Skip to main content

ఆ లోగుట్టు ఒవైసీకే ఎరుకఏ దారెటు పోతుందో ఎవరికెరుక? ఆ దారి వేసినవారికి తప్ప. ఎవరెన్ని పరుగులు కొట్టారన్న కొలబద్దే మ్యాజిక్ ఫిగర్ ను శాసిస్తున్న నడుస్తున్న రాజకీయాల్లో ఏ పార్టీ ప్రయాణం ఏ దిశగా సాగుతుందని ఆలోచించే తీరుబడి గానీ, అవసరం గానీ అటు ప్రజలకైనా, ఇటు పార్టీలకైనా అక్కర్లేని మ్యాటరైపోయింది. బిహార్లో 5 సీట్లు అందుకొని ఫస్ట్ ఇన్నింగ్స్ తోనే జోష్ పెంచుకున్న మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) పార్టీని లైట్ తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆవేశం కన్నా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ముందుకెళ్తుండడం జాతీయ పార్టీలకు సైతం కనువిప్పు కావాల్సిన సందర్భం. బిహార్లో ఎంఐఎం సూపర్ పర్ఫామెన్స్ చూసిన ఎవరైనా ఈ మాటే చెప్పుకుంటున్నారు.

మొదట్నుంచీ యాంటీ బీజేపీ, యాంటీ నేషనలిస్ట్ పాలసీలతో ముందుకెళ్తున్న ఎంఐఎం.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు బహుదూరం జరిగిపోయింది. మునుగుతున్న నావలో ఎవరైనా ఎంతకాలం కొనసాగుతారు? ఆ పార్టీ నేతలే రాజకీయ భవిష్యత్తు వెదుక్కుంటూ అత్యంత శక్తిమంతంగా ఎదిగిన బీజేపీ గూటిలో చేరిపోతున్నారు. మరికొందరేమో ప్రాంతీయ పార్టీలతో కలిసిపోతున్నారు. అలాంటప్పుడు కేవలం సెక్యులరిజం, భావసారూప్యం అనే పనికిమాలిన భుజ కిరీటాలు తగిలించుకోవడం కోసం... కాలిపోతున్న కొంపలో ఎవరైనా నిద్రపోతారా? అందుకే 2019 ఎన్నికల్లోనే సొంతంగా పోటీ చేసి సత్తా చాటుకోవాలని అసద్ భావించారు. ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న సీమాంచల్ మీద కన్నేశారు. అప్పుడు స్కోర్ కార్డు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడదే సొంతింటి పాత చింతచెట్టు బిహార్లో 5 కాయలు కాసింది. ఇదే విషయం నిన్నటి మిత్రుడైన కాంగ్రెస్ కు ఓ పట్టాన బుర్రకెక్కడం లేదు. మనం కోల్పోయిందేంటి? లోపం ఎక్కడ జరిగింది? సరిదిద్దుకోవడం ఎలా? అనే అర్థం కాని ప్రశ్నల చిక్కుముళ్లు కాంగ్రెస్ శిబిరంలోని సీనియర్లను బేజారెత్తిస్తున్నాయి.

ఇస్లామిక్ మతవాదానికి సెక్యులరిజం రంగేసి శెభాష్ అనిపించుకోవడంలో ఆరితేరిన అసదుద్దీన్ కు.. బీజేపీ పొడ ఎలాగూ గిట్టదు. కానీ కాంగ్రెస్ కు కూడా దూరమై పెద్ద సాహసమే చేశారు. అయితే సాహసమైనా చేస్తాను గానీ.. మనసు చంపుకొని సర్దుబాటు చేసుకోవడం తన వల్ల కాదనే ఒవైసీ... సింగిల్ గానే ఎన్నికల గోదాలోకి దిగారు. అయితే ఫక్తు మతవాద పార్టీ అయిన మజ్లిస్ సింగిల్ గా దిగితే ప్రజలు హర్షించరనేది ఒవైసీకి బాగా తెలుసు. దానికి దళిత, బహుజన, సెక్యులర్ అనే కలర్ ఫుల్ కాంబినేషన్ కావాలి. అందుకే బీఎస్పీ, సమాజ్ వాదీ జనతాదళ్ డెమొక్రటిక్ (ఎస్జేడీడీ), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ), సుహేల్దేవ్ భారతీయ సమతా పార్టీ (ఎస్బీఎస్పీ), జనవాదీ సోషలిస్ట్ పార్టీ (జేపీఎస్) వంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ (జీడీఎస్ఎఫ్) అనే ఉమ్మడి దుకాణం తెరిచారు. ఆ కూటమి నుంచి బీఎస్పీ ఒక్క సీటు, ఎంఐఎం 5 సీట్లు గెల్చుకుంటే మిగతావేవీ ఖాతా తెరవలేదు. వాటికంత సీన్ లేదన్న విషయం కూడా ఒవైసీకి బాగానే తెలుసు. ఆయనకు కావాల్సింది తన సీట్ల సంఖ్య... తనకంటూ చెప్పుకోవడానికి ఓ సెక్యులర్ ఇమేజ్. సరిగ్గా ఈ దిశగానే ఒవైసీ ప్రయాణం సాగుతుందన్న విషయం.. ఎంఐఎం అధినేత కామెంట్లను, అప్పుడప్పుడూ వ్యక్తం చేసే అసహనాన్ని గమనిస్తే సులభంగానే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ తో కలిసిపోతే సెక్యులర్ అనే ముద్ర ఉంటుందేమో తప్ప.. సీట్లు మాత్రం రావన్నది ఆయనకు కన్ఫామ్ అయిపోయింది. పైగా ఎప్పుడూ హిందూ వ్యతిరేక వైఖరిలో ముందుండే కాంగ్రెస్.. రామజన్మభూమి విషయంలో కొత్త స్టాండు తీసుకొని.. రామమందిరాన్ని స్వాగతించింది. అకస్మాత్తుగా కాంగ్రెస్ ఈ వైఖరి ఎందుకు ఎత్తుకుందో తెలియనంత అమాయకుడు కాదు అసద్. అధికారానికి దూరమై అల్లాడుతున్న కాంగ్రెస్ నేతలు.. అవసరమైతే మైనారిటీలను వదిలేసి మెజారిటీ పల్లవి అందుకుంటారని, భవిష్యత్తులో అదే జరిగితే మైనారిటీ వాయిస్ కు మెజారిటేరియన్ ప్లేస్ దక్కకుండా పోతుందని భయపడ్డారు. అందుకే ఎవరో ఒకరి ఊతంతో ఎన్నికల నదిని సింగిల్ గానే ఈదాలని డిసైడయ్యారు. మైనారిటీలు మెజారిటీగా ఉన్న సీమాంచల్ లో పోటీ చేశారు. 5 సీట్లు రాబట్టారు. జీడీఎస్ఎఫ్ కూటమిలో పెద్దన్నగా ఎదిగారు. అంతేకాదు.. ఇదే కూటమితో రేపు పశ్చిమబెంగాల్, యూపీ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసి జాతీయ పార్టీ అనిపించుకోవాలని తహతహలాడుతున్నారు.


ఇప్పుడందరి దృష్టీ అసదుద్దీన్ మీదే ఎందుకు ఫోకస్ అయిందంటే.. తన పంచె తాను సర్దుకుంటూ పక్కవాడి పంచె కూడా సర్దుతున్నట్టు కనిపించడంలో అసదుద్దీన్ అత్యద్భుతమైన ప్రతిభ కనబరిచారు. బడుగులు, బలహీనులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అనే నినాదం ఎత్తుకుంటూనే తాను ఆధారపడింది మాత్రం పూర్తిగా మైనారిటీల ఓట్ల మీదనే. ఇంకా చెప్పాలంటే కేవలం ముస్లింల ఓట్ల మీదనే అనేది నిర్వివాదాంశం. అంటే ముస్లింల ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాక దాన్ని మరింత పటిష్టం చేసుకునే పనిలో అసద్ భాయి చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారు. మొదట్నుంచీ మైనారిటీల కోసమే పుట్టి, మైనారిటీల కోసమే పనిచేస్తున్న పార్టీ... మెజారిటీ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలను పట్టించుకుంటుందా? సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా, విదేశీ ముస్లింలు, అక్రమ చొరబాటుదార్లకైనా పౌరసత్వం నిరాకరించరాదంటూ దేశవ్యాప్త ఉద్యమాల్లో పాల్గొన్న ఎంఐఎం.. ఎప్పుడైనా హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల విషయంలో పల్లెత్తు మాట మాట్లాడిందా? అక్కడిదాకా ఎందుకు? ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ గానీ, ఆయన పార్టీ మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ గానీ నేరుగా హిందువులనే బెదిరించినప్పుడైనా, ఇంకా దేశద్రోహ వ్యాఖ్యలు చేసిన ముస్లిం నాయకుల విషయంలోనైనా ఒవైసీ మాట్లాడారా? కనీసం మాటవరుసకైనా ఖండించాలని ఆయనకు అనిపించిందా? అంటే అర్థమేంటి? ఎంఐఎం ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? ఏ శక్తులను ఎందుకోసం కలుపుకుంటోంది? ఆయనకుండే మైనారిటీ ఓట్ల పాజిటివ్ స్ట్రెంగ్త్ ఆయన కూటమిలోని ఇతర పార్టీలకు ఉంటుందా? ఎంఐఎం ఏ దిశగా ప్రయాణిస్తుందో చూచాయగా చెబుతున్న బిహార్ ఫలితాలే రేపటి రాజకీయ సమీకరణాలను శాసించబోతున్న బిట్టర్ ఫ్యాక్టర్.


Comments

Popular posts from this blog

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.