీ అలాంటి భయానకమైన దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసిన విషయంపై చర్చించారు.  గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు హతమవడం, ఆ తరువాత కొన్ని గంటల్లోనే పీఓకే లోని టెర్రరిస్టు స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేయడం గమనించాల్సిన అంశం. అలాగే జమ్మూ-కాశ్మీర్ లో జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా భీకరమైన దాడులకు పాల్పడి కాశ్మీర్ లో

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు మోక్షం ఎప్పుడు?

- కేటీఆర్‍కు టీయూడబ్ల్యూజే వినతిపత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం మరోసారి తెరమీదికొచ్చింది. దీర్ఘకాలికంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాలకు మోక్షం లభించేది ఎప్పుడని, ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కోర్టుల్లో వేలాది పిటిషన్లు దాఖలైన సందర్భాల్లో వాటిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం... జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం కోర్టు సాకుతో కాలయాపన చేయడం సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అభిప్రాయపడింది. మంత్రి కె.తారకరామారావుతో  హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన "మీట్-ది-ప్రెస్" కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు గడుస్తున్నా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోవడం విచారకరమన్నారు. మూడేళ్ళుగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో తిరస్కరణకు గురవుతుండడంతో పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారని, మరెందరో అప్పులు చేసి చికిత్స పొందినట్లు విరాహత్

అనతికాలంలోనే రూ. 2600 కోట్ల టర్నోవర్

హైదరాబాద్ సరూర్ నగర్ సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ టర్నోవర్ రూ. 2600 కోట్లు దాటిందని ఆ సొసైటీ ఎమ్మెస్సార్వీ ప్రసాద్ తెలిపారు. 23 ఏళ్లుగా ప్రజల మన్ననలు అందుకుంటూ సంస్థ దినదినం అభివృద్ధి చెందుతూ ఉందని, వారి విశ్వాసంతో తమ సంస్థ ఇంకా ఎదుగుతుందని ఆకాంక్షించారు. 23 వ సర్వసభ్య సమావేశం కూకట్ పల్లిలోని ఎన్.ఆర్.సీ గార్డెన్ లో జరిగిన సందర్భంగా కస్టమర్ల మన్నన చూరగొనడం తమ అదృష్టమన్నారు ప్రసాద్. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సమావేశం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వాసిరెడ్డి హనుమంతరావు చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. M.S.R.V ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. సొసైటీ డైరెక్టర్ జె.సత్యనారాయణ వందన సమర్పణ చేశారు.